Raviteja Movie: ఆరున్నర లక్షల బడ్జెట్ - ఐదురోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ మూవీ ఏదో తెలుసా!
Raviteja Movie: రవితేజ హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన దొంగలముఠా మూవీ కేవలం ఆరున్నర లక్షల బడ్జెట్‌లోనే రూపొందింది. నటీనటులు రెమ్యునరేషన్ లేకుండా ఉచితంగా ఈ సినిమాలో నటించారు.
Raviteja Movie: సినిమా ప్రొడక్షన్ అంటేనే కోట్లతో కూడుకున్న వ్యవహారం. చిన్న సినిమాను నిర్మించాలన్న బడ్జెట్ ఐదు కోట్ల వరకు అవుతుంది. అదే స్టార్ హీరోతో సినిమా అంటే బడ్జెట్‌కు లిమిట్స్ కూడా ఉండవు. ఒక్కోసారి అనుకున్నదానికంటే రెట్టింపు కూడా అవుతుంది. కానీ రవితేజ, ఛార్మి హీరోహీరోయిన్లుగా నటించిన దొంగలముఠా మూవీ మాత్రం కేవలం ఆరున్నర లక్షల బడ్జెట్‌లోనే కంప్లీట్ అయ్యింది.
రామ్‌గోపాల్ వర్మ ప్రయోగం...
దొంగలముఠా మూవీని తక్కువ బడ్జెట్‌లో లిమిటెడ్ టెక్నిషియన్స్‌తో ప్రయోగాత్మకంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించాడు. ఈ సినిమాకు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మతో కలిసి కేవలం ఏడుగురు టెక్నిషియన్స్ మాత్రమే పనిచేశారు. ఈ ఐదుగురిలో పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా, హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్‌చేశారు. మరో నలుగురు కెమెరా టెక్నిషియన్స్ వర్క్ చేశారు.
ఎక్విప్‌మెంట్స్ లేకుండా...
జనరేటర్స్, లైట్స్, ట్రాలీ లాంటి షూటింగ్ ఎక్విప్‌మెంట్స్ ఏం లేకుండా నాచురల్ లైటింగ్‌తో చేతిలో పట్టుకునే కెమెరాతోనే దొంగలముఠా షూటింగ్‌ను రామ్‌గోపాల్ వర్మ కంప్లీట్ చేశాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ను కూడా తీసుకోలేదు రామ్‌గోపాల్ వర్మ. కెమెరా అసిస్టెంట్స్‌తోనే ఐదు డిఫరెంట్ యాంగిల్స్‌లో కెమెరాలు సెట్ చేసి సినిమా మొత్తాన్ని షూట్ చేశారు. ఆ కెమెరాలు కూడా ఒక్కొక్కటి లక్షన్నర లోపు ఖర్చువే వాడాడు రామ్‌గోపాల్ వర్మ. కెమెరా వారికి ఎలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వలేదు. వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు.
రవితేజ ఛార్మితో పాటు...
దొంగలముఠా సినిమాలో రవితేజ, ఛార్మితో పాటు ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, సునీల్, సుబ్బరాజుతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కానీ ఎవరూ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా రామ్‌గోపాల్ వర్మపై అభిమానంతో ఉచితంగా ఈ సినిమాలో నటించారు. దొంగల ముఠా షూటింగ్ మొత్తం ఐదు రోజుల్లోనే పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ కోసం 27 రోజుల పాటు టైమ్ తీసుకున్నారు. దొంగలముఠా సినిమా కథ మొత్తం ఒకే బిల్డింగ్‌లో సాగుతుంది.
ఒకే ఒక పాట...
ఈ మూవీలో ఒకే ఒక పాట కూడా ఉంది. ఆ పాటను రవితేజ, ఛార్మితో పాటు సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరిపై ఒకేరోజులో షూట్ చేశారు. ఈ పాటకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్‌లో ఆరున్నర లక్షలలోనే ఈ మూవీని కంప్లీట్ చేస్తానని రామ్‌గోపాల్ వర్మ ప్రకటించాడు. అన్నట్లుగానే పూర్తిచేశాడు. ఈ సినిమా క్వాలిటీ, మేకింగ్ విషయంలో ప్రశంసలను దక్కించుకున్నది.
పదింతల లాభం...
2011 మార్చి 18న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. పెట్టిన పెట్టుబడికి పదింతల లాభాలను మిగిల్చింది. ఆ తర్వాత సినిమా ద్వారా వచ్చిన లాభాలకు ఆర్టిస్టులు, టెక్నిషియన్లకు షేర్ చేశారు రామ్‌గోపాల్ వర్మ.
దొంగలముఠా స్ఫూర్తితో మరికొన్ని సినిమాలు తెలుగులో లిమిటెడ్ బడ్జెట్‌తో వచ్చిన అవేవీ ఈ మూవీ రిజల్ట్‌ను కొనసాగించలేకపోయాయి.
టాపిక్