Ilaiyaraaja Tribute Concert: ఇళయరాజా లైవ్ కన్సర్టుకు చిరంజీవి, నాగార్జున హాజరు-minister kt rama rao chiranjeevi and nagarjuna to grace maestro ilaiyaraaja tribute concert ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ilaiyaraaja Tribute Concert: ఇళయరాజా లైవ్ కన్సర్టుకు చిరంజీవి, నాగార్జున హాజరు

Ilaiyaraaja Tribute Concert: ఇళయరాజా లైవ్ కన్సర్టుకు చిరంజీవి, నాగార్జున హాజరు

Maragani Govardhan HT Telugu
Feb 24, 2023 05:46 PM IST

Ilaiyaraaja Tribute Concert: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు నివాళికి తెలంగాణ ప్రభుత్వం లైవ్ కన్సర్టు నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తదితరులు హాజరుకానున్నారు.

ఇళయరాజా
ఇళయరాజా

Ilaiyaraaja Tribute Concert: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లైవ్ కాన్సర్టును నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. సంగీత కచేరి నిర్వహించి ఆయనకు నివాళి తెలిపిందేకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఈ కన్సర్టును నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, క్రీడా-సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీనివాస గౌడ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలుగు చిత్రసీమలో అగ్రతారలైన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనుంది.

ఈ కచేరిలో భాగమవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. "మ్యాస్ట్రో ఇళయరాజాతో కలిసి వేదికపైకి వచ్చి ఆయనకు నివాళులు తెలపడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నా చాలా సినిమాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. అవి సూపర్ డూపర్ హిట్టయ్యాయి." అని మెగాస్టార్ అన్నారు. మరోపక్క నాగార్జున కూడా తన సంతోషాన్ని తెలియజేశారు. ఇళయారాజా సంగీత దర్శకత్వంలో తనకు కూడా చాలా సినిమాలు వచ్చాయని, గీతాంజలి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిందని నాగ్ స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 25వ ఇళయరాజా లైవ్ కన్సర్టుకు ఓ రోజుకు ముందుగా ట్రిబ్యూట్ కచేరి జరగనుంది. ఇందులో ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, విశాల్ చంద్రశేఖర్, హైదరాబాద్ ప్రఖ్యాత బ్యాండ్‌లు ఇక్కడ ప్రదర్శనను ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 26న గచ్చిబౌలి స్టేడియంలో మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ ప్రదర్శన చేయనున్నారు. ఈ లైవ్ ఇన్ కచేరిలో 80 మంది సంగీతకారుల సంయుక్తంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ అద్భుతమైన ఈవెంట్‌ను చూసేందుకు 20 వేల మంది హాజరవుతారని అంచనా. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టికెట్లు అమ్ముడయ్యాయి.

హైదరాబాద్‌లో తన చివరి పర్యటన సందర్భంగా మ్యాస్ట్రో ఇళయరాజా మాట్లాడుతూ..ఇక్కడ ప్రదర్శన కోసం ఆత్రుతగా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకుడు సాయినాథ్ గౌడ్ అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం