Bigg Boss Buzz Soniya: "నిఖిల్‍కు గైడెన్స్ ఇచ్చా.. అందుకే ఆ మాత్రమైనా”: సోనియా: ఆ ఇద్దరితో బంధం గురించి ఏం చెప్పారంటే..
Bigg Boss Buzz Sonia Akula: బిగ్‍బాస్ నుంచి బయటికి వచ్చేసిన సోనియా.. బజ్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. నిఖిల్, పృథ్వితో తన రిలేషన్ ఎలాంటిదో వివరించారు. నిఖిల్‍ను గైడ్ చేశానని అంగీకరించారు. మరిన్ని విషయాలు చెప్పారు.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నుంచి నటి సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారంలోనే బయటికి వచ్చేశారు. హౌస్‍లో నిఖిల్, పృథ్విరాజ్‍తో సోనియా క్లోజ్‍గా ఉన్నారు. పెద్దోడు, చిన్నోడు.. ఒకే ఫ్యామిలీ అంటూ ఆ ఇద్దరితో రిలేషన్ కలిపారు. నిఖిల్, పృథ్విని ఆయుధాల్లా సోనియా వాడుకుంటోందని యష్మి కూడా ఆరోపించారు. ఈ ముగ్గురు ఒకే టీమ్ అనేలా ఇతర హౌస్‍మేట్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ అభిప్రాయం బలపడింది. సోనియా ఎలిమినేట్ అయ్యేందుకు ఈ నెగెటివిటీ కూడా ఓ కారణమైంది. హౌస్ నుంచి బయటికి వచ్చాక బిగ్‍బాస్ బజ్ ఇంటర్వ్యూలో సోనియా చాలా విషయాలు వెల్లడించారు. నిఖిల్, పృథ్వితో రిలేషన్ గురించి కూడా మాట్లాడారు.
నిఖిల్, పృథ్వితో ఇలా..
"నిఖిల్‍కు మీపై ఎలాంటి ఫీలింగ్ ఉంది" అని బజ్ ఇంటర్వ్యూలో సోనియాను అడిగారు అంబటి అర్జున్. దీనికి సోనియా స్పందిస్తూ పృథ్విని కూడా కలిపేశారు. నిఖిల్, పృథ్వికి తనపై బెస్ట్ ఫ్రెండ్‍లా, తల్లిలా (మదర్లీ) ఫీలింగ్ ఉంటుందని సోనియా చెప్పారు. తాను ఆ బంధానికి ఎలాంటి పేరు పెట్టలేదని చెప్పారు. అదే ప్రేక్షకులను కన్‍ఫ్యూజన్‍లో పెట్టిందని అర్జున్ అన్నారు. తనకు హౌస్‍లో అభయ్, నిఖిల్, పృథ్వి, నైనికతో మంచి బాండింగ్ ఉందని సోనియా చెప్పారు.
నిఖిల్ కొన్నిసార్లు తనవైపు నిలువలేదని సోనియా అన్నారు. అందుకే కొన్నిసార్లు అతడిపై కోపం వచ్చిందని వివరించారు. సరైన పాయింట్లను చెప్పడం తన నుంచే నిఖిల్ నేర్చుకున్నాడని అనిపిస్తుందని సోనియా చెప్పారు. నిఖిల్ తనకు ఫ్రెండ్, బ్రదర్‌లా అని అన్నారు.
గైడెన్స్ ఇచ్చా
హౌస్‍లో నిఖిల్‍కు తాను గైడెన్స్ ఇచ్చానని, అందుకే అతడు ఆ మాత్రం మేనేజ్ చేశాడని సోనియా అన్నారు. రెడ్ ఎగ్ విషయంలో నిఖిల్ తన మాట విన్నారని అంగీకరించారు. నిఖిల్ టాప్-3లో ఉంటారని తాను అనుకుంటున్నానని సోనియా అన్నారు.
తనకు నిఖిల్, పృథ్వితో ఫ్రెండ్‍షిప్ సింక్ అయిందని, కంఫర్ట్‌గా అనిపించిందని సోనియా చెప్పారు. అందుకే వారితో క్లోజ్‍గా ఉన్నానని తెలిపారు. నిఖిల్ వీకెస్ట్ కంటెస్టెంట్ అని అర్జున్ అంటే.. సోనియా అంగీకరించలేదు. నిఖిల్‍కు సూచనలు ఇస్తానని నాగార్జునతో చెప్పావు కదా అని అర్జున్ ప్రశ్నించారు. “మీరు లోపల ఉండుంటే నిఖిల్ టాప్-3లోకి వెళ్లేవాడా” అని క్వశ్చన్ చేశారు.
నిఖిల్ హౌస్‍లో కొన్ని పొరపాట్లు చేశారని, తాను గైడెన్స్ ఇచ్చానని సోనియా అన్నారు. “నిఖిల్ కొన్ని పొరపాట్లు చేశారు. కానీ అతడు చాలా మెచ్యూర్. నేను గైడెన్స్ ఇచ్చా. అందుకే ఆ మాత్రమైనా అతడు మేనేజ్ చేశారు” అని సోనియా అన్నారు.
నేను ఎప్పుడూ వెనుక ఉండలేదు
ఆడపులి అని చెప్పుకున్నప్పుడు ముందుకు వచ్చి ఆట ఆడాలి కదా అని సోనియాను అర్జున్ నిలదీశారు. ఆట ఆడినట్టు కనిపించలేదని అడిగారు. నిఖిల్, పృథ్విని బాధితులను చేసి వారితో ఆడుకున్నట్టు అనిపించిందని చెప్పారు. దీనికి సోనియా రియాక్ట్ అయ్యారు. తాను ఆడానని చెప్పారు. తాను ఎప్పుడు వెనుక ఉండి ఆడలేదని అన్నారు. తాను హౌస్‍లో లేకుండా నిఖిల్, పృథ్వి ఎలా ఆడతారో తెలుస్తుంది కదా అని చెప్పారు. విష్ణుప్రియతో గొడవ గురించి కూడా సోనియా మాట్లాడారు. విష్ణు ఎక్కువ చేయటంతోనే తాను అడల్ట్ రేటెడ్ కామెడీ అన్నానని సమర్థించుకున్నారు.