Brahmamudi November 20th Episode: బ్రహ్మముడి- ఛాలెంజ్‌లో గెలిచిన రాజ్- పర్మనెంట్‌గా పుట్టింట్లో కావ్య- సిగ్గు పడిన తాత-brahmamudi serial november 20th episode raj is optimistic wins ceo challenge on kavya star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi November 20th Episode: బ్రహ్మముడి- ఛాలెంజ్‌లో గెలిచిన రాజ్- పర్మనెంట్‌గా పుట్టింట్లో కావ్య- సిగ్గు పడిన తాత

Brahmamudi November 20th Episode: బ్రహ్మముడి- ఛాలెంజ్‌లో గెలిచిన రాజ్- పర్మనెంట్‌గా పుట్టింట్లో కావ్య- సిగ్గు పడిన తాత

Sanjiv Kumar HT Telugu
Nov 20, 2024 08:02 AM IST

Brahmamudi Serial November 20th Episode: బ్రహ్మముడి నవంబర్ 20 ఎపిసోడ్‌లో తనను ఆశీర్వదించమని ఇంట్లో అందరిని అడుగుతాడు రాజ్. కానీ, రుద్రాణి తప్ప అందరూ కావ్య గెలవాలని కోరుకుంటున్నట్లు చెబుతారు. తర్వాత ఆఫీస్‌లో కావ్య వేసిన డిజైన్స్ తనవి అని చెప్పి ఛాలెంజ్‌లో గెలుస్తాడు రాజ్.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 20 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 20 ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ స్టైల్‌గా రెడీ అయి వస్తాడు. అందరూ విష్ చేసి గంట తర్వాత కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి అని రాజ్ అంటాడు. గెలుపు ఓటములు రెండు తప్పవు అని ప్రకాశం అంటాడు. నేనిప్పుడు ఓడిపోలేదు బాబాయ్. నాకు హ్యాపీ జర్నీ అని చెప్పాలి అని అంటాడు రాజ్.

ఫ్రిజ్‌లో పెట్టు దీవెనలు

తర్వాత కంగారుగా ఉన్న అపర్ణను చూసి ఓ మై గాడ్ మమ్మీ. టెన్షన్ పడకు. ప్రకృతి అన్నాకా పగలు చీకటి రెండు ఉంటాయి. ఇవాళ నేను వెలుగు నింపుకోడానికి వెళ్తున్నాను అని రాజ్ అంటే.. ఏదో వెలగబెట్టడానికి వెళ్తున్నాడట ఆశీర్వదించూ అని ఇందిరాదేవి అంటుంది. దాంతో పిల్ల పాపలతో చల్లగా ఉండు అని అపర్ణ దీవిస్తుంది. వెళ్లి ఫ్రిజ్‌లో పెట్టు నీ దీవెనలు అని రాజ్ ఫైర్ అవుతాడు. ఇక్కడ ఇంతే వస్తుంది. అక్కడ ట్రై చేయమని అంటుంది అపర్ణ.

దాంతో ఇందిరాదేవిని ఆశీర్వాదం అడిగితే సుపుత్ర ప్రాప్తిరస్తు అని అంటుంది. దాంతో నేను వెళ్లే పనేంటీ ఇస్తున్న దీవెనలు ఏంటీ అని రాజ్ అంటాడు. అన్నం తినేవాళ్లు ఎవరైన సరే భార్యాభర్తలు విడిపోవాలని కోరుకోరు అని రాజ్ అంటాడు. దాంతో అంటే మా అత్త అన్నం తినదా అని కౌంటర్ ఇస్తుంది. నన్ను లాగకు అని రుద్రాణి ఫైర్ అవుతుంది. తర్వాత సుభాష్ వచ్చి కూడా పిల్లపాపలతో కొడుకు ఉంటే పుత్రోత్సాహం కలుగుతుంది కదా అని అంటాడు.

రాజ్, కావ్యకు ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అని సుభాష్ అంటాడు. ఎవరైనా ఒకరివైపే ఉండాలి. తాతయ్య న్యాయం వైపే ఉంటాడు అని సీతారామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోడానికి వెళ్తాడు రాజ్. నాకెందుకో కావ్యె గెలుస్తుందని అంటాడు సీతారామయ్య. దాంతో రాజ్ షాక్ అవుతాడు. రాజ్ ఫీల్ అవడం చూసి సరే ఆశీర్వదిస్తానని పుత్ర అభివృద్ధి ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు. దాంతో మరింత అవాక్కవుతాడు రాజ్. తర్వాత ఇప్పుడే చెబుతున్నాను. నేను గెలిస్తే కళావతి ఆఫీస్‌లో కానీ, ఇంట్లో కానీ అడుగుపెట్టడానికి వీళ్లేదని తెగేసి చెబుతాడు రాజ్.

మంచి డిజైనర్స్ ఉన్నారు

పందెం అంటే పందెమేరా నువ్ ఓడిపోతే కావ్యను సీఈఓగా ఒప్పుకోవడమే కాదు భార్యగా ఇంట్లోకి తీసుకురావాలి అని సీతారామయ్య అంటాడు. కచ్చితంగా గెలుపు నాదే అని రాజ్ అంటాడు. వీడు ఇంత నమ్మకంగా చెప్పాడంటే కచ్చితంగా ఏదో ఫిట్టింగ్ పెట్టినట్లే. ఏరా ఏమైనా మతలబు చేశావా అని ఇందిరాదేవి అంటుంది. నేనేందుకు రాంగ్ రూట్‌లో వెళ్తావ్. మంచి డిజైనర్స్‌ను నా టీమ్‌లో పెట్టుకుని రాత్రి పగలు కష్టపడ్డాను అని రాజ్ అంటాడు.

ఏంటీ అమ్మ రాజ్‌ను అలా అనుమానించి అవమానిస్తున్నారు. రాజ్ గెలవడం ఇష్టలేనట్లు మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు నా కొడుకును దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు రాజ్ మీద పడ్డారా. ఎవరు ఏమనుకున్న సరే నా ఫుల్ సపోర్ట్ రాజ్‌కే ఉంటుంది అని రుద్రాణి అంటుంది. థ్యాంక్యూ అత్త అని రాజ్ అనబోతుంటే స్వప్న తుమ్ముతుంది. నా తుమ్ము మంచిదే. మా కావ్య తుమ్మమని అంటుందని స్వప్న అంటుంది.

న్యాయంగా అయితే నా మనవడు అంత ఎత్తున ఉండాలని కోరుకుంటాను. కానీ ఈసారి కోరుకోను. వాడి కాపురం కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అందుకే మా అందరి సంకల్పంతో కావ్య గెలవలాని కోరుకుంటున్నాం అని ఇందిరాదేవి అంటుంది. నా సంకల్పం నాకుంది అని శాంతను పిలుస్తాడు రాజ్. తనెందుకురా పనిమనిషితో కూడా ఆల్ ది బెస్ట్ చెప్పించుకుంటావా అని ప్రకాశం అంటాడు. నేను విజయంతో గెలిచి వస్తాను. మా టీమ్‌కు ఇంట్లోనే గ్రాండ్‌గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి వంటలు అద్భుతంగా చేయాలి. ఇదిగో మెను అని లిస్ట్ ఇస్తాడు రాజ్.

వేరే రూట్‌లో కావ్య

అది చూసి శాంత భయపడిపోతుంది. కావాలంటే పదిమంది అసిస్టెంట్స్‌ను పెట్టుకో అని రాజ్ అంటాడు. దాంతో అయితే కావ్యకు ఇష్టమైనవి చేద్దాం అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. నేను వెళ్తున్నాను అని రాజ్ అంటే.. క్షేమంగా వెళ్లి కావ్యతో రా నాన్న అని ఇందిరాదేవి అంటే.. సంతోషంగా వెళ్లి ఓడిపోయి రా అని అపర్ణ అంటుంది. వీళ్లకు కనుక నిజం తెలిస్తే ఏమైపోతారో అని నవ్వుకుంటూ వెళ్లిపోతాడు రాజ్. మరోవైపు కావ్య ఆటో డ్రైవర్ మెల్లిగా తీసుకెళ్తాడు.

