Mayapetika OTT Release Date: మాయా పేటిక ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో రానుందంటే..
Mayapetika OTT Release Date: మాయాపేటిక ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో చూడొచ్చు.
Mayapetika OTT Release Date: బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్ తెలుసు కదా. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేశ్ మేనల్లుడు ఇతడు. విరాజ్ నటించిన మాయాపేటిక మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఇప్పటికే అతడు నటించిన బేబీ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుండగా.. ఈ మాయాపేటిక మూవీ కూడా అదే ఓటీటీలోకి రానుంది.
ఆహా ఓటీటీలో నేరుగా రిలీజైన థ్యాంక్యూ బ్రదర్ మూవీ డైరెక్టర్ రమేష్ రాపర్తియే ఈ మాయాపేటిక మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా జూన్ 30న థియేటర్లలోకి వచ్చింది. విరాజ్ అశ్విన్ తోపాటు సిమ్రన్ కౌర్, పాయల్ రాజ్‌పుత్ ఇందులో నటించారు. ఇప్పుడీ మూవీ సెప్టెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.
బాక్సాఫీస్ దగ్గర కూడా అంతంతమాత్రం వసూళ్లే సాధించింది. కానీ రిలీజైన రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ ఓ ట్వీట్ ద్వారా కన్ఫమ్ చేసింది. బేబీ మూవీ ద్వారా ప్రేక్షకులకు చేరువైన విరాజ్ అశ్విన్ కు ఉన్న ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఆహా ప్రయత్నిస్తోంది. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
మాయాపేటిక కథ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. నిజానికి ఇది ఆరు చిన్న కథల ఆంథాలజీ. ఓ మొబైల్ ఫోన్ ద్వారా వీళ్లు కనెక్ట్ అవుతారు. ఆ మొబైల్ ఈ ఆరు పాత్రల చేతులు ఎలా మారుతుంది? అది వీళ్ల జీవితాలను ఎలా మారుస్తుందన్నది అసలు కథ. మాయాపేటిక మూవీ స్టోరీ ఇంట్రెస్టింగా ఉన్నా దానిని ఆకట్టుకునేలాగా తీయడంలో విఫలమవడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఈ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రపంచంలో మనుషులకు నాలుగు అవసరాలు ఉంటాయి.. ప్రేమ, డబ్బు, అధికారం, నేను అంటూ మొబైల్ ఫోన్ ను చూపిస్తారు. ఓ చెత్త బుట్టలో పడి ఉన్న ఆ ఫోన్ ఆ పాత్రల జీవితాలను ఎలా మార్చబోతుందన్నది ట్రైలర్ లో చూడొచ్చు. ఇది ఫోన్ కాదు మాయాపేటిక అనే ఓ డైలాగ్ కూడా ఉంటుంది. మరి ఈ మాయాపేటిక ఎలాంటి మాయా చేసిందో చూడాలనుకుంటే సెప్టెంబర్ 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమ్ కానున్న సినిమా చూడండి.