Tollywood Singers: పాడుతా తీయగా ద్వారా టాలీవుడ్‌లోకి 30 మంది సింగర్స్ ఎంట్రీ - ఆ సింగర్స్ ఎవరంటే?
Tollywood Singers: తెలుగు సింగింగ్ టీవీ షో పాడుతా తీయగా త్వరలో సిల్వర్ జూబ్లీలోకి ఎంటర్‌కాబోతుంది. 25వ సీజన్ మొదలుకానుంది. పాడుతా తీయగా ద్వారా ఇప్పటివరకు 30కిపైగా సింగర్స్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అందులో కొందరు టాప్ సింగర్స్‌లో కొనసాగుతోన్నారు.
(1 / 6)
పాడుతా తీయగా ద్వారా ఇప్పటివరకు 30కిపైగా సింగర్స్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అందులో కొందరు టాప్ సింగర్స్‌లో కొనసాగుతోన్నారు.
(2 / 6)
సింగర్ ఉషా, గోపిక పూర్ణిమ పాడుతా తీయగా ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఉష తెలుగుతో పాటు ఇతర భాషల్లో కలిపి వెయ్యికిపైగా పాటలు పాడింది. గోపిక పూర్ణిమ ఐదు వందల పాటలు పాడటం గమనార్హం.
(3 / 6)
తెలుగులో ఎన్నో మధురమైన పాటలతో మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించిన కౌసల్య కూడా పాడుతా తీయగా ద్వారానే సింగర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
(4 / 6)
నిత్య సంతోషిణి, లిప్సిక, దామిని భట్ల, మనిషా ఎరబత్తిని, సాహితి చాగంటి, హరిణి ఇవటూరి, స్మిత, శ్రీలత కూడా పాడుతా తీయగా ద్వారా పాపులర్ అయ్యారు. సినిమాల్లో అవకాశాల్ని దక్కించుకున్నారు.
(5 / 6)
తెలుగులో ఎనిమిది వందలకుపైగా పాటలు పాడిన సింగర్ హేమచంద్ర పాడుతా తీయగానే లైఫ్ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరిగా కొనసాగుతోన్న అనురాగ్ కులకర్ణి, మల్లిఖార్జున్‌లు పాడుతా తీయగా ద్వారానే అవకాశాల్ని అందుకున్నారు.
ఇతర గ్యాలరీలు