Bigg Boss 7 Telugu: ‘బిగ్‍బాస్‍లోనూ మోనితవే’: తీవ్రంగా గొడవ పడిన భోలే, శోభా శెట్టి, ప్రియాంక: వీడియో-heated argument between bhole shavali priyanka and shobha shetty in bigg boss 7 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: ‘బిగ్‍బాస్‍లోనూ మోనితవే’: తీవ్రంగా గొడవ పడిన భోలే, శోభా శెట్టి, ప్రియాంక: వీడియో

Bigg Boss 7 Telugu: ‘బిగ్‍బాస్‍లోనూ మోనితవే’: తీవ్రంగా గొడవ పడిన భోలే, శోభా శెట్టి, ప్రియాంక: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 17, 2023 03:32 PM IST

Bigg Boss 7 Telugu Day 44 Promo: బిగ్‍బాస్ ఏడో వారం నామినేషన్లు రెండో ఎపిసోడ్‍కు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా భోలే షావలి, శోభా శెట్టి, ప్రియాంక జైన్ మధ్య తీవ్రంగా గొడవ జరిగింది.

శోభా శెట్టి, భోలే షావలి
శోభా శెట్టి, భోలే షావలి

Bigg Boss 7 Telugu Day 44 Promo: బిగ్‍బాస్‍లో నామినేషన్ల ప్రక్రియ అంటేనే చాలా వాడివేడిగా జరుగుతుంది. అయితే, బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఏడో వారం నామినేషన్లు అంతకు మించి అన్నట్టు తీవ్రమైన గొడవలతో సాగుతోంది. పల్లవి ప్రశాంత్, సందీప్ అయితే మాటల యుద్ధం చేసుకున్నారు. కాగా, ఈ నామినేషన్ల తంతు మరో ఎపిసోడ్‍లోనూ జరగనుంది. నేటి (అక్టోబర్ 17) ఎపిసోడ్‍లోనూ ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ సాగనుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లు భోలే షావలి, ప్రియాంక జైన్, శోభా శెట్టి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది.

కార్తీక దీపంలో మోనిత అనే విలన్ పాత్రను శోభా శెట్టి చేశారు. హౌస్‍లో ఆమె ప్రవర్తన నచ్చని భోలే షావలి ఆ విషయాన్ని గుర్తు చేసి.. “నువ్వు బిగ్‍బాస్ హౌస్‍లోనూ మోనితవే అని ముద్ర వేస్తున్నా” అని అన్నారు. నామినేషన్ల ప్రక్రియలో వాగ్వాదం సందర్భంగా ఆయన ఈ మాట అన్నారు. ఆ తర్వాత ‘దిస్ ఈజ్ మోనిత’ అంటూ భోలే ముందున్న కుండను బద్దలుకొట్టి ఆయనను శోభ నామినేట్ చేశారు. దీంతో వెటకారంగా డ్యాన్స్ చేశారు భోలే షావలి. “ఇంతసేపు మాట్లాడింది శోభా శెట్టి” అంటూ కోపంగా అరిచారు శోభ. భోలే నోరుజారి ఏదో మాట అంటే పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు కంట్రోల్‍లో మాట్లాడు అంటూ భోలేకు వేలుచూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు శోభా శెట్టి. ఇక అంతకు ముందు భోలే, ప్రియాంక మధ్య గొడవ జరుగుతుందని ప్రోమోలో ఉంది.

“మీకు కోపం వస్తే పాపం అనిపిస్తుంది.. ఆడపిల్లలు మంచి భవిష్యత్తు ఉంది” అని భోలే షావలి అనటంతో ప్రియాంక జైన్ ఫైర్ అయ్యారు. ఆడపిల్ల.. ఆడపిల్ల అంటూ ఇంతకాలం నటించావు కదా అని భోలేపై కోపగించారు ప్రియాంక. నీలాంటి వాళ్లని చాలా మందిని చూశానని భోలే అనడంతో దీన్ని అంగీకరించనని ప్రియాంక అరిచారు. థూ అంటూ ప్రియాంక కాస్త లైన్ దాటారు. దీంతో కోపగించిన భోలే “నేను అదే థూ అంటే నీ బతుకేం కావాలి” అని అన్నారు. ఇలా.. ప్రియాంక, భోలే మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మొత్తంగా ప్రియాంక, శోభ.. భోలే షావలిని గట్టిగా టార్గెట్ చేశారు.

తాను జోక్‍గా అన్న మాటలను కూడా సీరియస్‍గా తీసుకొని తనను శోభా శెట్టి నామినేట్ చేయడంతో టేస్టీ తేజ బాగా ఫీలయ్యారు. “ప్రతీది నీకు ఫన్‍గా అనిపిస్తుంది బ్రో.. మాకు సీరియస్‍గా అనిపిస్తోంది” అని శోభా శెట్టి అనటంతో తేజ అసంతృప్తి వ్యక్తం చేశారు. “హౌస్‍లోని 12 మంది నామినేట్ చేయడం ఒక ఎత్తు.. నువ్వు చేయడం ఒక ఎత్తు” అని శోభతో చెప్పి బాధపడ్డారు తేజ. దీంతో ప్రోమో ముగిసింది. నామినేషన్ల ప్రక్రియలో పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (అక్టోబర్ 17) ఎపిసోడ్ చూడాలి.

హౌస్‍లో నుంచి బయటికి వెళ్లి.. చేయి స్కానింగ్ చేయించుకొని మళ్లీ అలా తిరిగి వచ్చేశారు శివాజీ.

IPL_Entry_Point