Chiranjeevi Appreciates Venu: మెగాస్టార్‌ను కలిసిన బలగం టీమ్.. వేణును అభినందించిన చిరంజీవి-megastar chiranjeevi appreciates venu and balagam team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Appreciates Venu: మెగాస్టార్‌ను కలిసిన బలగం టీమ్.. వేణును అభినందించిన చిరంజీవి

Chiranjeevi Appreciates Venu: మెగాస్టార్‌ను కలిసిన బలగం టీమ్.. వేణును అభినందించిన చిరంజీవి

Maragani Govardhan HT Telugu
Mar 11, 2023 06:12 PM IST

Chiranjeevi Appreciates Venu: కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందం కలిసింది. ఈ సందర్భంగా దర్శకుడు వేణును మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందించారు.

వేణును అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
వేణును అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Appreciates Venu: కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించిన వేణు.. మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం బలగం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రియదర్శి హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని వేణు శనివారం ఉదయం కలిశాడు. అతడితో పాటు బలగం టీమ్, దిల్ రాజు తదితురులు భోళా శంకర్ సినిమా సెట్‌లో కలిసి మాట్లాడారు. ఈ సందర్బంగా చిరంజీవి.. వేణును అభినందించడమే కాకుండా అతడి పనితనాన్ని మెచ్చుకున్నారు.

"కంగ్రాట్స్ వేణు. చక్కటి చిత్రాన్ని రూపొందించావు. ఇంత బాగా సినిమా చేసి మాకు షాకులు ఇస్తే ఎలా? నిజాయితీ ఉన్న సినిమా ఇది. కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ నువ్వే దీనికి పూర్తి న్యాయం చేశావు. తెలంగాణ సంస్కృతిని 100 శాతం చూపించావు. వేణు గతంలో జబర్దస్త్ వేదికపై చక్కటి స్కిట్ చేశాడు. అతడిలో ఇంత టాలెంట్ ఉందా? అని నాకు గౌరవం పెరిగింది. ఈ సినిమా చూశాక. తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడని అనిపించింది." అని మెగాస్టార్ అన్నారు.

చిరంజీవితో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను వేణు ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. "ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు థాంక్యూ సో మచ్ సార్ నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు ఇది నా బలగం విజయం రుణపడి ఉంటాను చిరంజీవి గారికి." అని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు.

ఈ సినిమాకు వేణు దర్శకత్వం వహించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహించారు. ధమాకా లాంటి సూపర్ హిట్ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ప్రియదర్శి హీరోగా నటించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం