Anna Ben: కల్కి 2898 ఏడీ నుంచి అన్నా బెన్ ఫస్ట్ లుక్ రిలీజ్ - మలయాళంలో ఈ హీరోయిన్ చేసిన సినిమాలన్నీ హిట్సే!
Anna Ben: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీతో మలయాళ హీరోయిన్ అన్నాబెన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.కల్కికి ముందు మలయాళంలో ఆమె చేసిన ఎనిమిది సినిమాలు హిట్స్‌గా నిలవడం గమనార్హం.
Anna Ben: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో కల్కి రిలీజ్ అవుతోంది. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు పిక్షనల్ వరల్డ్స్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను రూపొందిస్తోన్నాడు.
దీపికా హీరోయిన్...
కల్కి మూవీలో దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కమల్‌హాసన్ విలన్‌గా కనిపించబోతుండగా...అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు తమిళం, మలయాళం, కన్నడండతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కల్కిలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
మలయాళ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ...
కల్కి 2898 ఏడీ మూవీతో మలయాళ హీరోయిన్ అన్నాబెన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అన్నాబెన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కల్కిలో అన్నాబెన్.... కైరా అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు తెలిపారు. రెబెల్ పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు వెల్లడించారు. కల్కిలో అన్నాబెన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
ఎనిమిది సినిమాలు…
మలయాళంలో అన్నాబెన్ ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేసింది. అందులో దాదాపు అన్ని హిట్సే ఉండటం గమనార్హం. హ్యాట్రిక్ హిట్స్‌తో మాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
కుంబలంగి నైట్స్‌తో ఎంట్రీ...
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించిన కుంబలంగి నైట్స్ మూవీతో అన్నాబెన్ సినీ కెరీర్ మొదలైంది. తొలి సినిమాలోనే తన నటనతో అదరగొట్టింది. ఆ తర్వాత అన్నాబెన్ హీరోయిన్‌గా సర్వైవల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన హెలెన్ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నది.
అనుకోకుండా ఫ్రీజర్‌లో చిక్కుకుపోయి ప్రాణాలతో పోరాడే యువతిగా అన్నాబెన్ అసమాన నటనను కనబరిచింది. అన్నాబెన్ మలయాళ మూవీని హిందీలో మిలీ పేరుతో జాన్వీకపూర్ రీమేక్ చేయడం గమనార్హం.
కప్పేలా హిట్...
హెలెన్ తర్వాత అన్నాబెన్ హీరోయిన్‌గా నటించిన మరో మూవీ కప్పేలా కూడా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అపరిచితుడితో ప్రేమలో పడి మోసపోయిన యువతిగా తన నటనతో ఈ మూవీలో అన్నాబెన్ ఆకట్టుకుంది. కప్పేలా మూవీ బుట్టబొమ్మ పేరుతో తెలుగులో రీమేకైంది.
వరుస విజయాలు...
ఆ తర్వాత మలయాళంలో అన్నాబెన్ నటించిన నారదన్, నైట్ డ్రైవ్, కాప్పా, త్రిశంకు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో పాటు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి. శివ కార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన ది అడమంట్ గర్ల్ మూవీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అన్నాబెన్. ఈ సినిమా పలు ఇంటర్‌నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. అన్నాబెన్ సినిమాల ట్రాక్, సెలెక్షన్ దృష్ట్యా కల్కి 2898 ఏడీలో అన్నాబెన్ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు.
ఆరు వందల కోట్ల బడ్జెట్...
కల్కి 2898 ఏడీ సెకండ్ ట్రైలర్ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. దాదాపు అరు వందల కోట్ల బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. తెలుగు,హిందీ భాషల్లో ఈ మూవీని ఏకకాలంలో రూపొందించారు. తమిళం, మలయాళం, కన్నడంతో పాటు ఇంగ్లీష్ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తోన్నారు.
టాపిక్