Dune Part 2 OTT: ఓటీటీలోకి వచ్చిన 1500 కోట్ల బడ్జెట్ హాలీవుడ్ మూవీ - ఎందులో చూడాలంటే?
Dune Part 2 OTT: హాలీవుడ్ మూవీ డ్యూన్ పార్ట్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Dune Part 2 OTT: ఈ ఏడాది హాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాల్లో ఒకటిగా డ్యూన్ పార్ట్ 2 మూవీ నిలిచింది. 190 (1500 కోట్లు) మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 685 కోట్ల (4500 కోట్లు) వరకు వసూళ్లను రాబట్టింది. 2024లో హాలీవుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.థియేటర్లలో వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో...
అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షో ఓటీటీలోనూ రెంటల్ విధానంలో ఈ సినిమా రిలీజైంది. డ్యూన్ పార్ట్ 2ను ఓటీటీలో చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా 499 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.ఫ్రీ స్ట్రీమింగ్ వారం తర్వాత ఉండబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
డ్యూన్ పార్ట్ 2 మూవీకి డెన్నిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించాడు. టిమోథీ ఛాల్‌మెట్, జెండాయా, రెబెకా ఫెర్యూసన్, అస్టీన్ బట్లర్ కీలక పాత్రలు పోషించారు.
ఆరు ఆస్కార్ అవార్డులు...
2021లో రిలీజైన డ్యూన్ పార్ట్ వన్ మూవీ ఆరు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, సౌండ్ డిజైనింగ్, ప్రొడక్షన్ డిజైన్‌తో పాటు మరో మూడు విభాగాల్లో అవార్డులను అందుకున్నది. ఇంటర్నేషనల్ వైడ్‌గా అనేక అవార్డులను అందుకున్నది.
పార్ట్ 3 కూడా...
డ్యూన్ పార్ట్ 1 విజయం సాధించడంతో డ్యూన్ పార్ట్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టే సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డ్యూన్ మూవీకి పార్ట్ 3 కూడా రాబోతోంది. డ్యూన్ పార్ట్ 3 షూటింగ్ ఇప్పటికే మొదలైంది.
నాలుగు గ్రహాల మధ్య పోరాటం...
డ్యూన్ కథను విజువల్ వండర్‌గా దర్శకుడు విల్లెనెయువ్ తెరకెక్కించాడు. పదివేల సంవత్సరాల తర్వాత జరిగే కథతో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ కథ సాగుతుంది. ఓ నాలుగు ప్లానెట్స్ మధ్య జరిగే పోరు చుట్టూ నడుస్తుంది. ఎట్రాడిస్ వంశాన్ని నాశనం చేసిన శత్రువులపై పాల్ అనే యువకుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. ఈ పోరాటంలో ఫ్రిమెన్స్ అనే ప్లానెట్ వారు పాల్‌కు ఎందుకు సాయం చేశారు? వారిని దేవుడిగా ఫ్రీమెన్స్ ఎలా నమ్మారు అన్నదే ఈ మూవీ కథ.
యాక్షన్ ఎపిసోడ్స్...
ఫస్ట్ పార్ట్‌లో పాల్ తల్లిదండ్రులను చంపడం వరకే దర్శకుడు చూపించాడు. సెకండ్ పార్ట్‌లో రివేంజ్‌ను చూపించారు. డ్యూన్ మొత్తం డ్రామాతో సాగగా...డ్యూన్ పార్ట్ 2లో మాత్రం యాక్షన్ అంశాలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.డ్యూన్ పార్ట్ 1 తరహాలోనే ఈ సీక్వెల్ కూడా ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటడం ఖాయమని హాలీవుడ్ సినీ వర్గాలతో పాటు అభిమానులు చెబుతోన్నారు.