Malayalam Thriller OTT: ఓటీటీలోకి మమ్ముట్టి లేటెస్ట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Malayalam Thriller OTT: మమ్ముట్టి లేటెస్ట్ మలయాళం మూవీ టర్బో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ నెలలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Malayalam Thriller OTT: మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ టర్బో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మలయాళం మూవీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకున్నది. ఆగస్ట్‌లో టర్బో మూవీని ఓటీటీలోరిలీజ్ చేయబోతున్నట్లు సోనీ లివ్ ప్రకటించింది. ఓటీటీ కోసం స్పెషల్‌గా యాక్షన్ టీజర్ వీడియోను విడుదలచేశారు. ఆగస్ట్ 2 నుంచి మమ్ముట్టి మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో టర్బో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
సునీల్ మలయాళం ఎంట్రీ...
టర్బో సినిమాకు వైశాఖ్ దర్శకత్వం వహించాడు. కన్నగ అగ్ర నటుడు రాజ్ బీ శెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమాతో టాలీవుడ్ కమెడియన్ సునీల్ మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
రెండు నెలల తర్వాత...
మే 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ యాక్షన్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. టర్బో జోస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి నటన, అతడిపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా...కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడం, కథ, కథనాలు ప్రెడిక్టబుల్‌గా ఉండటంతో టర్బో మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
చాలా రోజుల గ్యాప్ తర్వాత మాస్ కథతో మమ్ముట్టి టర్బో మూవీ చేశాడు. అదొక్కటి తప్ప మిగిలిన మిగిలిన అన్ని విషయాల్లో ఈ మలయాళం మూవీ రొటీన్ అంటూ విమర్శలొచ్చాయి.
టర్బో మూవీ కథ ఇదే...
టర్బో జోస్ (మమ్ముట్టి) ఓ జీప్ డ్రైవర్. జోస్ స్నేహితుడు జెర్రీ (శబరీష్ వర్మ) ఇందులేఖ (అంజనా జయప్రకాష్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. జెర్రీ, ఇందులేఖలను కలపాలని జోస్ ఫిక్సవుతాడు. ఈ ప్రయత్నంలో జోస్‌పై కిడ్నాప్ కేసు నమోదు అవుతుంది. పోలీసులకు దొరక్కుండా ఉండటానికి చెన్నై పారిపోతాడు జోస్. వెట్రివేల్ షణ్ముగ సుందరం (రాజ్ బీ శెట్టి) ఓ గ్యాంగ్‌స్టర్. చెన్నై రాజకీయాలను శాసిస్తుంటాడు. షణ్ముగ సుందరం వందల కోట్ల రూపాయల బ్యాంక్ స్కామ్ చేస్తాడు.
ఆ స్కామ్‌లో తనకు తెలియకుండానే జెర్రీ కూడా భాగమవుతాడు. ఆ స్కామ్‌కు సంబంధించిన అన్ని రహస్యాలను సేకరిస్తాడు జెర్రీ. ఈ విషయం ఇందులేఖకుకు చెప్పేలోపు అతడిని జోస్ అపార్ట్‌మెంట్‌లోనే షణ్ముగ సుందరం మనుషులు చంపేస్తారు. ఆ తర్వాత ఇందులేఖను కూడా చంపాలని ప్రయత్నిస్తాడు.షణ్ముగ సుందరం బారి నుంచి ఇందులేఖను జోస్ ఎలా కాపాడాడు? షణ్ముగ సుందరం చేసిన బ్యాంకు స్కామ్ ఏమిటి? ఎమ్మెల్యేలను కొనడానికి వందల కోట్ల డబ్బు ను షణ్ముగ సుందరం ఎందుకు కూడబెట్టాడు? అతడి ప్లాన్‌ను జోస్ ఎలా తిప్పికొట్టాడు? అన్నదే టర్బో మూవీ కథ.
70 కోట్ల బడ్జెట్…
టర్బో మూవీలో అంజనా జయప్రకాష్, శబరీష్ కీలక పాత్రలు పోషించారు. టర్బో సినిమాను మమ్ముట్టి స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో ఈ యాక్షన్ మూవీ రూపొందింది. టర్బోకు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు మేకర్స్ ఆఫీషియల్‌గా వెల్లడించారు. అయితే టర్బో పరాజయం పాలవ్వడంతో సీక్వెల్ రావడం డౌటే అని మలయాళ వర్గాలు చెబుతోన్నాయి.