Kareena on Boycott Bollywood: బాయ్‌కాట్ బాలీవుడ్‌పై కరీనా షాకింగ్ కామెంట్స్.. సినిమాలు లేకపోతే ఎంటర్‌టైన్మెంట్ ఎలా?
Kareena on Boycott Bollywood: బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌పై కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు సినిమాలు లేకపోతే ప్రజలకు వినోదం ఎలా అందుతుంది అంటూ ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను అస్సలు ఏకీభవించలేనంటూ స్పష్టం చేశారు.
Kareena on Boycott Bollywood: బాలీవుడ్ నటులు ఇటీవల కాలంలో ఎలాంటి కామెంట్లు చేసినా బాయ్‌కాట్ ట్రెండ్ ఎదుర్కొంటున్నారు. వారి సినిమాలను నిషేదించాలంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో ఈ అంశంపై స్పందించే వారిపై కూడా ఆ ప్రభావం పడుతోంది. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ స్పందించారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఈ ముద్దుగుమ్మ బాయ్‌కాట్ బాలీవుడ్ అంశంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఈ విషయాన్ని అస్సలు అంగీకరించడం లేదని స్పష్టం చేసింది.
"నేను ఈ అంశాన్ని అస్సలు ఏకీభవించలేను. అదే జరిగితే మేము ఎలా వినోదాన్ని అందించగలం. మీరు మీ జీవితంలోకి ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఎలా పొందగలరు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా సినిమాలు ఆశాజనకంగా ఉంటాయి. మేము ఎల్లప్పుడూ ఇదే పని చేశాము. ఇకపైనా చేస్తాము. అసలు సినిమాలు లేకపోతే ప్రజలు ఎలా ఎంటర్టైన్ అవుతారు?" అంటూ కరీనా కపూర్ ప్రశ్నించారు.
గతేడాది పెద్ద ఎత్తున బాలావుడ్ చిత్రాలు సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్‌ను ఎదుర్కొన్నాయి. లాల్ సింగ్ చడ్డా, విజయ్ దేవరకొండ లైగర్, బ్రహ్మాస్త్ర, రక్షాబంధన్ లాంటి పలు చిత్రాలు ఈ నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. అయితే వీటిలో బ్రహ్మాస్త్రాకు మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ జరిగింది. 2022లో విడుదలై మెరుగైన కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. తాజాగా షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రం కూడా బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌ను ఎదుర్కొంటోంది. ఈ విషయంపైనే కరీనా కపూర్ స్పందించారు.
ప్రస్తుతం కరీనా కపూర్ బాలీవుడ్ దర్శకుడు సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ చిత్రంలో నటించనుంది. ఈ సినిమా ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ అనే పుస్తకం ఆధారంగా తీయనున్నారు. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లవాట్ నటించనున్నారు. ఇది కాకుండా హన్సల్ మెహతా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు. వీటితో పాటు రాజేశ్ కృష్ణన్ దర్శకత్వంలో టబు, కృతి సనన్‌తో పాటు ఓ కామెడీ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా విమానాయన రంగంలో ఇబ్బందులను గురించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది.
సంబంధిత కథనం
టాపిక్