దాంతో కావ్య స్పీడ్‌గా వెళ్లమని కోప్పడుతుంది. ఈమెను లేట్‌గా తీసుకెళ్లకుంటే రాజ్ సర్ నన్ను చంపెస్తారు అని ఆటో డ్రైవర్ అనుకుంటాడు. తర్వాత వేరే రూట్‌లో కావ్యను తీసుకెళ్తాడు ఆటో డ్రైవర్. మరోవైపు పదిన్నరకు మీటింగ్ అనుకున్నాం కదా. కావ్య ఇంకా రాలేదేంటీ. ట్రాఫిక్‌లో ఇరుక్కుందేమో అని జగదీష్ అంటాడు. తన తరఫున నేను సారీ చెబుతున్నాను. ఆడవాళ్ల సంగతి తెలిసిందే కదా. లేట్‌గా లేస్తారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుంటారు. కావ్య టాలెంటెడే కానీ, ఆలస్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని రాజ్ అంటాడు.

టైమ్ దొరికింది కదా అని అల్లుకుపోతున్నాడు గురుడు. ఈయనేమో ఇగోకి బ్రాండ్ అంబాసిడర్ అని శ్రుతి అనుకుంటుంది. వినపడింది అని రాజ్ అంటాడు. ఇలాంటివి బాగా వినపడతాయ్. రాక్షసుడు అని శ్రుతి అనుకుంటుంది. మీ మేడమ్ ఎక్కడ ఉన్నారో ఫోన్ చేసి కనుక్కో అని రాజ్ అంటాడు. దాంతో కావ్యకు కాల్ చేస్తుంది శ్రుతి. త్వరగా రమ్మని, జగదీష్ గారి మైండ్ రాజ్ సర్ మార్చేలా ఉన్నారని శ్రుతి చెబుతుంది. తర్వాత మేడమ్ దారిలో ఉన్నారట వచ్చేస్తారు అని జగదీష్‌కు శ్రుతి చెబుతుంది.

ఆటో డ్రైవర్ బైకర్ గొడవ

ఇంతలో ఆటో ఓ బైక్‌ను ఢీ కొడుతుంది. దాంతో బైకర్‌తో ఆటో డ్రైవర్ గొడవ పడతాడు. తను వచ్చేలోపు నా డిజైన్స్ చూస్తారా అని రాజ్ అంటే.. ఇద్దరివి ఒకేసారి చూస్తాను అని జగదీష్ అంటాడు. తను రాదు అని రాజ్ అంటే.. ఏంటీ అని జగదీష్ అంటాడు. మేడమ్ ఎప్పుడు లేట్‌గా రాలేదు. ఏదో జరిగింది అని శ్రుతి డౌట్ పడుతుంది. మరోవైపు డ్రైవర్, బైక్ అతని గొడవని సాల్వ్ చేసి ఆటో తీయిస్తుంది కావ్య. వాడికెందుకు డబ్బులు ఇచ్చారు మేడమ్. వాడే ఓవర్ చేశాడు. మీకు డబ్బులు వేస్ట్ అని ఆటో డ్రైవర్ అంటాడు.

ఇప్పుడు టైమ్‌కు వెళ్లకపోతే నా లైఫే వేస్ట్ అవుతుంది అని కావ్య అంటుంది. ఇక లేట్ చేసి లాభం లేదని, రాజ్‌కు వస్తున్నట్లు మేసేజ్ చేస్తాడు ఆటో డ్రైవర్. మేసేజ్ చూసుకుని రాజ్ టెన్షన్ పడతాడు. తనొచ్చేలోపు నా డిజైన్స్ చూడమని ప్రజెంట్ చేస్తాడు రాజ్. అవి చూసి శ్రుతి షాక్ అవుతుంది. ఇవి నా ఓన్ డిజైన్స్ సర్. చాలా డిఫరెంట్‌గా, ట్రెడిషనల్‌గా చేశాను అని రాజ్ బిల్డప్ ఇచ్చుకుంటాడు. ఇవి కావ్య మేడమ్ వేసిన డిజైన్స్ కదా సర్ దగ్గరికి ఎలా వచ్చాయి అని శ్రుతి అనుకుంటుంది.

