Rgv on Chiranjeevi: భ‌జ‌న‌లు, పొగ‌డ్త‌ల‌కు అల‌వాటుప‌డిపోయాడు - చిరంజీవిపై రామ్‌గోపాల్ వ‌ర్మ సెటైర్‌-ramgopal varma satirical tweet on chiranjeevi bhola shankar movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv On Chiranjeevi: భ‌జ‌న‌లు, పొగ‌డ్త‌ల‌కు అల‌వాటుప‌డిపోయాడు - చిరంజీవిపై రామ్‌గోపాల్ వ‌ర్మ సెటైర్‌

Rgv on Chiranjeevi: భ‌జ‌న‌లు, పొగ‌డ్త‌ల‌కు అల‌వాటుప‌డిపోయాడు - చిరంజీవిపై రామ్‌గోపాల్ వ‌ర్మ సెటైర్‌

HT Telugu Desk HT Telugu

Rgv on Chiranjeevi: చిరంజీవితో పాటు భోళాశంక‌ర్ మూవీపై సెటైర్ వేస్తూ శుక్ర‌వారం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ట్వీట్‌లో వ‌ర్మ ఏమ‌న్నాడంటే...

రామ్‌గోపాల్ వ‌ర్మ

Rgv on Chiranjeevi: చిరంజీవి హీరోగా న‌టించిన భోళాశంక‌ర్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చింది. రీమేక్ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌స్తోంది. ఈ సినిమా రిజ‌ల్ట్‌తో పాటు చిరంజీవిపై రామ్‌గోపాల్ వ‌ర్మ ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేశాడు.

జ‌బ‌ర్‌, హైప‌ర్ వంటి ఆస్థాన విదూష‌కుల భ‌జ‌న, పొగ‌డ్త‌ల‌కు అల‌వాటుప‌డిపోయి రియాల్టీకి మెగా దూర‌మ‌వుతున్నార‌ని అనిపిస్తోంద‌ని వ‌ర్మ శుక్ర‌వారం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టాడు.

ఈ ట్వీట్‌లో చిరంజీవి పేరును ప్ర‌స్తావించ‌కుండానే సెటైరిక‌ల్‌గా ఆయ‌న‌పై ట్వీట్ వేశాడు వ‌ర్మ‌. భోళాశంక‌ర్ సినిమాలో హైప‌ర్ ఆది, గెట‌ప్ శీను తో పాటు ప‌లువురు జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్స్ న‌టించారు. సినిమాలో చిరంజీవిని పొగుడుతూ వారి క్యారెక్ట‌ర్స్ సాగుతాయి. ఆ సీన్స్‌ను ఉద్దేశించే వ‌ర్మ ఈ ట్వీట్‌ను చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. వ‌ర్మ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వ‌ర్మ కామెంట్స్ హండ్రెడ్ ప‌ర్సెంట్ క‌రెక్ట్ అని కొంద‌రు నెటిజ‌న్లు చెబుతోండ‌గా మెగా అభిమానులు మాత్రం అతడిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. భోళాశంక‌ర్ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వేదాళం సినిమా ఆధారంగా భోళాశంకర్ తెరకెక్కింది. క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఈ సినిమాపై మిక్స‌డ్ రెస్సాన్స్ ల‌భిస్తోంది. భోళాశంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తిసురేష్ ప్రధాన పాత్రను పోషించింది.