Manchu Vishnu Donation: మంచు విష్ణు గొప్ప మనసు.. 10 లక్షలు విరాళం ఇచ్చిన హీరో.. ఎవరికంటే?-manchu vishnu 10 lakh rs donation to maa association on his daughter ira vidya manchu birthday vishnu manchu donation ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Vishnu Donation: మంచు విష్ణు గొప్ప మనసు.. 10 లక్షలు విరాళం ఇచ్చిన హీరో.. ఎవరికంటే?

Manchu Vishnu Donation: మంచు విష్ణు గొప్ప మనసు.. 10 లక్షలు విరాళం ఇచ్చిన హీరో.. ఎవరికంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 11, 2024 10:25 AM IST

Manchu Vishnu 10 Lakh ₹Donation To MAA: హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు గొప్ప మనసు చాటుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు ‘మా’కు డొనేషన్‌గా ఇచ్చారు.

మంచు విష్ణు గొప్ప మనసు.. 10 లక్షలు విరాళం ఇచ్చిన హీరో.. ఎవరికంటే?
మంచు విష్ణు గొప్ప మనసు.. 10 లక్షలు విరాళం ఇచ్చిన హీరో.. ఎవరికంటే?

Manchu Vishnu 10 Lakh Donation: మంచు మోహన్ బాబు కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన విష్ణు అనే సినిమాతో హీరోగా డెబ్యూ చేశారు. 2003లో వచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత సూర్యం, గేమ్ సినిమాలతో పెద్దగా హిట్ కొట్టలేదు.

మంచి మనసు

అనంతరం ఢీ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తర్వాత ఇంతటి హిట్‌ను హీరోగా విష్ణు అందుకోలేకపోయారు. ఇదిలా ఉంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా పదవి చేపట్టిన మంచు విష్ణు తాజాగా గొప్ప మనసు చాటుకున్నారు. మా అసోసియేషన్‌కు పది లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు మంచు విష్ణు.

సంరక్షణ అందేలా

మా అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు హీరో విష్ణు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. అయితే, ఈ విరాళాన్ని విష్ణు మంచు తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు (ఆగస్ట్ 9) సందర్భంగా ప్రకటించారు.

కూతురు బర్త్ డే కానుకగా

కుమార్తె బర్త్ డే కానుకగా మాకు రూ. 10 లక్షల విరాళం అందించారు మంచు విష్ణు. ఇదిలా ఉంటే, గత మూడు సంవత్సరాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విష్ణు నాయకత్వంలో మంచి అభివృద్ధిని సాధించింది. ప్రస్తతుం మా భవనంపై విష్ణు మంచు ఫోకస్ పెట్టారు. అయితే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అసత్యం అని మంచు విష్ణు టీమ్ చెబుతోంది.

అసభ్యకరమైన కంటెంట్

నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్‌లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో విష్ణు ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారని మా పేర్కొంది.

డిసెంబర్‌లో కన్నప్ప

ఇదిలా ఉంటే, విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. భారీ తారాగణంతో రాబోతోన్న కన్నప్పపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. కన్నప్ప సినిమాతో తెలుగు పౌరాణిక కథను చూపించనున్నారు. ఈ కన్నప్ప మూవీని హిందీ ప్రముఖ దర్శకుడు ముఖేష్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్ ఖిలాడీ

కన్నప్ప మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ సీనియర్ యాక్షన్ హీరో ఖిలాడీ అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంటి అగ్ర హీరోలు నటించారు. వీరందరిని ఇటీవల విడుదలై కన్నప్ప టీజర్‌లో చూడొచ్చు. ఇక ఈ చిత్రాన్ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.