Tollywood actors in a single frame: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు.. అఖిల్ అక్కినేని కూడా-megastar chiranjeevi nagarjuna mahesh babu and akhil akkineni partying in maldives ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood Actors In A Single Frame: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు.. అఖిల్ అక్కినేని కూడా

Tollywood actors in a single frame: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు.. అఖిల్ అక్కినేని కూడా

Galeti Rajendra HT Telugu

Tollywood Heroes in a single frame: మాల్దీవుల్లో టాలీవుడ్‌లోని ప్రముఖ హీరోలు పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారు. నలుగురు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు.

Tollywood Heroes in a single frame

టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లోకి రావడం చాలా అరుదు. ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ సినిమాలు పెరిగాక.. ఒకరిద్దరు కలుస్తున్నారు. కానీ.. సినిమా పంక్షన్లలో మినహా బయట మాత్రం ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు ఒకే చోట కనిపించడం చాలా రేర్‌. అయితే.. గురువారం సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్‌గా మారింది.

ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు యంగ్ హీరో అక్కినేని అఖిల్ కూడా కనిపించాడు. అంతేకాదు.. ఇదే ఫ్రేమ్‌లో నమ్రత శిరోద్కర్ కూడా ఉండటంతో ఫోటోకి మరింత అందం తోడైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

భారత్‌కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ మాల్దీవుల్లో ఇచ్చిన విందుకి టాలీవుడ్ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ విందు వెళ్తూనే కాబోలు మహేష్ బాబు, అఖిల్ అక్కినేని ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరోలు ఇలా మాల్దీవుల్లో రిలాక్స్ అవుతూ కనిపించడంతో ఎంజాయ్ చేయడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

విశ్వంభర

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్‌తో బిజిబిజీగా ఉన్నాడు. డైరెక్టర్ వశిష్ట.. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా.. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.

కుబేరా, కూలీ

అక్కినేని నాగార్జున మాత్రం.. ఇటీవల మల్టీ స్టారర్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో నాగార్జున ఒక గెస్ట్ రోల్ చేస్తుండగా.. రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా వస్తున్న కుబేరలోనూ ఒక చిన్న క్యారెక్టర్‌ని నాగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళితో బిజీ

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. గుంటూరు కారంతో ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సూపర్ స్టార్.. రాజమౌళి సినిమా కోసం ఏ ప్రాజెక్ట్‌‌నీ ఓకే చేయలేదు. దాంతో మళ్లీ తెరపై మహేష్ బాబుని చూడాలంటే కనీసం 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.

సినిమాలపై నో అప్‌డేట్స్

అఖిల్ అక్కినేని ఈమధ్య తన సినిమాల గురించి అప్‌డేట్స్ ఇవ్వలేదు. కానీ.. ఏదో పీరియాడిక్‌ మూవీ కోసం మేకోవర్‌ అయినట్లు కనిపిస్తోంది. ‘లెనిన్‌’ టైటిల్‌‌తో ఒక సినిమా రాబోతోందని ఇటీవల వార్తలు రాగా.. యూవీ క్రియేషన్స్‌లో ‘ధీర’ అనే టైటిల్‌తో ఒక సినిమా‌ని అఖిల్ చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.