Balagam Censor Completed: సెన్సార్ పూర్తి చేసుకున్న బలగం.. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో సినిమా-priyadarshi starred balagam censor completed it will release on march 3rd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Priyadarshi Starred Balagam Censor Completed It Will Release On March 3rd

Balagam Censor Completed: సెన్సార్ పూర్తి చేసుకున్న బలగం.. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో సినిమా

Maragani Govardhan HT Telugu
Feb 24, 2023 09:21 PM IST

Balagam Censor Completed: టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం బలగం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని మార్చి 3న విడుదల చేయనుంది.

బలగం సెన్సార్ పూర్తి
బలగం సెన్సార్ పూర్తి

Balagam Censor Completed: టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి ఓ పక్క కమెడియన్‌గా సినిమాల్లో వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటూనే మరోపక్క హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. బలగం చిత్రానికి సెన్సార్ బృందం క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజే స్వయంగా తెలియజేశారు.

బలగం సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యూ సర్టిఫికేట్ వచ్చింది. కొత్త కాన్సెప్టు సినిమాలను చేస్తూ నూతన టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో హర్షిత్, హన్షిత ఈ ప్రొడక్షన్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే వేణుతో బలగం సినిమాను తీశాం. ఈ చిత్రాన్ని మార్చి 3న విడుదల చేయనున్నాం. తెలంగాణ పల్లేటూరి నేపథ్యంలో సాగే సినిమా ఇది. అని ఆయన అన్నారు.

ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన కావ్యా కల్యాణ్ రామ్ నటించారు. వీరు కాకుండా సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జ‌య‌రాం, విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పల్లెటూర సాంగ్, పొట్టి పిల్ల పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహించారు. ధమాకా లాంటి సూపర్ హిట్ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

IPL_Entry_Point

టాపిక్