2 in 1 EV : మూడే మూడు నిమిషాల్లో ఈ త్రీ వీలర్ కాస్త ఎలక్ట్రిక్ స్కూటీగా మారుతుంది.. టూ ఇన్ వన్ ఈవీ-hero surge s32 2 in 1 ev electric scooter cum rickshaw to start production soon can transform into 3w to 2w in 3 minutes ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2 In 1 Ev : మూడే మూడు నిమిషాల్లో ఈ త్రీ వీలర్ కాస్త ఎలక్ట్రిక్ స్కూటీగా మారుతుంది.. టూ ఇన్ వన్ ఈవీ

2 in 1 EV : మూడే మూడు నిమిషాల్లో ఈ త్రీ వీలర్ కాస్త ఎలక్ట్రిక్ స్కూటీగా మారుతుంది.. టూ ఇన్ వన్ ఈవీ

Anand Sai HT Telugu
Nov 20, 2024 09:30 AM IST

Hero surge s32 2 in 1 EV : హీరో ఇటీవల తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఇది త్రీ వీలర్, టూ వీలర్ వాహనంగా పనిచేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే త్రిచక్ర వాహనం కాస్త ద్విచక్ర వాహనంగా మారుతుంది.

మూడు నిమిషాల్లో స్కూటీగా మారే త్రీ వీలర్
మూడు నిమిషాల్లో స్కూటీగా మారే త్రీ వీలర్

హీరో నుంచి అద్భుతమైన వాహనం వస్తుంది. ఈ కొత్త విషయం తెలిసినవారు ఆశ్చర్యపోతున్నారు. అదేంటంటే.. హీరో ఇటీవల ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ వాహనం గురించి. ఇది త్రీ వీలర్ కమ్ టూ వీలర్. అంతే కాదు ఇది కార్గో త్రిచక్ర వాహనంలా వాడుకోవచ్చు. దీనికి కంపెనీ సర్జ్ అని నామకరణం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో అరంగేట్రం చేసి, అనేక డిజైన్ అవార్డులను గెలుచుకున్న హీరో సర్జ్ ఎస్ 32 మళ్లీ వార్తల్లో నిలిచింది.

ఏడాది తర్వాత ఈసారి కంపెనీ ఎస్ 32 ఉత్పత్తిని ప్రారంభిస్తోంది. ఇది 2025 మధ్యలో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు. దీనితో మీరు వ్యాపారం చేయగలరు. అంటే డబ్బు సంపాదించుకోవచ్చు, పర్సనల్ పనులకు కూడా వాడుకోవచ్చు. ఇది కేవలం 3 నిమిషాల్లో త్రిచక్ర వాహనం నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది.

ఈ కార్గో త్రిచక్ర వాహనం లోపల ఒక ద్విచక్ర వాహనం దాగి ఉంటుంది. ముందు సీట్లో ఇద్దరు కూర్చునేందుకు అవకాశం ఉన్న త్రిచక్ర వాహనంగా ఉంటుంది. అయితే స్కూటర్ మార్చాలనుకున్నప్పుడు సీటింగ్ కెపాసిటీలో మార్పు వస్తుంది. స్కూటర్ సీటుకు ఛేంజ్ అవుతుంది. త్రిచక్ర వాహనం నుంచి ద్విచక్ర వాహనంగా మారడానికి 3 నిమిషాలు పడుతుంది. అలాగే అడాప్టివ్ కంట్రోల్, సేఫ్ ఆపరేషన్స్ కోసం బటన్లు ఉన్నాయి. దీన్ని ఏ ప్రాంతానికైనా మార్చుకోవచ్చు. ఈ సిరీస్‌లో మొత్తం 4 వేరియంట్లను కంపెనీ లాంచ్ చేయనుంది.

దీని టెక్నికల్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే సర్జ్ ఎస్ 32 త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాలకు వేర్వేరు పారామీటర్లను పొందుతుంది. ఇది త్రిచక్ర వాహనం అయినప్పుడు ఇది 10 కిలోవాట్ల శక్తిని పొందుతుంది. ఇందుకోసం దీన్ని 11 కిలోవాట్ల బ్యాటరీకి అనుసంధానం చేశారు. దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు. అదే సమయంలో ఇది 500 కిలోల బరువును మోయగలదు. 

ఎలక్ట్రిక్ టూ వీలర్ గురించి మాట్లాడితే.. ఇది 3 కిలోవాట్ల శక్తిని పొందుతుంది. ఇందుకోసం దీన్ని 3.5 కిలోవాట్ల బ్యాటరీకి అనుసంధానం చేశారు. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు.

ఈ ఎలక్ట్రిక్ వాహనంతో లాభం ఏంటంటే.. ఒకే ప్యాకేజీలో ఎలక్ట్రిక్ స్కూటర్ కమ్ ఎలక్ట్రిక్ 3 వీలర్ వస్తుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకే ధరకు రెండు వాహనాలను పొందవచ్చు. సర్జ్ దీనిని క్లాస్ షిఫ్టింగ్ వెహికల్ అని కూడా పిలుస్తుంది. దీని ద్వారా కస్టమర్లు రెండు విధాలుగా ప్రయోజనం పొందుతారు. త్రీ వీలర్ నుంచి స్కూటీని విడదీసేందుకు పట్టే సమయం కేవలం మూడు నిమిషాలు మాత్రమే.

Whats_app_banner