Suspence Thriller OTT: ఓటీటీలోకి మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ - ప్రతి సీన్ ఓ క్లైమాక్స్ - ట్విస్ట్‌లు అదుర్స్
Suspence Thriller OTT:మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గోలం ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Suspence Thriller OTT: మలయాళంలేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గోలం ఓటీటీలోకి వచ్చింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గోలం మూవీ ద్వారా దర్శకుడితో పాటు హీరోహీరోయిన్లు మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతా కొత్తవాళ్లతో రూపొందిన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
హీరోగా తొలి మూవీ...
గోలం మూవీలో రంజిత్ సాజీవ్ హీరోగా నటించగా సన్నీవేన్, దిలీష్ పోతన్, సిద్ధికీ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ మర్డర్ మస్టరీ మూవీతో సమ్జద్ దర్శకుడిగా మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ మూవీకి ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు.
గోలం మూవీ కథ ఇదే...
ఓ కార్పొరేట్ ఆఫీస్‌లో చుట్టూ ఉద్యోగులు ఉండగానే జాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురువుతాడు. పొలిటికల్‌గా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఆ మర్డర్ కేసు సంచలనంగా మారుతుంది. ఈ మర్డర్ కేసు ఇన్వేస్టిగేషన్‌ను కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన సందీప్ కృష్ణ చేపడతాడు. ఆ ఆఫీస్‌లోనే పనిచేసే ఉద్యోగుల్లోనే ఎవరో ఒకరు జాన్‌ను హత్య చేశారని సందీప్ అనుమానిస్తాడు. అందరిపై కన్నేసి ఉంచుతాడు. అతడి ఇన్వేస్టిగేషన్‌లో ఎలాంటి నిజాలు తెలిశాయి? జాన్‌ను హత్య చేసిన కిల్లర్‌ను సందీప్ ఏ విధంగా పట్టుకున్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
దృశ్యం డైరెక్టర్ ప్రశంసలు...
గోలం సినిమాలోని మెయిన్ పాయింట్‌ను డైరెక్టర్ రాసుకున్న తీరుకు ప్రశంసలు దక్కాయి. సందీప్ ఇన్వేస్టిగేషన్ సీన్స్, ఆఫీస్‌లో అమాయకులుగా కనిపించే ఒక్కో పాత్రకు సంబంధించి రివీలయ్యే ట్విస్ట్‌లతో చివరి వరకు ఎంగేజింగ్‌గా ఈ సినిమా సాగుతుంది. సినిమా కథ మొత్తం చాలా వరకు ఒకే బిల్డింగ్‌లోనే సాగుతుంది. కొద్ది పాత్రల నేపథ్యంలోనే అయినే థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌ప్లేను రాసుకున్నాడు. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో పాటు పలువురు మలయాళ దర్శకుల మెప్పును ఈ మూవీ పొందింది.
చిన్న సినిమాల్లో పెద్ద హిట్
గోలం సినిమా హీరోగా రంజిత్ సాజీవ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. గోలం కంటే ముందు మోదా, ఖలబ్, మైక్ సినిమాలు చేశాడు రంజిత్. దాదాపు ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గోలం పది కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ ఏడాది మాలీవుడ్‌లో చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో ఒకటిగా గోలం నిలిచింది. ఈ మూవీ బడ్జెట్‌లో ప్రొడక్షన్ కంటే ఆర్టిస్టులకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండటం గమనార్హం. గోలం మూవీ జూన్ 7న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది.