Kareena kapoor: నా వల్ల భారత రైల్వే రెవిన్యూ పెరిగింది.. కరీనా సంచలన వ్యాఖ్యలు-kareena kapoora says she increased indian railways revenue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kareena Kapoor: నా వల్ల భారత రైల్వే రెవిన్యూ పెరిగింది.. కరీనా సంచలన వ్యాఖ్యలు

Kareena kapoor: నా వల్ల భారత రైల్వే రెవిన్యూ పెరిగింది.. కరీనా సంచలన వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Aug 20, 2022 07:53 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా.. తన వల్ల భారత రైల్వేస్ రెవిన్యూ పెరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తను నటించిన జబ్ వీ మెట్ సినిమాలోని తన పాత్ర గీత్ కారణంగా రైల్వే ఆదాయం పెరిగిందని తెలిపింది.

కరీనా కపూర్
కరీనా కపూర్ (ANI)

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవలే లాల్ సింగ్ చడ్ఢా సినిమాతో కాస్త్ గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించింది. పెళ్లి తర్వాత కాస్త స్లో అయిన ఈ అమ్మడు.. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఈమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ రైల్వేస్‌కు తన వల్లే ఆదాయం పెరిగిందని స్పష్టం చేసింది. తాను నటించిన జబ్ వీ మెట్ సినిమా కారణంగా రెవిన్యూ పెరిగిందని తెలిపింది.

ఇదంతా నిజంగా కాదులేండి.. ప్రముఖ హిందీ కోర్ట్ రూం కామెడీ షో కేస్ తో బన్తా హై అనే షోలో పాల్గొన్న కరీనా.. ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన జబ్ వీ మెట్ చిత్రంలో తన పాత్ర గీత్ వల్లే ఇండియన్ రైల్వేస్ ఆదాయంపెరిగిందని స్పష్టం చేసింది.

ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా గీత్‌గా నటించింది. నిరాశతో కుంగిపోయిన ఆదిత్య కశ్యప్(షాహిద్ కపూర్)ను ఓ రైలులో కలిసిన గీత్.. అతడితో ఉల్లాసంగా మాట్లాడి మార్పు తీసుకొస్తుంది. సినిమా మొదటి అర్ధభాగమంతా రైలులోనే నడుస్తుంది. గీత్ రెండు సార్లు రైలును మిస్సవడం, భారతీయ రైల్వే ఉద్యోగికి అనుచిత సలహాలు ఇవ్వడం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమా ఎక్కువ భాగం రైలులో నడవడం వల్ల కరీనా ఈ వ్యాఖ్యలు చేసింది.

అంతటితో ఆగకుండా ఈ సినిమాలో తాను ధరించిన దుస్తుల కారణంగా హరేమ్ ప్యాంట్ల సేల్‌ కూడా పెరిగిందని స్పష్టం చేసింది. తన ఒక్క సినిమా వల్ల ఇండియన్ రైల్వేస్ ఆదాయంతో పాటు హారెం ప్యాంట్ల విక్రయాలు పెరిగినట్లు ఈ కోర్టు రూం కామెడీ షోలో తన వాదనను వినిపించింది.

ఈ షోలో రితేశ్ దేశ్‌ముఖ్ పబ్లిక్ న్యాయవాదిగా నటించాడు. కుషా కపిలా జడ్జిగా అలిరించగా.. ముద్దాయిగా కరీనా కపూర్ తన వాదనను వినిపించింది. వరుణ్ శర్మ ముద్దాయి తరఫున డిఫెన్స్ లాయర్‌ పాత్రను పోషించారు. గోపాల్ దత్, పారితోష్ త్రిపాఠి, మోనికా మూర్తి, సంకేత్ భోంస్లే, సుగంధ మిశ్రా, సిద్ధార్థ్ సాగర్ తదిరులు సాక్షులుగా వ్యవహరించారు. ఈ అమెజాన్ మినీ టీవీ షోలో ఇంతకుముందు అనిల్ కపూర్, వరుణ్ ధావన్, కరణ్ జోహార్ తదితరులు పాల్గొన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్