Rana on Samantha: మరదలుగా ఉన్న సమంత నాకు చెల్లెలు అయింది: ఐఫా అవార్డుల వేడుకలో రానా జోక్స్.. పంచ్ గట్టిగానే ఇచ్చిన సామ్
Rana on Samantha: సమంతపై జోకులు వేశాడు రానా దగ్గుబాటి. ఒకప్పుడు మరదలుగా ఉన్న సామ్ చెల్లెలు అయిందని అతడు అన్నాడు. ఐఫా అవార్డుల వేడుకలో రానా వేసిన జోక్స్ కు సమంత కూడా కాస్త గట్టిగానే పంచ్ ఇచ్చింది.
Rana on Samantha: సమంత, రానా మధ్య జరిగిన ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఐఫా ఉత్సవం అవార్డుల్లో భాగంగా సమంత రుత్ ప్రభు వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఎమోషనల్ స్పీచ్ ఇవ్వగా.. ఈ షోని హోస్ట్ చేస్తున్న రానా, తేజ సజ్జ కొన్ని జోక్స్ వేసి ఆమెను నవ్వించే ప్రయత్నం చేశారు.
మరదలు కాస్తా చెల్లి అయింది
ఇప్పుడే ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాను.. జోక్స్ వద్దు అంటూ మొదట్లోనే రానాకు సమంత వార్నింగ్ ఇచ్చింది. అయితే రానా మాత్రం సరదాగానే స్పందించాడు. "సమంత.. ఎక్కడో టాలీవుడ్ నుంచి ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లింది.. ఒకప్పుడు నాకు మరదలుగా ఉన్న ఆమె చెల్లి వరకూ వెళ్లింది" అని రానా అనగానే గట్టిగా నవ్వేసిన సామ్.. అంటే సెల్ఫ్ ట్రోలింగ్ కూడా చేస్తున్నావా అని అడిగింది.
తెలుగు సినిమాలు చేయడం లేదు ఎందుకు అని సమంతను రానా అడిగాడు. మీరు చేస్తున్నారా అని ఆమె ఎదురు ప్రశ్నించింది. అంటే ఎవరూ తీసుకోవడం లేదంటూ రానా సమాధానమిచ్చాడు. తాను సినిమా చేయాలంటే నరసింహనాయుడులాగా ఉండాలి కానీ రానా నాయుడులాగా ఉండొద్దు కదా అంటూ ఈ సందర్భంగా రానాకు సామ్ గట్టి పంచే ఇచ్చింది.
అది షో.. ఏదైనా చేసుకోవచ్చు.. అది మీ ఫ్యామిలీ మ్యాన్ నుంచే చూసి నేర్చుకున్నాం అని రానా అన్నాడు. ఆ సమయంలో పక్కనే తేజ సజ్జ స్పందిస్తూ.. టాలీవుడ్ లో ఉన్నంత వరకూ సమంత రుత్ ప్రభుగా ఉన్న ఆమె.. బాలీవుడ్ కు వెళ్లగానే సమంత రూడ్ ప్రభుగా మారిపోయిందని అన్నాడు. నిజానికి తాము చిన్నప్పటి నుంచీ సమంత రూత్ ప్రభు కాదు.. రూత్‌లెస్ (దయలేని) ప్రభు అనే పిలిచేవాళ్లమని రానా సరదాగా అన్నాడు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంత, రానా రిలేషన్షిప్ ఇలా
సమంత, రానా వరుసకు అన్నాచెల్లెళ్లు అయ్యారు. అది ఎలా అంటే ఆమె నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత. రానా మేనత్త (వెంకటేశ్ చెల్లెలు) లక్ష్మి, నాగార్జున కొడుకే నాగ చైతన్య. ఆ లెక్కన నాగ చైతన్య అతనికి బావమరిది అవుతాడు. దీంతో సమంత చెల్లిగా మారింది.
2017లో పెళ్లి చేసుకున్న వీళ్లు.. 2021లో విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఇక 2016లో వచ్చిన బెంగళూరు డేస్ మూవీలో రానా, సమంత కలిసి నటించారు. ఈ ఇద్దరూ నటించిన ఏకైక సందర్భం అదొక్కటే.
టాపిక్