Nani: నేను ఎప్పడూ ఏ దర్శకుడిని అలా అడగను: నాని-i do not ask any director for to do movies with me says nani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani: నేను ఎప్పడూ ఏ దర్శకుడిని అలా అడగను: నాని

Nani: నేను ఎప్పడూ ఏ దర్శకుడిని అలా అడగను: నాని

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 03, 2023 03:56 PM IST

Nani: హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లలో హీరో నాని ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంట్లో కొన్ని విషయాలను వెల్లడించారు.

నాని
నాని

Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా రిలీజ్‍కు సమీపిస్తోంది. డిసెంబర్ 7వ తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రానుంది. హాయ్ నాన్న సినిమా కోసం నాని జోరుగా ప్రమోషన్లను చేస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. డిఫరెంట్‌గానూ కొన్ని వీడియోస్ చేస్తున్నారు. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తనతో సినిమా చేయాలని ఏ దర్శకుడిని తాను అడగనని నాని చెప్పారు. ఎందుకో కూడా వివరించారు.

తనతో మూవీ చేయాలని ఏ డైరెక్టర్‌ను ఇంత వరకు అడగలేదని, అలా ఎప్పటికీ అడగను కూడా.. అని నాని స్పష్టం చేశారు. ఫలానా డైరెక్టర్‌తోనే మూవీ చేయాలని కూర్చుంటే.. కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని, అది తనకు నచ్చదని నాని చెప్పారు.

“నాతో సినిమా చేయాలని ఇప్పటి వరకు నేను స్వయంగా ఏ దర్శకుడిని అడగలేదు. ఇకపై అడగను కూడా. నాకు ఎంతో ఇష్టమైన మణిరత్నంను అయినా అలా అడగను. ఫలానా దర్శకుడితోనే చిత్రం చేయాలనుకుంటే కొన్నాళ్లు వేచిచూడాల్సి వస్తుంది. నాకు ఇది నచ్చదు. నేను వరుసగా మూవీస్ చేస్తూనే ఉంటా” అని నాని చెప్పారు.

మరోవైపు, బేబి, యానిమల్ లాంటి మూవీస్ వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు కూడా నాని స్పందించారు. తప్పకుండా చేస్తానని అన్నారు. బేబి మూవీ తాను చూడలేదని, యానిమల్ చూశానని అన్నారు. యానిమల్ లాంటి చిత్రాలు వస్తే 100శాతం తప్పకుండా చేస్తానని నాని స్పష్టం చేశారు. అలాంటి చిత్రం చేస్తే.. ఇప్పటి వరకు చూడనని నాని చూసి ఉండేవారని అన్నారు. తనతో దసరా సినిమా చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయనున్నట్టు నాని వెల్లడించారు.

నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. నాని కూతురిగా ఈ చిత్రంలో బేబి కియారా ఖన్నా నటించారు. ఈ మూవీ.. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, లవ్ స్టోరీ చుట్టూ ఉంటుంది. ఇటీవలే వచ్చిన హాయ్ నాన్న ట్రైలర్ ఎమోషనల్‍గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే హాయ్ నాన్న పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

హాయ్ నాన్న తర్వాత వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ మూవీ చేయనున్నారు నాని. టైటిల్‍తో పాటు గ్లింప్స్ కూడా విభిన్నంగా ఉండటంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అంటే సుందరానికి మూవీ తర్వాత నాని - వివేక్ కాంబో మరోసారి రిపీట్ కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం