Mammootty Telugu Movies: రిలీజ్‌కు నోచుకోని స్టార్‌ డైరెక్టర్‌తో మ‌మ్ముట్టి చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే!-why mammootty straight telugu movie railway coolie unreleased in theaters details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mammootty Telugu Movies: రిలీజ్‌కు నోచుకోని స్టార్‌ డైరెక్టర్‌తో మ‌మ్ముట్టి చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే!

Mammootty Telugu Movies: రిలీజ్‌కు నోచుకోని స్టార్‌ డైరెక్టర్‌తో మ‌మ్ముట్టి చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
May 01, 2024 09:42 AM IST

Mammootty Telugu Movies: మ‌ల‌యాళ‌ మెగాస్టార్ మ‌మ్ముట్టి తెలుగులో ఆరు స్ట్రెయిట్ సినిమాలు చేశాడు. అందులో కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన రైల్వే కూలీ మాత్రం షూటింగ్ పూర్త‌యినా విడుద‌ల‌కు నోచుకోలేదు.

మ‌మ్ముట్టి  స్ట్రెయిట్ తెలుగు సినిమాలు
మ‌మ్ముట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు

Mammootty Telugu Movies: టాలీవుడ్‌లో డ‌బ్బింగ్ సినిమాల‌తో స్టార్‌డ‌మ్ సంపాదించుకున్న హీరోల్లో మ‌మ్ముట్టి ఒక‌రు. మ‌ల‌యాళంలో ఆరు వంద‌ల‌కుపైగా సినిమాలు చేసిన మ‌మ్ముట్టి తెలుగులో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఆరు స్ట్రెయిట్ సినిమాల్లో మాత్ర‌మే న‌టించారు.

తెలుగులో ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల్లో హీరోగా, విల‌న్‌గా అవ‌కాశాలు వ‌చ్చినా వాటిని తిర‌స్క‌రించారు మ‌మ్ముట్టి. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స్వాతికిర‌ణం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు మ‌మ్ముట్టి. ఇందులో అసూయ‌ద్వేషాల‌తో ర‌గిలిపోయే సంగీతకారుడి పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు.

22 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ...

స్వాతికిర‌ణం త‌ర్వాత 1997లో వ‌చ్చిన సూర్య‌పుత్రులు మూవీలో సుమ‌న్‌తో పాటు మ‌రో హీరోగా మ‌మ్ముట్టి క‌నిపించాడు. దాదాపు 22 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత దివంగ‌త సీఏం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి బ‌యోపిక్ అయిన‌ యాత్ర మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మ‌మ్ముట్టి అఖిల్ అక్కినేని ఏజెంట్‌, యాత్ర 2 సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ ఐదు సినిమాల‌తో పాటు మ‌మ్ముట్టి తెలుగులో మ‌రో స్ట్రెయిట్ సినిమా కూడా చేశాడు. కానీ షూటింగ్ పూర్త‌యినా ఆ మూవీ మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. అదే రైల్వే కూలీ మూవీ.

కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో...

మ‌మ్ముట్టి హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ రైల్వే కూలీ పేరుతో 1996లో ఓ మూవీని తెర‌కెక్కించాడు. ఓ బాలీవుడ్ మూవీ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో మీనా, రోజా హీరోయిన్లుగా న‌టించారు. హ‌రీష్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్‌కు నోచుకోలేదు. మ‌మ్ముట్టి కెరీర్‌లో షూటింగ్ పూర్త‌యిన రిలీజ్ కానీ తెలుగు స్ట్రెయిట్ మూవీగా రైల్వే కూలీ నిలిచింది. ఈ మూవీకి శిర్పి మ్యూజిక్ అందించాడు.

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌...

గ‌త కొన్నాళ్లుగా హీరోగా బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో మ‌మ్ముట్టి మ‌ల‌యాళంలో అద‌ర‌గొడుతోన్నాడు. గ‌త ఏడాది నాలుగు సినిమాల్లో హీరోగా న‌టించ‌గా క‌న్నూర్ స్క్వాడ్‌, కాథ‌ల్ ది కోర్ క‌లెక్ష‌న్ల వ‌ర్షాన్ని కురిపించాయి. . నాన్‌పాక‌ల్ నెర‌త్తు మ‌య‌క్కం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది.

ఈ ఏడాది భ్ర‌మ‌యుగంతో ఆ స‌క్సెసుల‌ ప‌రంప‌ర‌ను కొన‌సాగించాడు మ‌మ్ముట్టి. డిఫ‌రెంట్ హార‌ర్ మూవీగా తెర‌కెక్కిన భ్ర‌మ‌యుగం భాక్సాఫీస్ వ‌ద్ద 80 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. జ‌య‌రాం హీరోగా న‌టించిన అబ్ర‌హం ఓజ్ల‌ర్ మూవీలో విల‌న్‌గా గెస్ట్ రోల్ చేశాడు మ‌మ్ముట్టి.

ట‌ర్బో రిలీజ్ డేట్ ఫిక్స్‌...

మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మూడు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ట‌ర్బో రిలీజ్ డేట్‌ను మంగ‌ళ‌వారం అనౌన్స్‌చేశారు. ఈ యాక్ష‌న్ కామెడీ మూవీకి సీనియ‌ర్ మ‌ల‌యాళం డైరెక్ట‌ర్ వైశాఖ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ట‌ర్బో మూవీలో హీరోగా న‌టిస్తూనే ఈ మూవీని స్వ‌యంగా మ‌మ్ముట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

IPL_Entry_Point