Mamitha Baiju: తెలుగులో రిలీజ్ అవుతోన్న మ‌మితాబైజు మ‌ల‌యాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?-mamitha baiju sports drama movie kho kho telugu ott streaming on etv win in july malayalam movie rajisha vijayan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mamitha Baiju: తెలుగులో రిలీజ్ అవుతోన్న మ‌మితాబైజు మ‌ల‌యాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Mamitha Baiju: తెలుగులో రిలీజ్ అవుతోన్న మ‌మితాబైజు మ‌ల‌యాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jul 07, 2024 07:55 AM IST

Mamitha Baiju: ప్రేమ‌లు ఫేమ్ మ‌మితా బైజు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఖోఖో తెలుగులో నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. జూలై నెల‌లో ఈటీవీ విన్ ద్వారా ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వ‌స్తోంది.

మ‌మితా బైజు
మ‌మితా బైజు

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ మ‌మితా బైజు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఖో ఖో తెలుగులోకి వ‌స్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ తెలుగులో నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఖోఖో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని ఈటీవీ విన్ ఓటీటీ ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. జూలై నెల‌లోనే ఖోఖో మూవీ విడుద‌ల‌ కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే రిలీజ్ డేట్‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం.

ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్‌…

స్పోర్ట్స్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌మితా బైజు కీల‌క పాత్ర పోషించింది. ఖోఖో సినిమాకు రాహుల్ రిజి నాయ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

కొవిడ్ ఎఫెక్ట్‌....

2021లో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు ర‌జిషా విజ‌య‌న్‌, మ‌మితా బైజు యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ఖో ఖో మూవీ రిలీజైన వారం రోజుల‌కే కొవిడ్ కార‌ణంగా కేర‌ళ‌లో థియేట‌ర్లు మూత ప‌డ్డాయి. టాక్ బాగున్నా కొవిడ్ ఎఫెక్ట్‌తో ఖోఖో మూవీ స‌రిగ్గా ఆడలేదు.

రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌...

టీవీల్లో మాత్రం ఖో ఖో మూవీ అద‌ర‌గొట్టింది. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీలోనే హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న లేడీ ఓరియెంటెడ్ మూవీగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమా ఫ‌స్ట్ టీవీ ప్రీమియ‌ర్‌కు 12.7 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న టాప్ 15 సినిమాల్లో ఒక‌టిగా ఖో ఖో నిలిచింది. ఖోఖో సినిమాకుగాను మ‌మితా బైజు, ర‌జిషా విజ‌య‌న్‌కు కేర‌ళ ఫిల్మ్స్ క్రిటిక్స్ అవార్డులు ద‌క్కాయి.

ఖో ఖో మూవీ క‌థ ఇదే...

ఫ్రాన్సిస్ మారియా (ర‌జిషా విజ‌య‌న్‌) ఓ గ‌ర్ల్స్ స్కూల్‌లో పీటీ టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ఖోఖో టీమ్‌కు కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. ఫ్రాన్సిస్ మారియా సార‌థ్యంలో స్కూల్ టీమ్ నేష‌న‌ల్స్‌కు ఎలా సెలెక్ట్ అయ్యింది?

త‌మ టీమ్ నేష‌న‌ల్స్‌లో విజేత‌గా నిల‌వ‌డంలో కెప్టెన్ అంజు (మ‌మితా బైజు) ఎలాంటి పాత్ర పోషించింది? ఈ జ‌ర్నీలో మారియాతో పాటు అంజుకు ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఈ సినిమాలో రియ‌ల్ ఖోఖో ప్లేయ‌ర్స్ న‌టించ‌డం గ‌మ‌నార్హం.

రామారావు ఆన్ డ్యూటీతో...

ర‌వితేజ హీరోగా న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ర‌జిషా విజ‌య‌న్‌. యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆమెకు విజ‌యాన్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. మ‌రోవైపు ప్రేమ‌లు సెన్సేష‌న‌ల్ హిట్‌తో యూత్ ఫేవ‌రేట్ హీరోయిన్‌గా మారింది మ‌మితా బైజు. మ‌ల‌యాళం స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ ప్రొడ్యూస్ చేసిన ఈ ల‌వ్‌స్టోరీ మూవీ మ‌ల‌యాళంతో పాటు తెలుగులో పెద్ద విజ‌యాన్ని సాధించింది. ప్రేమ‌లు హిట్‌తోతెలుగులోనూ మ‌మితా బైజుకు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి.

WhatsApp channel