Naga Babu On Mega Heroes: మా ఇంటి హీరోలు నాకు క్యారెక్టర్స్ ఇవ్వలేదు - మెగా హీరోలపై నాగబాబు కామెంట్స్
Naga Babu On Mega Heroes: శ్రీదేవి శోభన్‌బాబు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా హీరోలపై నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే...
Naga Babu On Mega Heroes: మెగా హీరోలపై శ్రీదేవి శోభన్‌బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. శ్రీదేవి శోభన్‌బాబు సినిమాను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి నిర్మిస్తోంది.

సంతోశ్ శోభన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నాగబాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో నాగబాబు తమ ఫ్యామిలీ హీరోలపై సరదాగా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
మా ఇంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ ఎవరు ఎప్పుడు నాకు ఏ క్యారెక్టర్ ఇవ్వలేదు. కానీ సుస్మిత మాత్రం శ్రీదేవి శోభన్ బాబుతో పాటు తాను తీస్తోన్న మరో వెబ్‌సిరీస్‌లో మంచి పాత్రలు ఇచ్చింది అని అన్నాడు. నాగబాబు సరదాగానే ఈ కామెంట్స్ చేసిన అవి టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి.
సుస్మిత తలుచుకుంటే తనకు సపోర్ట్‌గా చాలా మంది హీరోలు ఉన్నారు. ఎవరిని సినిమా చేయమన్నా కళ్లుమూసుకొని ముందుకొచ్చి చేస్తారు. కానీ స్టార్ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్‌గా ప్రొడ్యూసర్‌గా శ్రీదేవి శోభన్‌బాబు సినిమా చేసింది. సాధారణ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు పడాలో ఈ సినిమా కోసం సుస్మిత అన్ని కష్టాలను ఎదుర్కొన్నదని నాగబాబు పేర్కొన్నాడు.
త్వరలోనే సుస్మిత మెగా ప్రొడ్యూసర్ అవుతుందని చెప్పాడు. శ్రీదేవి శోభన్‌బాబు సినిమాకు ప్రశాంత్ దిమ్మల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో గౌరి.జి.కిషన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
టాపిక్