RRR - Hca Awards: ఆర్ఆర్ఆర్ కు హెచ్‌సీఏ అవార్డుల పంట - బ్యాట్‌మాన్, టాప్‌గన్‌లను దాటేసిన రాజమౌళి మూవీ
RRR - Hca Awards: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది. నాలుగు విభాగాల్లో రాజమౌళి మూవీ అవార్డులను గెలుచుకున్నది.
RRR - Hca Awards: అంతర్జాతీయ వేదికపై ఆర్ఆర్ఆర్ పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకొని చరిత్రను తిరగరాస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్‌తో పాటు పలు హాలీవుడ్ అవార్డులను కైవసం చేసుకున్నది.
తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ తో పాటు స్టంట్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్అ వార్డులను కైవసం చేసుకున్నది.
బ్యాట్‌మాన్, వకాండా ఫరెవర్ సినిమాల్ని దాటేసి...
బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీలో టాప్ గన్, బ్యాట్‌మాన్ వకాండా ఫరెవర్ లాంటి హాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్‌ను దాటేసి ఆర్ఆర్ఆర్ అవార్డును దక్కించుకోవడం గమనార్హం. ఈ కేటగిరీలో జ్యూరీ మెంబర్స్ ఆర్ఆర్ఆర్ కే ఓటు వేశారు. బెస్ట్ స్టంట్స్ కేటగిరీలో ఈ సినిమాకే అవార్డ్ వచ్చింది.
అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట అవార్డును గెలుచుకున్నది. బెస్ట్ ఇంటర్‌నేషన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పలు దేశాల సినిమాలతో పోటీపడి ఆర్ఆర్ఆర్ అవార్డు అందుకున్నది.ఈ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణితో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం పాల్గొన్నారు.