Jabardasth Promo: అప్ప‌ట్లో ర‌వితేజ గోడ‌లు దూకేవాడు - మాస్ మ‌హారాజా సినిమా క‌ష్టాలు బ‌య‌ట‌పెట్టిన కృష్ణ‌భ‌గ‌వాన్‌-krishna bhagavan interesting comments on ravi teja cinema struggling days on jabardasth show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jabardasth Promo: అప్ప‌ట్లో ర‌వితేజ గోడ‌లు దూకేవాడు - మాస్ మ‌హారాజా సినిమా క‌ష్టాలు బ‌య‌ట‌పెట్టిన కృష్ణ‌భ‌గ‌వాన్‌

Jabardasth Promo: అప్ప‌ట్లో ర‌వితేజ గోడ‌లు దూకేవాడు - మాస్ మ‌హారాజా సినిమా క‌ష్టాలు బ‌య‌ట‌పెట్టిన కృష్ణ‌భ‌గ‌వాన్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 25, 2024 10:48 AM IST

Jabardasth Promo: సినిమా అవ‌కాశాల కోసం వెతుకుతున్న‌ తాను, ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ వైవీఎస్ చౌద‌రి ఒకే చోట అద్దెకు ఉండేవాళ్ల‌మ‌ని ర‌వితేజ అన్నాడు. త‌మ‌కు అద్దెకు ఉంటోన్న ఇంట్లో కుక్క‌లు ఉండ‌టంతో వాటికి దొర‌క్కుండా రాత్రుళ్లు గోడ‌లు దూకేవాళ్ల‌మ‌ని చెప్పాడు.

ర‌వితేజ‌
ర‌వితేజ‌

Jabardasth Promo: టాలీవుడ్‌లో ఎలాంటి స‌పోర్ట్‌, గాడ్‌ఫాద‌ర్స్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో మాస్ మ‌హారాజా ర‌వితేజ ఒక‌రు. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టిన ర‌వితేజ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు.ఒక‌ప్పుడు సినిమా అవ‌కాశాల కోసం ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్నాడు ర‌వితేజ‌. కానీ ఇప్పుడు అత‌డి డేట్స్ కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎదురుచూస్తున్నారు.

జ‌బ‌ర్ధ‌స్థ్ షోలో...

కెరీర్ ఆరంభంలో ర‌వితేజ ప‌డిన సినిమా క‌ష్టాల‌ను టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్ కృష్ణ భ‌గ‌వాన్ బ‌య‌ట‌పెట్టాడు. జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోకు కృష్ణ భ‌గ‌వాన్ జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. గురువారం (ఏప్రిల్ 25న‌) టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో రాకెట్ రాఘ‌వ కుక్క‌ల కార‌ణంగా ఎదుర‌య్యే క‌ష్టాల‌పై ఓ స్కిట్ చేశాడు.

ర‌వితేజ‌...వైవీఎస్ చౌద‌రి...

ఈ స్కిట్ అనంత‌రం కుక్క‌ల కార‌ణంగా త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల‌ను వివ‌రించాడు కృష్ణ‌భ‌గ‌వాన్‌. సినిమా అవ‌కాశాల కోసం వెతుకుతున్న రోజుల్లో తాను, ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ వైవీఎస్ చౌద‌రి ఒకే చోట అద్దెకు ఉండేవాళ్ల‌మ‌ని కృష్ణ‌భ‌గ‌వాన్ చెప్పాడు. తాము అద్దెకు ఉన్న ఇంట్లో పెద్ద కుక్క‌లు ఉండేవ‌ని కృష్ణ‌భ‌గ‌వాన్ అన్నాడు. మేము సినిమా ఛాన్స్‌ల కోసం తిరిగి తిరిగి రూమ్‌కు అర్థ రాత్రి వ‌చ్చేవాళ్లం.

రూమ్‌లోకి వెళ్ల‌డానికి కుక్క‌ల‌కు దొర‌క‌కుండా నేను, ర‌వితేజ‌, వైవీఎస్ చౌద‌రి గోడ‌లు దూకేవాళ్లం. గోడ‌లు దూకడం ఎలా అన్న‌ది మ‌మ్మ‌ల్ని చూపించే అంద‌రికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్లు అని కృష్ణ భ‌గ‌వాన్ కామెంట్స్ చేశాడు.

ఓ సారి నేను వాష్ రూమ్‌కు వెళ్ల‌డానికి బ‌కెట్ ప‌ట్టుకొని బ‌య‌ట‌కు వ‌స్తుంటే చిన్న కుక్క మెరిగి పెద్ద కుక్క‌ను పిలిచిందంటూ కృష్ణ భ‌గ‌వాన్ త‌మ క‌ష్టాల‌ను జ‌బ‌ర్ధ‌స్థ్ షోలో పంచుకున్నాడు. అవ‌న్నీ న‌వ్వుల‌ను పూయించాయి. ర‌వితేజ గురించి అత‌డి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది.

నాగ‌బాబు..రోజా...

జ‌బ‌ర్ధ‌స్థ్ షోకు తొలుత నాగ‌బాబు, రోజా జ‌డ్జ్‌లుగా ఉన్నారు. రాజ‌కీయాల కార‌ణంగా తొలుత నాగ‌బాబు షోకు గుడ్‌బై చెప్పారు. ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన రోజా కూడా జ‌బ‌ర్ధ‌స్థ్‌కు దూర‌మ‌య్యారు. వారి త‌ర్వాత కొన్నాళ్లు మ‌నో, ఖుష్బూ, మీనాతో పాటు ప‌లువురు సీనియ‌ర్ హీరోయిన్లు, న‌టులు జ‌డ్జ్‌లు వ‌చ్చారు. ఆ త‌ర్వాత జ‌డ్జ్‌లుగా కృష్ణ‌భ‌గ‌వాన్‌, ఇంద్ర‌జల‌ను తీసుకున్నారు. ఏడాది కాలంగా వీరిద్ద‌రే జ‌డ్జ్‌లుగా కొన‌సాగుతోన్నారు.

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌...

కాగా ప్ర‌స్తుతం ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ మూవీ రైడ్ రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌తంలో ర‌వితేజ, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో షాక్‌, మిర‌ప‌కాయ్ సినిమాలొచ్చాయి. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీలో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

IPL_Entry_Point