ఇంతలో వచ్చిన కావ్య ఆ డిజైన్స్ చూసి షాక్ అవుతుంది. సేమ్ మన్మథుడు సినిమాలో సీన్‌లా ఉంటుంది. మేడమ్ ఇవి మీరు వేసిన డిజైన్స్ కదా అని శ్రుతి అంటుంది. అవును. కానీ, క్లైంట్ ముందు ఏం మాట్లాడకు అని కావ్య అంటుంది. రాజ్ వేసిన డిజైన్స్‌కు చప్పట్లు కొడతాడు జగదీష్. తర్వాత మెచ్చుకుంటాడు. రాజ్ టాలెంట్ నెక్ట్స్ లెవెల్‌లో ఉందని పొగుడుతాడు. అవును సర్ రాజ్ సర్‌ది గొప్ప టాలెంట్ అని కావ్య సెటైర్ వేస్తుంది.

ఇన్ టైమ్‌లో పూర్తి చేయండి

నువ్ వచ్చావ్ కాబట్టి కావ్యను తను వేసిన డిజైన్స్ చూపించమంటాడు జగదీష్. నా డిజైన్స్ ఇంకా పూర్తి కాలేదు. నా డిజైన్స్ దాదాపుగా దగ్గరిగానే ఉన్నాయి. కానీ, ఇవే చాలా బాగున్నాయి. మీరు ఇవే తీసుకోండి అని కావ్య అంటుంది. ఒక సీఈఓ అయిండు వేరేవాళ్ల డిజైన్స్ తీసుకోమనడం రియల్లీ ఇన్‌స్పైరింగ్ అని జగదీష్ అంటాడు. రాజ్ కంట్రాక్ట్ మీకే ఇస్తున్నాను. అగ్రిమెంట్ అరెంజ్ చేయండి. కానీ, ఈ డిజైన్స్ మీరు ఇన్ టైమ్‌లో పూర్తి చేయండి అని జగదీష్ అంటాడు.

కచ్చితంగా సర్. క్లైంట్స్ సాటిస్‌ఫ్యాక్షన్ నాకు ముఖ్యం అని రాజ్ అంటాడు. దాంతో కంగ్రాట్స్ అని రాజ్‌కు చెబుతుంది కావ్య. తర్వాత జగదీష్, రాజ్ వెళ్లిపోతారు. మేడమ్ ఇది కరెక్ట్ కాదు. మీ డిజైన్స్ సర్ ఇలా దొంగతనం చేసి బిల్డప్ ఇచ్చుకోవడం నేను చూడలేకపోతున్నాను అని శ్రుతి అంటుంది. చూడలేకపోతే జాబ్ మానేసి వెళ్లిపో. నా కష్టమైన, కష్టార్జితమైన నా భర్తకే చెందుతుంది. అది ఆయన హక్కు. నువ్ లేడి నారధుడిలా రెచ్చగొట్టకు అని కావ్య అంటుంది.

మరోవైపు అపర్ణ హారతి తీసుకొస్తుంది. కావ్య ఎక్కడ అని అడిగితే పర్మినెంట్‌గా పుట్టింట్లో ఉంటుంది. నేనే గెలిచాను అని రాజ్ అంటాడు. ఛీ నీది ఒక గెలుపేనే కావ్య డిజైన్స్ దొంగతనం చేసి నీ డిజైన్స్ అని చెప్పుకోడానికి సిగ్గుగా లేదా, నా మనవడు అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాను అని సీతారామయ్య తిడతాడు. ఇప్పటికైనా కావ్యను ఇంటికి తీసుకురా పో అని ఇందిరాదేవి ఆర్డర్ వేస్తుంది. అక్కడితే నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner