JioCinema OTT: కొత్తగా సబ్‍స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొస్తున్న జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్: వివరాలివే
JioCinema OTT: జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ కొత్త ప్లాన్‍ను తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ప్లాన్ లాంచ్ డేట్‍ను ఫిక్స్ చేసింది. ఆ వివరాలివే..
JioCinema OTT: జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అధిక శాతం కంటెంట్ ఉచితంగానే అందుబాటులో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‍లను కూడా ఉచితంగా స్ట్రీమింగ్‍కు ఉంచింది ఆ ప్లాట్‍ఫామ్. కొన్ని హాలీవుడ్ సినిమాలు తప్ప దాదాపు జియోసినిమాలో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్‍లు, టీవీ కంటెంట్ ఉచితంగానే చూడొచ్చు. అయితే, ఈ క్రమంలో ఓ కొత్త సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍ను ప్రవేశపెట్టేందుకు జియో సినిమా సిద్ధమైంది. ఇది యాడ్ ఫ్రీ ప్లాన్‍గా ఉండనుంది. ఆ వివరాలివే..
లాంచ్ ఎప్పుడంటే..
ఏప్రిల్ 25వ తేదీన కొత్త ప్లాన్‍ను తీసుకురానున్నట్టు జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. ఈ విషయంపై అధికారికంగా ప్రోమో తీసుకొచ్చింది. యాడ్లు లేకుండా కంటెంట్ చూసేలా ఈ ప్లాన్ ఉండనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సాగుతున్న తరుణంలో ఈ ప్లాన్‍ను ప్రవేశపెడుతోంది.
యాడ్ ఫ్రీగా..
జియోసినిమాలో ప్రస్తుతం ఏదైనా కంటెంట్ చూస్తున్నా.. స్పోర్ట్స్ మ్యాచ్‍లు చూస్తున్నా యాడ్స్ వస్తున్నాయి. కాస్త ఎక్కువగానే యాడ్స్ ప్లే అవుతున్నాయి. అయితే, యాడ్స్ లేకుండా చూడాలనుకునే వారి కోసమే కొత్తగా ఈ యాడ్ ఫ్రీ ప్లాన్‍ను ఏప్రిల్ 25వ తేదీన జియో సినిమా ప్రవేశపెడుతోంది.
అలాగే, ఉచితంగా చూడాలనుకునే వారికి సదుపాయం అలాగే ఉండనుంది. అయితే ఎప్పటిలాగే యాడ్స్ రానున్నాయి. ఒకవేళ యాడ్ ఫ్రీ ప్లాన్ తీసుకుంటే యాడ్స్ నుంచి ఉపశమనం పొందొచ్చు. జియోసావన్ మ్యూజిక్ ప్లాట్‍ఫామ్ విషయంలో ఇదే స్ట్రాటజీని అప్పట్లో రిలయన్స్ ఫాలో అయింది. ఆరంభంలో అంతా ఉచితంగా ఇవ్వగా.. ఆ తర్వాత యాడ్స్ లేకుండా వాడేందుకు జియో సావన్ ప్లాన్‍ను తీసుకొచ్చింది.
అయితే, ఈ యాడ్ ఫ్రీ సబ్‍స్క్రిప్షన్ ప్లాన్ ధరను ఏప్రిల్ 25వ తేదీన జియో సినిమా వెల్లడించనుంది. మరి, ధర ఎంత ఉండనుందో చూడాలి.
జియో సినిమాలో ఐపీఎల్ 2024 మ్యాచ్‍లు ఉచితంగా లైవ్ స్ట్రీమ్ అవుతున్నాయి. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హర్యాణ్వీ, మరాఠి, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, భోజ్‍పురి భాషల్లో మ్యాచ్‍లు లైవ్ వస్తున్నాయి. చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు, టీవీ కంటెంట్ కూడా జియోసిమాలో అందుబాటులో ఉంది.
జియోసినిమాలో ప్రస్తుత ప్లాన్ ఇలా..
జియోసినిమా ఓటీటీలో గతంలోనే ఓ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. జియోసినిమా ప్రీమియర్ పేరుతో ఈ ప్లాన్ ఉంది. హెచ్‍బీవో ప్రీమియమ్ కంటెంట్‍తో పాటు కొన్ని హాలీవుడ్ చిత్రాలను ఈ ప్రీమియమ్ ప్లాన్ ఉంటేనే ఆ ప్లాట్‍ఫామ్‍లో చూడగలం. ప్రస్తుతం జియో ప్రీమియమ్ ప్లాన్ ధర నెలకు రూ.99గా ఉండగా.. సంవత్సరానికి రూ.999గా ఉంది. మరి.. కొత్తగా తీసుకొచ్చే ప్లాన్ ధరను జియో సినిమా ఎంతకు తీసుకొస్తుందో.. యాడ్ ఫ్రీ కాకుండా మరేమైన బెనిఫిట్లను ఇస్తుందా అనేది ఆసక్తికరంగా ఉంది.
కాగా, రిలయన్స్, డిస్నీ త్వరలోనే విలీనం కానున్నాయి. ఈ విలీనానికి ఇప్పటికే రెండు సంస్థలు ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. ఈ ఒప్పందం తర్వాత రియలన్స్ వియాకామ్ 18కు చెందిన టీవీ ఛానెళ్లు, స్టార్ ఇండియా ఛానెళ్లు ఒకటి కానున్నాయి. అలాగే, జియోసినిమా, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు కూడా జాయింట్ వెంచర్ కిందే ఉంటాయి. ప్రక్రియ పూర్తయ్యాక దేశ మీడియారంగంలో ఇదే అతిపెద్ద విలీనంగా నిలిచిపోనుంది.