Hrithik Roshan Dating App: ఆ ఇద్దరు స్టార్ హీరోలూ డేటింగ్ యాప్‌లో ఉన్నారు: బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్-hrithik roshan aditya roy kapoor on dating app raya says bollywood actress urvashi rautela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hrithik Roshan Dating App: ఆ ఇద్దరు స్టార్ హీరోలూ డేటింగ్ యాప్‌లో ఉన్నారు: బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్

Hrithik Roshan Dating App: ఆ ఇద్దరు స్టార్ హీరోలూ డేటింగ్ యాప్‌లో ఉన్నారు: బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

Hrithik Roshan Dating App: ఇద్దరు స్టార్ హీరోలు డేటింగ్ యాప్ లో ఉన్నట్లు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిజానికి వీళ్ల డేటింగ్ లైఫ్ పై చాలా రోజులుగా ఏదో ఒక పుకారు వస్తున్న వేళ ఆమె కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆ ఇద్దరు స్టార్ హీరోలూ డేటింగ్ యాప్‌లో ఉన్నారు: బాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్

Hrithik Roshan Dating App: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తోపాటు మరో నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ఓ డేటింగ్ యాప్ లో ఉన్నట్లు ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా తెలిపింది. వాళ్లు Raya అనే డేటింగ్ యాప్ లో ఉండటం తాను చూశానని ఆమె చెప్పడం విశేషం. ఈ మధ్యే ఊర్వశి.. హాటర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

డేటింగ్ యాప్‌లో ఆ ముగ్గురూ..

బాలీవుడ్ లో సీనియర్ నటుడు హృతిక్ రోషన్ తోపాటు కుర్ర నటులు ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్ కొన్నాళ్లుగా పార్ట్‌నర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీళ్లు పెళ్లి లేదంటే మరొకరితో సహజీవనం చేసి విడిపోయారు. ఇప్పుడు మరొకరి కోసం ఏకంగా ఓ డేటింగ్ యాప్ లోనే ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం విశేషం.

బాలీవుడ్ లో ఆ స్థాయి ఉన్న హీరోలు Raya అనే డేటింగ్ యాప్ లో ఉన్నారంటే నమ్మశక్యం కాదు. అయితే ఈ విషయాన్ని నటి ఊర్వశి రౌతేలానే కన్ఫమ్ చేసింది. తాను కూడా ఆ యాప్ లో ఉన్నానని, అయితే తాను కేవలం తన ఫ్రెండ్స్ కోసం తప్ప మరో ఉద్దేశం లేదని ఆమె అనడం విశేషం.

"నేను Raya యాప్ లో ఉన్నాను. అయితే అది కేవలం ఫ్రెండ్స్ కోసమే తప్ప మరో ఉద్దేశం లేదు. హృతిక్ కూడా రాయాలో ఉన్నాడు. ఆదిత్య రాయ్ కపూర్ ని కూడా నేను చూశాను. ఇంకా చాలామంది సెలబ్రిటీలే అందులో ఉన్నారు" అని ఊర్వశి తెలిపింది.

వాళ్ల నంబర్లే నా దగ్గర ఉన్నాయి

మరి సదరు యాప్ లో సెలబ్రిటీల ఫ్రొఫైల్స్ కి రైట్ స్వైప్ చేశావా అని అడిగితే.. ఆ అవసరం తనకు రాలేదని, అయినా తన దగ్గర వాళ్ల నంబర్లు కూడా ఉన్నాయని తెలిపింది. "నా దగ్గర వాళ్ల నంబర్లు ఇప్పటికే ఉన్నాయి. నేనెందుకు రైట్ స్వైప్ చేస్తాను? అయినా ఈ బిజీ షెడ్యూల్లో నేను ఖాళీగా ఉండి, వాళ్లు ఖాళీగా ఉంటే మాట్లాడుకుంటాం. ఇంకా ఈ యాప్ లో డైరెక్ట్ మెసేజెస్ పంపాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది" అని ఊర్వశి చెప్పింది.

నిజానికి హృతిక్ రోషన్ తన భార్య సుసానేతో విడిపోయిన తర్వాత సబా ఆజాద్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడు. అటు ఆదిత్య రాయ్ కపూర్ మరో నటి అనన్య పాండేకు ఈ మధ్యే బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అటు అర్జున్ కపూర్ కూడా ఇప్పటికే మలైకా అరోరాతో విడిపోయాడు. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు డేటింగ్ యాప్స్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఊర్వశి వాటిని కన్ఫమ్ చేసింది.