AP Weavers : చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్- 500 యూనిట్ల ఉచిత విద్యుత్, 5 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్
AP Weavers : చేనేత కార్మికుల ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. నూలు కొనుగోలుకు సబ్సిడీ, 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ కు చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్లు, చేనేత మగ్గాలు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. నిన్న అసెంబ్లీ మంత్రి సవిత మాట్లాడుతూ...గత వైసీపీ ప్రభుత్వం, నేతన్నల ఓట్లు దండుకుని ఉత్తుత్తి బటన్ నొక్కి నేతన్నలు దారుణంగా దగా చేసిందని మండిపడ్డారు. గత ఐదు సంవత్సరాలుగా నేతన్నలు పడుతున్న కష్టాలను కూటమి సర్కార్ తీర్చిందిన్నారు. శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏడో రోజు ఎలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానాలు చేశారు.
విదేశాల్లో ఎగ్జిబిషన్లు
చేనేత కార్మికుల హెల్త్ ఇన్సూరెన్స్, 5 శాతం జీఎస్టీ రీయింబర్స్ మెంట్ కల్పిస్తామని మంత్రి సవిత అన్నారు. కర్నూలు, విజయనగరంలో చేనేత శాలలు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం విదేశాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేతకు చంద్రబాబు పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే అన్నారు. 50 ఏళ్లకే చేనేత కార్మికులకు రూ.4 వేల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. 6 నెలల్లో 3 ఆప్కో షోరూమ్ ల ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో 2 వీవర్ శాలల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
10 చేనేత క్లస్టర్లు
"10 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంలో ఈ క్లస్టర్ల ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ కు చర్యలు తీసుకోనున్నాం. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, నూలు కొనుగోలుకు సబ్సిడీ, చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. 2014-19 నాటి పథకాలన్నీ తిరిగి అమలు చేస్తాం"- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
సంబంధిత కథనం