Krishna mukunda murari december 23rd: దేవ్ ట్రాప్ లో పడిన ఏసీపీ సర్.. మురారి తనకే కావాలని తెగేసి చెప్పిన ముకుంద-krishna mukunda murari december 23rd dev devises a scheme to disrupt krishna and murari relationship ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari December 23rd: దేవ్ ట్రాప్ లో పడిన ఏసీపీ సర్.. మురారి తనకే కావాలని తెగేసి చెప్పిన ముకుంద

Krishna mukunda murari december 23rd: దేవ్ ట్రాప్ లో పడిన ఏసీపీ సర్.. మురారి తనకే కావాలని తెగేసి చెప్పిన ముకుంద

Gunti Soundarya HT Telugu
Dec 23, 2023 07:22 AM IST

Krishna mukunda murari december 23rd: దేవ్ ఎంట్రీతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మురారి వాళ్ళని నమ్మించడం కోసం ముకుందకి వ్యతిరేకంగా మాట్లాడతాడు.

కృష్ణ ముకుంద మురారి డిసెంబర్ 23 ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి డిసెంబర్ 23 ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari december 23rd: దేవ్ మురారి ఇంటికి వస్తాడు. రేవతి తనని చూసి ఎవరని అడుగుతుంది. ముకుంద దేవ్ కి రేవతిని పరిచయం చేస్తుంది. ఈ అబ్బాయి గురించి ఎప్పుడు చెప్పలేదు ఏంటని అంటుంది. భవానీ వచ్చి అతను ఎవరని అంటే తన అన్నయ్యని చెప్తుంది. ఏం చేస్తున్నాడని అంటే కెన్యాలో బిజినెస్ చేస్తున్నాడని అబద్దం చెప్తుంది. ఇంట్లో వాళ్ళందరిని దేవ్ కి పరిచయం చేస్తుంది. అందరి మొహాల్లో ఏడుపు చూసి తన చెల్లి పెళ్లి చేసి వెళ్తానని దేవ్ మనసులో అనుకుంటాడు.

కృష్ణ హనీమూన్ ప్లాన్

మురారి, కృష్ణ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ కాసేపు ప్రేమించుకుంటారు. వెంటనే భవానీకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి కృష్ణ దూరంగానే ఉందామని అంటుంది. దీంతో మురారి అలుగుతాడు. ఏసీపీ సర్ మీరు అలిగినప్పుడు భలే ఉంటారు.. అచ్చం అని ఆపేస్తుంది. అచ్చం ఎలా ఉంటానో చెప్పమని మురారి అడుగుతాడు. అచ్చం ఏబీసీడీల అబ్బాయిలాగా ఉంటారని అంటుంది. కేసు తప్పకుండా గెలుస్తారు. ఆ తర్వాత మనం హనీమూన్ కి వెళ్దామని చెప్తుంది. ఒక నెలరోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేద్దామని చెప్తుంది.

దేవ్ ని ముకుంద కృష్ణ ఇంటికి తీసుకొస్తుంది. నేనేం మాట్లాడిన నీ మంచి కోసమే.. నీగురించి రివర్స్ గా మాట్లాడితే నా మంచి కోసమే కదా అని నవ్వుతూ ఉండు రియాక్ట్ అవమని దేవ్ సలహా ఇస్తాడు. ఏంటి ఇదంతా ఈ కుట్రలు, కుతంత్రాలు తనకి నచ్చవని చెప్తుంది. తప్పదు నీ పెళ్లి గురించి ఆలోచించమని చెప్తాడు. కృష్ణ వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకుంటుంటే దేవ్, ముకుంద ఇంట్లోకి వస్తారు. వాళ్ళని చూసి వీళ్ళ మధ్య దూరం పెంచడం చాలా కష్టంగా ఉందని దేవ్ మనసులో అనుకుంటాడు. ముకుంద దేవ్ ని మురారికి పరిచయం చేస్తుంది.

దేవ్ బుట్టలో పడిపోయిన మురారి, కృష్ణ

పెద్దత్తయ్య అయిపోయింది ఇప్పుడు అన్నయ్య మొదలుపెడతాడు ఏమోనని కృష్ణ అనుకుంటుంది. నా చెల్లి తన ప్రేమతో మిమ్మల్ని విసిగిస్తుంది క్షమించండి ఏసీపీ సర్. మా చెల్లి నాకు అంతా చెప్పింది. ఎన్ని అవాంతరాలు ఎదురైన కూడా తెగిపోలేదు అంటే ఏంటి అర్థం మీ బంధం దేవుడు వేసింది. నాకు ముకుంద ఎంతో కృష్ణ కూడా అంతేనని అంటాడు. తనని ఏసీపీ సర్ అని పిలవ్వద్దని తన భార్య ఒక్కతే అలా పిలవాలని మురారి అంటాడు. ఆ మాటకి ముకుంద రగిలిపోతుంది. చూశావా ఇంట అన్యోన్యంగా ఉన్న వాళ్ళని విడదీయాలని చూడటం కరెక్ట్ కాదని దేవ్ అంటాడు. ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారో తెలిస్తే అప్పుడు కూడా ఇదే మాట అనమని చెప్పి ముకుంద సీరియస్ గా వెళ్ళిపోతుంది.

