OTT Mystery Thriller: మలయాళ సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్‌పై అఫీషియల్ అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ.. తెలుగులోనూ కన్ఫర్మ్-malayalam mystery thriller kishkindha kaandam to stream on disneyplus hotstar soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Mystery Thriller: మలయాళ సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్‌పై అఫీషియల్ అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ.. తెలుగులోనూ కన్ఫర్మ్

OTT Mystery Thriller: మలయాళ సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్‌పై అఫీషియల్ అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ.. తెలుగులోనూ కన్ఫర్మ్

Kishkindha Kaandam OTT: కిష్కింద కాండం సినిమా ఓటీటీ రిలీజ్‍పై అప్‍డేట్ వచ్చింది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ అఫీషియల్ అప్‍డేట్ వెల్లడించింది. ఈ సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.

OTT Mystery Thriller: మలయాళ సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్‌పై అఫీషియల్ అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ.. తెలుగులోనూ కన్ఫర్మ్

ఆసిఫ్ అలీ, విజయ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘కిష్కింద కాండం’ సినిమా సూపర్ హిట్ కొట్టింది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ బ్లాక్‍బస్టర్ సాధించింది. ఈ మూవీకి దినిజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కోసం నిరీక్షణ సాగుతోంది. ఈ తరుణంలో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍పై నేడు ఓ అప్‍డేట్ వచ్చింది.

ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. త్వరలో అంటూ..

కిష్కింద కాండం సినిమా త్వరలో స్ట్రీమింగ్‍కు రానుందంటూ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ నేడు (అక్టోబర్ 30) వెల్లడించింది. దీంతో హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం వస్తుందని ఫిక్స్ అయింది. అయితే, ఇప్పటికి స్ట్రీమింగ్ తేదీని ఆ ఓటీటీ వెల్లడించలేదు. త్వరలో అని మాత్రం వెల్లడించింది.

తెలుగులోనూ స్ట్రీమింగ్

కిష్కింద కాండం చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఐదు భాషల్లోకి రానుంది. ఈ విషయాన్ని కూడా ఆ ఓటీటీ కన్ఫర్మ్ చేసేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను హాట్‍స్టార్ అతిత్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఈరోజున వస్తుందని రూమర్స్

కిష్కింద కాండం చిత్రం నవంబర్ 1వ తేదీన హాట్‍స్టార్ ఓటీటీలోకి వస్తుందని కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అందుకు రెండో రోజులే ఉండగా.. హాట్‍స్టార్ ఇప్పుడు డేట్ ఇవ్వకుండా త్వరలో స్ట్రీమింగ్ అని పేర్కొంది దీంతో నవంబర్ 1న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రాకుండా ఆలస్యమవుతుందేమోననే అనుమానాలు రేగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కిష్కింద కాండం మూవీని డైరెక్టర్ అయ్యథాన్ డిఫరెంట్ పాయింట్‍తో తెరకెక్కించారు. కోతులు ఎక్కువగా ఉండే ఓ ఊర్లో అనూహ్య ఘటనలు జరుగుతాయి. ఇందుకు కారణం ఏంటనే మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. కిష్కింద కాండం చిత్రంలో ఆసిఫ్ అలీ, విజయ రాఘవన్‍తో పాటు అపర్ణా బాలమురళి కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. అశోకన్, జగీదీశ్, షెబిన్ బెన్సన్, మాస్టర్ అర్వవ్, వైష్ణవి రాజ్ కీలకపాత్రల్లో కనిపించారు.

కిష్కింద కాండం కలెక్షన్లు

కిష్కింద కాండం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. దాదాపు రూ.7కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ చిత్రం.. ఏకంగా రూ.75 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో బిగ్ హిట్‍గా నిలిచింది. గుడ్‍‍విల్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై జాయ్ జార్జ్ తండతిల్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.

కాగా, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో తమిళ స్పోర్ట్స్ డ్రామా మూవీ లబ్బర్ పందు రేపు (అక్టోబర్ 30) స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళం, తెలుగు సహా మరో మూడు భాషల్లోనూ స్ట్రీమ్ అవనుంది. ఈ చిత్రంలో హరీశ్ కల్యాణ్, అట్టకత్తి దినేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళరాసన్ పంచముత్తు దర్శకత్వం లబ్బర్ పందు.. సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజై హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ పతాకం నిర్మించగా.. రోల్డన్ సంగీతం ఇచ్చారు.