Mahesh Babu: మరీ ఇంత చీప్ కామెంట్స్ చేస్తారా: కొండా సురేఖపై మండిపడిన మహేష్ బాబు.. ఇంతకంటే దిగజారొద్దన్న విజయ్ దేవరకొండ-mahesh babu vijay deverakonda condemns konda surekha cheap comments on samantha naga chaitanya nagarjuna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: మరీ ఇంత చీప్ కామెంట్స్ చేస్తారా: కొండా సురేఖపై మండిపడిన మహేష్ బాబు.. ఇంతకంటే దిగజారొద్దన్న విజయ్ దేవరకొండ

Mahesh Babu: మరీ ఇంత చీప్ కామెంట్స్ చేస్తారా: కొండా సురేఖపై మండిపడిన మహేష్ బాబు.. ఇంతకంటే దిగజారొద్దన్న విజయ్ దేవరకొండ

Hari Prasad S HT Telugu
Oct 03, 2024 04:23 PM IST

Mahesh Babu Konda Surekha: కొండా సురేఖ చీప్ కామెంట్స్ చేసిందంటూ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు మండిపడ్డాడు. ఎక్స్ అకౌంట్ ద్వారా అతడు దుమారం రేపుతున్న ఈ అంశంపై తీవ్రంగా స్పందించాడు. అటు విజయ్ దేవరకొండ కూడా స్పందిస్తూ.. రాజకీయాలు ఇంకా దిగజారొద్దని, ఇక చాలని అన్నాడు.

మరీ ఇంత చీప్ కామెంట్స్ చేస్తారా?: కొండా సురేఖపై మండిపడిన మహేష్ బాబు
మరీ ఇంత చీప్ కామెంట్స్ చేస్తారా?: కొండా సురేఖపై మండిపడిన మహేష్ బాబు (AP)

Mahesh Babu Konda Surekha: సమంత, నాగార్జున, నాగ చైతన్యలపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించాడు. ఈ చీప్ కామెంట్స్ ను తాను ఖండిస్తున్నట్లు అతడు ట్వీట్ చేశాడు. ఓ మహిళా మంత్రి మరో మహిళ పట్ల ఇలా మాట్లాడటం సరికాదని, సినిమా ఇండస్ట్రీ ఇలాంటివి సహించదని అతడు స్పష్టం చేశాడు.

ఇవి చీప్, నిరాధార కామెంట్స్: మహేష్

సమంత, నాగ చైతన్య విడాకులకు కేటీఆరే కారణం అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపుతున్నాయో తెలుసు కదా. ఈ ఇష్యూపై తాజాగా మహేష్ బాబు కూడా ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు. ఇది చీప్, నిరాధార కామెంట్స్ అని అతడు కాస్త ఘాటుగానే స్పందించడం గమనార్హం.

"మా సినిమా ఇండస్ట్రీలోని సహచరులపై మంత్రి కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ నాకు చాలా బాధ కలిగించాయి. ఓ కూతురికి తండ్రి, ఓ భార్యకు భర్త, ఓ తల్లికి కొడుకుగా.. ఓ మహిళా మంత్రి సాటి మహిళ పట్ల చేసిన ఆమోదయోగ్యం కాని కామెంట్స్, ఆమె వాడిన భాష నాకు చాలా బాధగా అనిపిస్తోంది.

ఇతరు మనోభావాలను దెబ్బతిననంత వరకూ మీ వాక్ స్వాతంత్య్రాన్ని వాడుకోవచ్చు. ఈ చీప్, నిరాధార కామెంట్స్ ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నాను. ఈ దేశంలోని, సినిమా ఇండస్ట్రీలోని మహిళలను అత్యంత గౌరవ మర్యాదలతో చూడాల్సిన అవసరం ఉంది" అని మహేష్ ట్వీట్ చేశాడు.

ఇంతకంటే దిగజారొద్దు: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కూడా కొండా సురేఖ కామెంట్స్ పై చాలా తీవ్రంగా స్పందించాడు. రాజకీయాలు ఇంతకంటే దిగజారొద్దని, ప్రజలు ఇక ఏమాత్రం సహించరని వార్నింగ్ ఇచ్చాడు. "ఈనాటి రాజకీయాలు, రాజకీయ నాయకులు, వాళ్ల ప్రవర్తన గురించి కాస్త మంచి భాషలో చెప్పడానికి నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.

అందరు రాజకీయ నాయకులకు నేను చెప్పేది ఒక్కటే.. మేము మీకు ఓటేసేది మమ్మల్ని బాగా చూసుకుంటారని, వసతులు కల్పిస్తారని, పెట్టుబడులు తెస్తారని, ఉద్యోగాలు ఇస్తారని, ఆరోగ్యం, విద్య, ఇతర సౌకర్యాల గురించి మాట్లాడతారని.. ప్రజలుగా ఇలాంటివి ఇక ఏమాత్రం సహించం. రాజకీయాలు ఇంతకంటే ఇక దిగజారవు. ఇక చాలు" అని విజయ్ దేవరకొండ చాలా ఘాటుగా ట్వీట్ చేశాడు.

గళమెత్తిన టాలీవుడ్

కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకునే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా మండిపడుతోంది. ఇప్పటికే ప్రముఖ నటీనటులంతా కొండా సురేఖ కామెంట్స్ ను తప్పుబడుతూ ట్వీట్లు చేశారు.

మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అటు చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, తేజ సజ్జ, ఆర్జీవీ, వెంకటేశ్, విశ్వక్సేన్ లాంటి వాళ్లందరూ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

మరోవైపు మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించడానికి నాగార్జున సిద్ధమవుతున్నాడు. ఆమె కామెంట్స్ పై మొదట ఎక్స్ వేదికగా కాస్త సున్నితంగానే స్పందించిన అతడు.. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అలాగే, మంత్రి కొండా సురేఖ విషయంపై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదని, చట్టపరంగా పోరాడతానని నాగార్జున వెల్లడించినట్లు సమాచారం.

Whats_app_banner