Allu Aravind: చిరంజీవి హీరో - అల్లు అరవింద్ కథ - హాలీవుడ్ మూవీ మ్యాడ్‌మ్యాక్స్ స్ఫూర్తితో వచ్చిన తెలుగు సినిమా ఇదే!
Allu Aravind: చిరంజీవి హీరోగా 1982లో రిలీజైన యమకింకరుడు సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ కథను అందించారు. హాలీవుడ్ మూవీ మ్యాడ్‌మ్యాక్స్ స్ఫూర్తితో వచ్చిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
Allu Aravind: అల్లు అరవింద్ తెలుగు ప్రేక్షకులకు ప్రొడ్యూసర్‌గానే సుపరిచితుడు. కానీ నటుడిగా కొన్ని తెలుగు సినిమాలు చేశాడాయన. చంటబ్బాయి, మహానగరంలో మాయగాడుతో పాటు చిరంజీవి హీరోగా నటించిన ఐదారు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.
నిర్మాతగా, నటుడిగానే కాకుండా ఓ సినిమాకు స్టోరీ రైటర్‌గా కూడా పనిచేశాడు. అల్లు అరవింద్ తన సుదీర్ఘ కెరీర్‌లో కథను అందించిన ఆ ఒకే ఒక మూవీ యమ కింకరుడు. చిరంజీవి హీరోగా 1982లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
మ్యాడ్‌మ్యాక్స్ స్ఫూర్తితో...
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ మ్యాడ్‌మ్యాక్స్ స్ఫూర్తితో యమ కింకరుడు సినిమా తెరకెక్కింది. ఇందులో చిరంజీవికి జోడీగా రాధిక హీరోయిన్‌గా నటించింది. శరత్‌బాబు, సత్యనారాయణ, జగ్గయ్యతో పాటు పలువురు టాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాలో జాకల్ అనే విలన్‌గా సుదర్శన్ ధీర్ క్యారెక్టర్‌ను మ్యాడ్‌మ్యాక్స్ ఆధారంగా డిజైన్ చేశారు. తన గ్యాంగ్ తో కలిసి దొంగతనాలకు పాల్పడే జాకల్‌ను విజయ్ అనే పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? రాధను ప్రేమించి పెళ్లాడిన విజయ్ ఆమెకు ఎందుకు దూరమయ్యాడు? అనే అంశాలతో దర్శకుడు రాజ్ భరత్ యమకింకరుడు సినిమాను రూపొందించాడు.
ట్రెండ్ సెట్టర్...
యమ కింకరుడు పరాజయం పాలైన ఈ సినిమాలోని యాక్షన్ అంశాలు తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అప్పట్లో ట్రెండ్ సెట్టర్ మూవీగా యమకింకరుడు నిలిచింది. యమకింకరుడు సినిమాను అల్లు అరవింద్ స్వయంగా నిర్మించాడు. చిరంజీవితో అల్లు అరవింద్ నిర్మించిన రెండో సినిమా ఇది.
మొదటగా వీరిద్దరి కాంబోలో శుభలేఖ మూవీ వచ్చింది. మొత్తంగా చిరంజీవి అల్లు అరవింద్ కాంబోలో పదహారు సినిమాలు వచ్చాయి. ఆరాధన, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మెకానిక్ అల్లుడు, మాస్టర్‌తో పాటు మరో నాలుగు సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలవగా...ఎనిమిది సినిమాలు యావరేజ్‌గా, ఫ్లాప్స్‌గా నిలిచాయి.
విశ్వంభర...
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తోన్నాడు. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తోన్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ సంస్థ విశ్వంభర మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. గేమ్ ఛేంజర్ కారణంగా వాయిదాపడింది. విశ్వంభర తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టాపిక్