మా చెల్లి కాస్త ఉన్మాదిగా ఉంటుంది పట్టించుకోవద్దని చెప్తాడు. ఇందాక మీరు రాగానే ముకుందని పెళ్లి చేసుకోమని అడుగుతారని అనుకున్నానని మురారి అంటే అలా అనుకోవడంలో తప్పు లేదు నేను ముకుంద అన్నయ్యని కదా అంటూ బాధపడుతునట్టుగా మాట్లాడతాడు. వచ్చే శుక్రవారం లోపు కేసు సాల్వ్ చేయకపోతే ముకుందతోనే పెళ్లి చేస్తానని అన్నారంట కదా మీకు నేను హెల్ప్ చేస్తాను బావ. నన్ను వాడుకో మీ ఇద్దరు కలిసి ఉండటానికి ఏమైనా చేస్తానని మాట ఇస్తాడు. నిజంగానే సపోర్ట్ చేస్తున్నాడని అనుకుని మురారి వాళ్ళు నమ్మేస్తారు.

మురారి తనకే కావాలన్న ముకుంద

నేను మీతో చేతులు కలిపినట్టు ముకుందకి తెలియనివ్వద్దని దేవ్ చెప్తాడు. కేవలం తనని ఎదిరిస్తానని మాత్రమే అనుకోవాలని అనేసరికి దేవ్ మాటలు నిజమని నమ్ముతారు. ఇంటి నుంచి బయటకి వచ్చిన దేవ్ పడిపోయారు వచ్చే శుక్రవారం కాదు కదా ఇంకో సంవత్సరం అయినా కూడా ఆ శేఖర్ ఈ దేవ్ అని కనిపెట్టలేరని నవ్వుకుంటాడు. రేవతి ముకుందని ఆపుతుంది. మా అక్క రాత్రింబవళ్ళు నీగురించే ఆలోచిస్తుంది. గతం గుర్తుకు రాదు, ఆదర్శ్ రాడని ఫిక్స్ అయి మీ పెళ్లి చేయడానికి సిద్ధపడింది. ఇప్పుడు అక్క చేతిలో ఏముందని రేవతి అడుగుతుంది. అత్తయ్య చేతిలో పవర్ ఉంది అది చాలని అంటుంది.

అనవసరంగా పంతానికి పోయి అక్కని ఇబ్బంది పెట్టొద్దని రేవతి చెప్తుంది. మురారి లేకుండా కృష్ణ బతకగలదు. క్యాంప్ అని చెప్పి కృష్ణ వెళ్లిపోతే మీరే తనని ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ నేను మురారిని వదిలి ఒక్క క్షణం కూడా బతకలేను. సిగ్గు విడిచి చెప్తున్నా మురారితో కృష్ణ ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. నాకు మాత్రం మురారి కావాల్సిందేనని తెగేసి చెప్తుంది.

మురారిని ఆట పట్టించిన కృష్ణ

కృష్ణ ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. మురారి రావడం చూసి కాసేపు తనని ఆట ఆడుకోవాలని కృష్ణ ప్లాన్ వేస్తుంది. మురారి వచ్చే సరికి కృష్ణ ఏడుస్తూ ఉండటం చూసి ఎందుకు ఏడుస్తున్నావ్ ఏమైందని అడుగుతాడు. మీరు గంట క్రితం ముకుందకి ఐలవ్యూ చెప్పారంట కదా అని కృష్ణ అంటుంది. ఎవరు చెప్పారు అయినా ఎవరో ఏదో చెప్తే నమ్మేయడమేనా అని అంటూ అక్కడ ఉన్న ఉల్లిపాయ తొక్కలు చూస్తాడు. దొరికిపోయానని కృష్ణ నవ్వుకుంటుంది. కావాలని ఆట పట్టిస్తున్నావ్ కదా కృష్ణ వెంట పడతాడు.

నాకు ఈ ప్రపంచంలో ఎవరూ అవసరం లేదు నువ్వు మాత్రమే కావాలి. గతం మర్చిపోయిన నిన్ను మర్చిపోకుండా నీవెంటే తిరిగాను. ఇక గతం గుర్తుకు వచ్చిన తర్వాత నిన్ను ఎలా వదులుకుంటానని చెప్తాడు.

IPL_Entry_Point