Sharwanand Engagement: వైరల్ అవుతోన్న శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు - వేడుకకు హాజరైన రామ్‌చరణ్
Sharwanand Engagement: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థం రక్షితా రెడ్డితో గురువారం జరిగింది. శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు టాలీవుడ్ అగ్ర హీరో రామ్‌చరణ్ హాజరయ్యాడు.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గురువారం రక్షితారెడ్డితో అతడి నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు రామ్‌చరణ్ హాజరయ్యాడు. భార్య ఉపాసనతో పాటు నిశ్చితార్థ వేడుకలో రామ్‌చరణ్ పాల్గొన్నాడు. కాబోయే నూతన దంపతులు శర్వానంద్, రక్షితారెడ్డిలతో రామ్‌చరణ్, ఉపాసన దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రెండింగ్ వార్తలు
సినిమాల్లోకి రాకముందు నుంచి రామ్‌చరణ్, శర్వానంద్ మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహ బంధాన్ని దృష్టిలో పెట్టుకొని శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు రామ్‌చరణ్ హాజరయ్యాడు.
కాగా శర్వానంద్‌కు కాబోయే భార్య రక్షితారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. హైకోర్ట్ లాయర్ మధుసూదన్ రెడ్డి కూతురని సమాచారం. ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డికి రక్షితారెడ్డి మనవరాలు అవుతుందని చెబుతున్నారు.
చాలా రోజులుగా రక్షితా రెడ్డితో శర్వానంద్‌కు పరిచయం ఉన్నట్లు చెబుతున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని చెబుతున్నారు. త్వరలోనే శర్వానంద్, రక్షితారెడ్డి పెళ్లి జరుగనున్నట్లు తెలిసింది. ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమా కమర్షియల్ హిట్‌ను అందుకున్నాడు శర్వానంద్.
ప్రస్తుతం దర్శకుడు కృష్ణ చైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రీరామ్ ఆదిత్య శర్వానంద్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.