Darshan Arrested: మర్డర్ కేసులో కాటేరా మూవీ హీరో అరెస్ట్.. కన్నడ నాట సంచలనం రేపుతున్న కేసు-kannada actor challenging star darshan arrested in murder case darshan pavithra gowda relationship ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Darshan Arrested: మర్డర్ కేసులో కాటేరా మూవీ హీరో అరెస్ట్.. కన్నడ నాట సంచలనం రేపుతున్న కేసు

Darshan Arrested: మర్డర్ కేసులో కాటేరా మూవీ హీరో అరెస్ట్.. కన్నడ నాట సంచలనం రేపుతున్న కేసు

Hari Prasad S HT Telugu
Jun 11, 2024 11:17 AM IST

Darshan Arrested: మర్డర్ కేసులో స్టార్ హీరో దర్శన్ అరెస్టవడం సంచలనం రేపుతోంది. కన్నడనాట పెద్ద హీరో అయిన దర్శన్ సహా మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మర్డర్ కేసులో కాటేరా మూవీ హీరో అరెస్ట్.. కన్నడ నాట సంచలనం రేపుతున్న కేసు
మర్డర్ కేసులో కాటేరా మూవీ హీరో అరెస్ట్.. కన్నడ నాట సంచలనం రేపుతున్న కేసు

Darshan Arrested: కన్నడ నాట ఛాలెంజింగ్ స్టార్ గా పేరుగాంచిన నటుడు దర్శన్ ను ఓ మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. మంగళవారం (జూన్ 11) ఉదయం అతన్ని మైసూరులోని ఓ ఫామ్ హౌజ్ లో అదుపులోకి తీసుకున్నారు. దర్శన్ సహా మరో పది మందిని రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

దర్శన్ అరెస్ట్

కర్ణాటకలోని మైసూరు కామాక్షి పాల్యా పోలీసులు నటుడు దర్శన్ ను అరెస్ట్ చేశారు. నటి పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపారంటూ ఆ వ్యక్తిని శనివారం రాత్రి హత్య చేసినట్లు దర్శన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గత పదేళ్లుగా నటి పవిత్రా గౌడతో దర్శన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొదట రేణుకా స్వామిది ఆత్మహత్య అని భావించినా.. తర్వాత హత్య అని పోలీసులు నిర్ధారించుకున్నారు.

దర్శన్ తోపాటు మరో పది మందిని అరెస్ట్ చేశారు. ఛాలెంజింగ్ స్టార్ గా పేరుగాంచిన దర్శన్ లాంటి హీరో మర్డర్ కేసులో అరెస్టయ్యాడన్న వార్త కన్నడ నాట సంచలనం రేపుతోంది. రేణుకా స్వామి మైసూరులోని కామాక్షి పాల్యాలోని ఓ షెడ్ లో విగతజీవిగా కనిపించారు. ఆత్మహత్య చేసుకున్నారేమో అని మొదట భావించినా.. తర్వాత హత్య అని తేలింది.

దర్శన్, పవిత్ర రిలేషన్షిప్

నటి పవిత్రా గౌడతో దర్శన్ కు ఎఫైర్ నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే విషయమై దర్శన్ భార్య విజయ లక్ష్మి.. పవిత్రపై తీవ్రంగా విరుచుకుపడింది. ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయింది. సంజయ్ సింగ్ అనే మరో వ్యక్తితో పవిత్ర కలిసి ఉన్న ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. మరొకరి భర్త ఫొటోలు పోస్ట్ చేసే ముందు ఈ మహిళ తన గురించి తెలుసుకోవాలంటూ విజయలక్ష్మి ఆ పోస్టులో రాసుకొచ్చింది.

గత పదేళ్లుగా దర్శన్, పవిత్ర రిలేషన్షిప్ లో ఉన్నట్లు సమాచారం. గతేడాది నవంబర్ లో పవిత్ర తన కూతురు ఖుషీ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో తన కూతురితో కలిసి దర్శన్ కేక్ కట్ చేస్తున్నట్లుగా ఉంది. ఈ ఫొటోలపైనే విజయ లక్ష్మి తీవ్రంగా మండిపడింది. సంజయ్ సింగ్, పవిత్రల కూతురే ఈ ఖుషీ అని కూడా విజయ్ లక్ష్మి చెప్పింది.

ఇప్పుడదే పవిత్ర కోసం దర్శన్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడం గమనార్హం. హత్యకు గురైన వ్యక్తి పవిత్రకు తరచూ అశ్లీల సందేశాలు పంపించడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దర్శన్ ఈ మధ్యే కాటేరా మూవీతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో సలార్ కు పోటీగా రిలీజై ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది.