Mahesh Babu Teja Sajja: తేజ సజ్జపై మండిపడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. ఆ వీడియో వైరల్ కావడంతో క్షమాపణ చెప్పాలంటూ..-mahesh babu fans demand apology from teja sajja for his comments at iifa utsavam awards ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Teja Sajja: తేజ సజ్జపై మండిపడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. ఆ వీడియో వైరల్ కావడంతో క్షమాపణ చెప్పాలంటూ..

Mahesh Babu Teja Sajja: తేజ సజ్జపై మండిపడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. ఆ వీడియో వైరల్ కావడంతో క్షమాపణ చెప్పాలంటూ..

Hari Prasad S HT Telugu

Mahesh Babu Teja Sajja: తేజ సజ్జపై మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐఫా ఉత్సవం అవార్డుల సెర్మనీలో రానా దగ్గుబాటితో కలిసి అతడు గుంటూరు కారం మూవీపై చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు.

తేజ సజ్జపై మండిపడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. ఆ వీడియో వైరల్ కావడంతో క్షమాపణ చెప్పాలంటూ..

Mahesh Babu Teja Sajja: ఐఫా ఉత్సవం అవార్డుల సెర్మనీలో హోస్టులుగా ఉన్న తేజ సజ్జ, రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ ఆయా హీరోలు, దర్శకుల అభిమానులను నొప్పిస్తున్నాయి. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ పై రానా చేసిన కామెంట్స్ కు దర్శకుడు హరీష్ శంకర్ ఘాటుగా స్పందించగా.. ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం మూవీపై తేజ సజ్జ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

నోరు జారిన తేజ సజ్జ

ఐఫా ఉత్సవం అవార్డుల్లో భాగంగా హోస్టుగా వ్యవహరించిన తేజ సజ్జ గురించి రానా దగ్గుబాటి ఇచ్చిన ఇంట్రడక్షన్ వివాదానికి కారణమైంది. ఈ సెర్మనీలో తేజ సజ్జ గురించి రానా పరిచయం చేస్తూ.. "ఇంకా అలానే ఉన్నాడు. కాంట్రవర్సీలకు దూరంగా.. చాలా తక్కువగా మాట్లాడతాడు.. లక్షల మంది హార్ట్ థ్రోబ్. లవర్ బాయ్.. ది యాక్షన్ స్టార్..ది వన్ అండ్ ఓన్లీ.." అని చెబుతూ వెళ్లాడు.

అప్పుడు జోక్యం చేసుకున్న తేజ సజ్జ.. "ఇంత బిల్డప్ నా గురించి అవసరమంటావా చెప్పు" అని అంటాడు. దీనిపై రానా స్పందిస్తూ.. నేను చెప్పింది మహేష్ బాబు గురించని అనడంతో.. మరి ఇదంతా నాకు సింక్ అయిందేంటి అని తేజ అన్నాడు. ఆ తర్వాత రానా రియాక్ట్ అవుతూ.. "అవును కరెక్టే.. ఇద్దరూ చైల్ట్ ఆర్టిస్ట్సే, అతడేమో సూపర్ స్టార్.. నువ్వేమో సూపర్ హీరో.. ఇద్దరూ సంక్రాంతికే వచ్చారు" అని అనబోతుండగా తేజ ఆపాడు. ఆ సంక్రాంతి టాపిక్ మాట్లాడకు అని అనడంతో ఎందుకు అంత సెన్సిబుల్ టాపికా అని రానా అంటాడు.

మహేష్ బాబు ఫ్యాన్స్ సీరియస్

ఈ ఏడాది సంక్రాంతికి ఏం జరిగిందో తెలుసు కదా. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ నటించిన హనుమాన్ అప్పుడే రిలీజయ్యాయి. గుంటూరు కారం బోల్తా పడగా.. హనుమాన్ మాత్రం అన్ని సంక్రాంతి రికార్డులను తిరగ రాసింది. అందుకే ఆ టాపిక్ మాత్రం వద్దంటూ గుంటూరు కారం మూవీ గురించి తేజ చులకనగా మాట్లాడాడంటూ మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఒక్క సినిమా హిట్ అయితే.. ఇంత బిల్డప్ ఇవ్వాలా.. మహేష్ 25 ఏళ్లుగా ఇలాంటివి ఎన్ని చూశాడంటూ అతన్ని ఏకిపారేస్తున్నారు. తేజ క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. నువ్వు, రానా కలిసి గుంటూరు కారం సినిమాను కావాలని తక్కువ చేసి చూపించారంటూ వాళ్లు మండిపడుతున్నారు. హనుమాన్ సీక్వెల్ తోనూ అలాంటి సక్సెసే అందుకో.. అప్పుడు చూద్దామంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు.