Boycott Bollywood |బాయ్‌కాట్ బాలీవుడ్ అంటున్న నెటిజన్లు..ఎందుకో తెలుసా...
బాలీవుడ్ లో మరోసారి నెపోటిజం వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హఠాత్తుగా ఈ టాపిక్ ఎందుకు తెరపైకి వచ్చిందంటే....
శనివారం నుంచి ట్విట్టర్ లో బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోఉంది. బాలీవుడ్ సినిమాలు చూడటం మానేయడమే బెటర్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హిందీ సినీ పరిశ్రమ మొత్తం వారసులతో నిండిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. నెటిజన్లు అంతగా మండిపడటానికి కారణమేమిటో తెలుసా... ది ఆర్చీస్ సినిమా.
జోయా అక్తర్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, బోనీకపూర్-శ్రీదేవిల ముద్దుల తనయ ఖుషీకపూర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఒకే సినిమాతో బాలీవుడ్‌లోని మూడు అగ్ర కుటుంబాలకు చెందిన వారసులు ఇండస్ట్రీకి పరిచయం కావడం ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో నెపోటిజానికి ఇచ్చే ప్రాధాన్యత ఈ సినిమాతో మరోసారి నిరూపితమైందని అంటున్నారు. ఇక్కడ టాలెంట్ కంటే వారసత్వానికే విలువ ఎక్కువంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారసుల సినిమాలు చూడటం కంటే బాలీవుడ్‌ను బాయ్‌కట్ చేయడమే మంచిదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజం, వారసత్వంపై విమర్శలు పెరిగిపోయాయి. నెటిజన్లు మాత్రమే కాకుండా కంగనా రనౌత్ లాంటి తారలు సైతం బాలీవుడ్‌లోని బంధుప్రీతి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత కథనం
టాపిక్