Bigg Boss 8 Telugu: అలా చేయకుంటే ఏం అడిగినా ఇస్తా: సోనియా మాటకు అవాక్కయిన నిఖిల్: వీడియో
Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ 8లో నిఖిల్, సోనియా మధ్య ఇంట్రెంస్టింగ్ ట్రాక్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. దీంట్లో సోనియా చెప్పిన మాటలతో నిఖిల్ అవాక్కయ్యారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయారు. ఈ సీజన్‍లో హౌస్ నుంచి ఫస్ట్ బయటికి వెళ్లిన కంటెస్టెంట్‍గా నిలిచారు. ఆదివారం ఈ ఎలిమినేషన్ జరిగింది. సోమవారమైన నేటి (సెప్టెంబర్ 9) ఎపిసోడ్‍లో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ఉండనుంది. అయితే, ఈ ఎపిసోడ్‍లో సోనియా, నిఖిల్, పృథ్విరాజ్ మధ్య ఇంట్రెస్టింగ్ ట్రాక్ ఉంటుందనేలా ప్రోమోను వదిలింది స్టార్ మా. ఈ ప్రోమోలో ఏముందంటే..
సోనియాపై విష్ణు పంచ్
బేబక్క ఎలిమినేట్ అవుతారని తాను అసలు అనుకోలేదని విష్ణుప్రియ అనటంతో ఈ ప్రోమో మొదలైంది. తాను ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నానో.. వాళ్లు ముందు సేవ్ అయ్యారని విష్ణు చెప్పారు. అంటే సోనియా వెళుతుందని తాను అనుకున్నానని పరోక్షంగా అన్నారు. ఇప్పుడు సోనియాకు సొంతంగా క్లాన్ కూడా తయారైందని నిట్టూర్పుగా చెప్పారు.
సోనియా చీఫ్ అవుతారని, బిగ్గెస్ట్ క్లాన్, లగ్జరీకి కూడా సోనియా వస్తుందని విష్ణుతో నైనిక అన్నారు. తమ చీఫ్ వేరే గ్రేట్ చీఫ్‍ను అనడంపై ఆదిత్య ఓం అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను భజన మండలిలో ఉండడానికి తాను రాలేదని సీతతో అన్నారు.
హౌస్‍లో తెలిసీ తెలియక టీమ్‍లు ఏర్పడ్డాయని నాగ మణికంఠ, నబీల్ ఆఫ్రిది మాట్లాడుకున్నారు. హౌస్‍మేట్స్ ఎవరూ ఏం కారని మణికంఠతో యష్మి చెప్పారు. అందరూ కంటెస్టెంట్లే అని, ఒకరి మాటే వినాలంటే అది బిగ్‍బాస్ అంటూ అతడికి సలహాలు ఇచ్చారు.
పృథ్వితో సోనియా.. మధ్యలో వచ్చిన విష్ణు
పృథ్విరాజ్‍తో సోనియా సరదాగా మాట్లాడుతుండగా విష్ణుప్రియ మధ్యలో వచ్చారు. “నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి. పృథ్వి ఎంత మందికైనా ప్రేమను పంచొచ్చు” అంటూ గట్టిగా నవ్వారు విష్ణుప్రియ. పృథ్వి, సోనియా క్లోజ్‍గా ఉండడంపై కామెంట్ చేశారు. మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒకరికి ప్రాబ్లం.. ఎలా ఉన్నా సమస్యే అని నిఖిల్ అంటుంటూ ఊ కొట్టారు మణికంఠ.
ఏది అడిగినా ఇస్తా
సిగరెట్ తాగకుండా ఉంటే ఏది అడిగినా ఇస్తానని నిఖిల్‍తో సోనియా అన్నారు. ఒక్కసారిగా ఇలా అనటంతో నిఖిల్ అవాక్కయ్యారు. “నువ్వు సిగరెట్ తాగకుండా ఉండరా.. నువ్వు ఏమడిగినా ఇస్తా” అని సోనియా అన్నారు. దీంతో బాటిల్‍తో నీళ్లు తాగుతున్న నిఖిల్ ఒక్కసారిగా ఆ అంటూ ఆశ్చర్యపోయారు. వీరిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందనేలా ప్రోమోలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ వేసింది స్టార్ మా ఛానెల్. సోనియా సిగ్గుపడిపోగా.. మీసాలు మెలేశారు నిఖిల్.
అందుకే ‘గాడ్ మస్ట్ బీ క్రేజీ’ అంటారని అభయ్ నవీన్ డైలాగ్ వదిలారు. తనకు సంతోషంగా ఉందని, ఎవరో ఒకరికి తోడు దొరికిందనేలా కిర్రాక్ సీత అన్నారు. కళ్ల ముందు చూసేదంతా నిజం కాదంటూ అభయ్ మరో కామెంట్ చేశారు. దీంతో ప్రోమో ముగిసింది. ఏం జరిగిందో నేటి ఎపిసోడ్‍లో తేలనుంది.
అలాగే, నామినేషన్ల రచ్చ కూడా ఉండనుంది. కిర్రాక్ సీత, ప్రేరణ మధ్య గొడవ పెద్దగానే జరగనుంది. బయటే మాట్లాడుకొని వచ్చారని సీత అనడంపై సీరియస్ అయ్యారు ప్రేరణ. సోనియా, సీత మధ్య కూడా వాగ్వాదం జరిగింది.