Gundeninda Gudigantalu Today Episode: మనోజ్ పాలిట విలన్‌గా మారిన బాలు - శృతితో రవి దొంగ పెళ్లి - భర్తపై మీనా అలక
Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 3 నాటి ఎపిసోడ్ ఖర్చుల కోసం వడ్డీకి డబ్బులు తీసుకుంటాడు మనోజ్. ఆ డబ్బులు ఇంట్లో కిందపడిపోవడంతో బాలుకు దొరుకుతాయి. ఆ డబ్బులు తనవే అంటే జీతం మొత్తం తీసుకురమ్మని బాలు ఎక్కడ అడుగుతాడోనని భయపడి తనవి కాదని అంటాడు మనోజ్.
Gundeninda Gudigantalu Today Episode: తాను కారు ఎక్కిన పాసింజర్ ఇచ్చిన వంద రూపాయల నోట్ ద్వారా మనోజ్ జాబ్ చేస్తున్నానంటూ పార్క్‌లో టైమ్‌పాస్ చేస్తున్నాడని బాలుకు డౌట్ వస్తుంది. మనోజ్‌ను వెతుక్కుంటూ బాలు పార్కులోకి వస్తాడు. బాలును చూసిన మనోజ్ అతడికి కనిపించకుండా దాక్కుంటాడు.
వడ్డీకి డబ్బులు...
ఖర్చులకు ఇబ్బంది కావడంతో వడ్డీకి డబ్బులు తీసుకుంటాడు మనోజ్. వడ్డీ ఇచ్చే అతడు మనోజ్‌ను ఇన్‌సల్ట్ చేస్తాడు. మనోజ్ ఆధార్ కార్డ్‌తో పాటు ఫోన్‌లో మనోజ్ ఫొటోలు తీసుకుంటాడు. ఇవన్నీ ఎందుకు అని మనోజ్ అడిగితే... జాబ్ చేస్తున్నానంటూ కట్టుకున్న పెళ్లాన్ని, తల్లిని మోసం చేసిన నువ్వు నన్ను మోసం చేయవని గ్యారెంటీ అని అడుగుతాడు. అప్పుగా తీసుకున్న పదివేలతో కొన్నాళ్లు వంద, రెండు వందల కోసం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేకుండాపోయిందని మనోజ్ అనుకుంటాడు.
బాలు రచ్చ...
బాలు ఇంట్లో అడుగుపెట్టడంతోనే తండ్రికి ఉదయం తాను ఇచ్చిన వంద రూపాయల నోటును చూపిస్తాడు. ఈ నోటు పార్కుకు ఎలా వెళ్లిందని అంటాడు. తాను మనోజ్‌కు ఇచ్చానని సత్యం అంటాడు. తన కారు ఎక్కిన ఓ పాసింజర్ జాబ్‌కు వెళుతున్నానంటూ అబద్ధం ఆడి పార్కుకు వెళ్లాడని, చిల్లర లేకపోవడంతో పార్కు లోపలికి వెళ్లి ఈనోటు తెచ్చి తనకు ఇచ్చాడని బాలు అంటాడు.
మనోజ్ కూడా ఆ పార్కులోనే ఉన్నాడని అనుమానంగా ఉందని అంటాడు. తనకు పార్కుకు వెళ్లాల్సిన ఖర్మ పెట్టలేదని మనోజ్ కోపంగా బాలుకు సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లబోతాడు. కానీ అనుకోకుండా మనోజ్ వడ్డీకి తీసుకున్న పదివేలు జారి కిందపడిపోతాయి. అవి బాలు తీసుకుంటాడు. ఇవి ఎవరివని అడిగితే .తమవి కాదని మీనా, మౌనిక అంటారు. తనవి అని మనోజ్ చెప్పలేకలోలోన బాధపడతాడు.
ప్రభావతి అబద్ధం...
అవి తన డబ్బులు అని, మీ నాన్న పెన్షన్ డబ్బుల నుంచి తీసుకున్నానని ప్రభావతి అబద్ధం ఆడుతుంది. పెన్షన్ డబ్బులు నీకు దొరక్కుండా బ్యాంకులో దాచానని ప్రభావతి అబద్ధాన్ని బయటపెడతాడు సత్యం. తనవే ఆ డబ్బులు అని అంటే...జీతం వచ్చిందని అందరూ అనుకుంటారని, అప్పుడు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తారని మనోజ్ భయపడిపోతాడు.
తనవి కాదని అంటాడు. మనోజ్ జీతం వచ్చినా...ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా కావాలనే ఆ పదివేలు తనవి కాదని అంటున్నాడని బాలు అనుకుంటాడు. షాపింగ్ మాల్‌లో తాను కట్టిన డబ్బుల కింద దొరికిన పదివేలను తానే తీసుకుంటానని బాలు అంటాడు. అతడి మాటలు విని కోపంతో మనోజ్ రగిలిపోతాడు. కానీ ఏం అనలేక సైలెంట్‌గా ఉంటాడు.
సురేంద్ర వార్నింగ్...
సత్యాన్ని కలుస్తాడు శృతి తండ్రి సురేంద్ర. శృతికి పెళ్లి ఫిక్సయిందని, అయినా వినకుండా మీ అబ్బాయి రవి తన కూతురితో మాట్లాడుతున్నాడని, ఇంకోసారి మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇస్తాడు. నీ కొడుకు వల్ల నా కూతురి పెళ్లి ఆగిపోతే ఊరుకోనని సత్యాన్ని హెచ్చరిస్తాడు.
నీ కూతురి పెళ్లి విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, నిశ్చితంగా పెళ్లి పనులు చూసుకోమని సురేంద్రకు మాటిస్తాడు సత్యం. రవి తన మాట జవదాటి ఎలాంటి తప్పు చేయడని సురేంద్రకు చెబుతాడు.
రంగంలోకి బాలు...
ఆ తర్వాత బాలు, మీనా దగ్గరకు వచ్చి సత్యం...సురేంద్రతో జరిగిన గొడవ గురించి చెబుతాడు. రవి, శృతి మధ్య ఉన్నది ప్రేమ అని సురేంద్ర అనుమానపడుతున్నట్లు బాలుతో అంటాడు సత్యం. వారి మధ్య ఉంది కేవలం స్నేహం అని తాను ఎంత చెప్పిన సురేంద్ర వినడం లేదని చెబుతాడు.
ఆడపిల్ల తండ్రిగా సురేంద్ర భయాన్ని అర్థంచేసుకొని ఒకసారి రవితో మాట్లాడితే మంచిదని సత్యం అంటాడు. వారి మధ్య ఉన్న ప్రేమ గురించి మీనా...మావయ్య సత్యానికి చెప్పబోతుంది. కానీ బాలు ఆమెను మాట్లాడొద్దని అంటాడు. నిన్ను వదిలేస్తే వారికి దగ్గరుండి పెళ్లిచేసేలా ఉన్నావని, ఈ విషయంలో జోక్యం చేసుకుంటే బాగుండదని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు.
అలిగిన మీనా...
శృతిని రవి ప్రేమిస్తున్నాడు కావచ్చునని, ఒకవేళ వారిని విడదీస్తే జీవితాంతం ఇద్దరు బాధపడతారని బాలుకు సర్ధిచెప్పబోతుంది మీనా. శృతితో తాను మాట్లాడి మన కుటుంబ పరిస్థితి వివరిస్తానని మీనా అంటుంది. శృతితో మాట్లాడాలసిన అవసరం లేదని బాలు అంటాడు.
సుమతిని రవికి ఇచ్చి పెళ్లిచేస్తే ఈ గొడవలన్నీ ముగిసిపోయేవని, కానీ మీ అమ్మే ఒప్పుకోలేదని మీనాపై సెటైర్లు వేస్తాడు బాలు. భర్త మాటలతో అలుగుతుంది మీనా. తాను ఎవరితో మాట్లాడనని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మీనా చెల్లెలి సాయం...
మన పెళ్లి రెండు రోజుల్లో జరగాలని శృతి చెప్పిన మాటల గురించి రవి తెగ ఆలోచిస్తాడు. తమ పెళ్లి సజావుగా జరగడానికి మీనా చెల్లెలు సుమతి సాయం తీసుకోవాలని రవి అనుకుంటాడు. సుమతిని కలిసి తన ప్రేమ విషయం మొత్తం చెప్పేస్తాడు. శృతితో తన పెళ్లికి బాలు అడ్డుచెబుతున్న సంగతి కూడా సుమతికి వివరిస్తాడు రవి.
సుమతి పూలు అమ్ముతున్న గుడిలోనే శృతి, తాను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నట్లు, ఆ పెళ్లి ఏర్పాట్లు నువ్వే చేయాలని సుమతిని రిక్వెస్ట్ చేస్తాడు రవి. సుమతి భయపడుతూనే అందుకు ఒప్పుకుంటుంది. బాలు ఆవేశం గుర్తొచ్చి కంగారు పడుతుంది. రవి, శృతిల పెళ్లి తాను జరిపిస్తే అక్క కాపురానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయోనని టెన్షన్ పడుతుంది. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.