Comedy Thriller OTT: సడెన్‌గా ఓటీటీలో రిలీజైన లేటెస్ట్ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Comedy Thriller OTT: తెలుగు లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఉరుకు పటేల సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ టాలీవుడ్ మూవీలో తేజస్ కంచెర్ల, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు.
Comedy Thriller OTT: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఉరుకు పటేల ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ తెలుగు మూవీ రిలీజైంది. ఉరుకు పటేల మూవీలో హుషారు ఫేమ్ తేజస్ కంచెర్ల హీరోగా నటించాడు. ఈ మూవీలో ఖుష్బూ పటేల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
సెప్టెంబర్‌లో థియేటర్లలో రిలీజ్...
వివేక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఉరుకు పటేల మూవీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైంది. కాన్సెప్ట్ బాగుందనే పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది ఈ మూవీ. పోటీ మధ్య థియేటర్లలో రిలీజ్ కావడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది.
ఉరకు పటేల కథ ఇదే...
పటేల (తేజస్ కంచెర్ల) జమీందారు కుటుంబానికి చెందిన యువకుడు. తెలంగాణలోని ఓ పల్లెటూళ్లో ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. తమ విలేజ్‌కు మెడికల్ క్యాంప్ నిమిత్తం వచ్చిన డాక్టర్ అక్షరతో (ఖుష్బూ చౌదరి) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. లవ్ స్టోరీ సాఫీగా సాగిపోతున్న తరుణంలోనే ఓ ప్రమాదం కారణంగా పటేల కాలు కోల్పోతాడు.
అవిటివాడైన పటేలను పెళ్లిచేసుకోవడానికి అక్షర సిద్ధపడుతుంది. మరోవైపు పటేలను చంపేందుకు అక్షర తండ్రి ప్రయత్నాలు చేస్తుంటాడు? పటేల కాలు ఎలా కోల్పోయాడు? అక్షర తండ్రి అతడిని ఎందుకు చంపాలని అనుకుంటాడు? ఆ మర్డర్ ప్లాన్ నుంచి పటేల ఎలా బయటపడ్డాడు అనే అంశాలను క్రైమ్, కామెడీ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు ఈ మూవీలో చూపించాడు.
ఉలవచారు బిర్యానీతో...
ఉరకు పటేల సినిమాను హీరో తేజస్ కంచెర్ల స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. ఈ క్రైమ్ కామెడీ మూవీకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించాడు. ప్రకాష్ రాజ్ లీడ్‌రోల్‌లో నటిస్తూ నిర్మించిన ఉలవచారు బిర్యానీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు తేజస్ కంచెర్ల. తమిళంలో ఈ మూవీ రిలీజైంది.
హుషారుతో హిట్...
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన హుషారు మూవీతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీలో నలుగురు హీరోల్లో ఒకరిగా తేజస్ కంచెర్ల కనిపించాడు. కేటుగాడు, ఆర్‌డీఎక్స్ లవ్‌తో పాటు తెలుగులో మరికొన్ని సినిమాలు చేశాడు.