Hi Nanna OTT Release Date: హాయ్ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..-hi nanna ott release date announced officially by netflix check streaming details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hi Nanna Ott Release Date: హాయ్ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Hi Nanna OTT Release Date: హాయ్ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 30, 2023 02:23 PM IST

Hi Nanna OTT Release Date: హాయ్ నాన్న సినిమా ఓటీటీ స్ట్రీమిండ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఈ చిత్రంలో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వివరాలివే..

Hi Nanna OTT Release Date: అఫీషియల్: హాయ్ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు
Hi Nanna OTT Release Date: అఫీషియల్: హాయ్ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Hi Nanna OTT Release Date: నేచులర్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా థియేటర్లలో విజయం సాధించింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీగా డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే మంచి కలెక్షన్లను దక్కించుకుంది. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్, లవ్ స్టోరీతో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

హాయ్ నాన్న సినిమా జనవరి 4వ తేదీన (2024) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. “మీతో ఎప్పుడూ ఉండిపోవడానికి వచ్చేశారు యష్న (మృణాల్ ఠాకూర్), మహీ (కియారా ఖన్నా), విరాజ్ (నాని). హాయ్ నాన్న మూవీ నెట్‍ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అని నెట్‍ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.

డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజులు పూర్తి కాక ముందే జనవరి 4నే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాతో పాటు ఓవర్సీస్‍లోనూ మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రశంసలను అందుకుంది. అయితే, సలార్ దుమ్మురేపుతుండడం, డెవిల్ మూవీ కూడా రావటంతో హాయ్ నాన్న థియేట్రికల్ రన్ దాదాపు చివరికి వచ్చేసింది. దీంతో, అనుకున్న దాని కంటే ఓటీటీలోకి ముందుగానే హాయ్ నాన్నను తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.

హాయ్ నాన్న సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటించారు. నాని కూతురు పాత్రను బేబి కియారా ఖన్నా పోషించారు. ఈ చిత్రంలో నాని, మృణాల్, కియారా నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. వీరి పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్‍గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఎమోషనల్‍గా తెరకెక్కించడంలో దర్శకుడు శౌర్యువ్ సఫలమయ్యారు.

హాయ్ నాన్న చిత్రంలో ప్రియదర్శి, జయరామ్, నాజర్, అంగద్ బేడీ, విరాజ్ అశ్విన్ కూడా కీలకపాత్రలు పోషించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం కూడా హాయ్ నాన్నకు చాలా ప్లస్ అయింది. ఈ చిత్రంలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి.

హాయ్ నాన్న చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.70కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని.. హిట్‍గా నిలిచింది. నాని ఖాతాలో మరో మంచి విజయం చేరింది.

Whats_app_banner