RRR Re Release In America: ఆస్కార్‌కు ప‌ది రోజుల ముందు అమెరికాలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ - డేట్ ఫిక్స్‌-ram charan ntr rrr movie re release in america on march 3 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Re Release In America: ఆస్కార్‌కు ప‌ది రోజుల ముందు అమెరికాలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ - డేట్ ఫిక్స్‌

RRR Re Release In America: ఆస్కార్‌కు ప‌ది రోజుల ముందు అమెరికాలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ - డేట్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 23, 2023 10:27 AM IST

RRR Re Release In America: ఆస్కార్ అవార్డ్స్ వేడుక‌కు ప‌ది రోజుల ముందు ఆమెరికాలో ఆర్ఆర్ఆర్ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతున్న‌ది. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ఏదంటే...

రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌
రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌

RRR Re Release In America: ఆస్కార్ బ‌రిలో నిలిచిన తొలి తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్ చ‌రిత్ర‌ను సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ వేడుక‌కు ముందు అమెరికా ప్రేక్ష‌కుల‌ ముందుకు ఆర్ఆర్ఆర్ మ‌రోసారి రాబోతున్న‌ది. యూఎస్ఏలో మార్చి 3న ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వేరియ‌న్స్ ఫిల్మ్స్ ప్ర‌క‌టించింది.

200 థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానున్న‌ట్లు వెల్ల‌డించ‌డ‌మే కాకుండా థియేట‌ర్ల వివ‌రాల్ని అనౌన్స్‌చేసింది. ఆస్కార్ అవార్డ్స్‌కు ప‌ది రోజుల ముందు ఈ సినిమా థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. నాటు నాటు పాట‌కుగాను బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యింది.

అమెరికాలో ఆర్ఆర్ఆర్ టీమ్‌

మార్చి 13న ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ జ‌రుగ‌నుంది. ఈ ఆస్కార్ అవార్డ్ వేడుక‌ల కోసం ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, రాజ‌మౌళితో పాటు ఆర్ఆర్ఆర్‌ టీమ్ మెంబ‌ర్స్ అమెరికాకు వెళ్లారు. . నాటు నాటుకు పాట‌కు ఆస్కార్ వ‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

బ్రిటీష‌ర్ల‌పై తిరుగుబాటు చేసిన అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ అనే యువ‌కుల జీవితాల‌తో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌ సినిమాను తెర‌కెక్కించారు.

అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ న‌ట‌న‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినీ దిగ్గ‌జాల‌తో పాటు అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇండియాలో గ‌త ఏడాది మార్చి 25న రిలీజైన ఈ సినిమా 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

IPL_Entry_Point