Hari Hara Veera Mallu Teaser: హరి హర వీర మల్లు టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి-hari hara veera mallu teaser release date fixed pawan kalyan fans get ready for the high voltage action packed teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hari Hara Veera Mallu Teaser: హరి హర వీర మల్లు టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి

Hari Hara Veera Mallu Teaser: హరి హర వీర మల్లు టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి

Hari Prasad S HT Telugu

Hari Hara Veera Mallu Teaser: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు మూవీ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్సయింది. మేకర్స్ ఈ విషయాన్ని మంగళవారం (ఏప్రిల్ 30) అధికారికంగా వెల్లడించారు.

హరి హర వీర మల్లు టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి

Hari Hara Veera Mallu Teaser: హరి హర వీర మల్లు టీజర్ వచ్చేస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ తేదీని మంగళవారం (ఏప్రిల్ 30) మేకర్స్ రివీల్ చేశారు. మే 2వ తేదీని ఈ టీజర్ రానున్నట్లు చెప్పారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం మొదటి నుంచీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హరి హర వీర మల్లు టీజర్

పవన్ కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరి హర వీర మల్లు. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ వివిధ కారణాలతో కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కెరీర్లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. మొత్తానికి ఈ మూవీ నుంచి టీజర్ వచ్చేస్తోందంటే సినిమా రిలీజ్ గడియలు కూడా త్వరలోనే రాబోతున్నట్లే.

గురువారం (మే 2) ఉదయం 9 గంటలకు హరి హర వీర మల్లు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేకమైన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఈటెలు గాల్లో ఎగురుతూ వెళ్తున్నట్లుగా చూపించారు. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో టీజర్ రిలీజ్ అని చెప్పకపోయినా.. ఆ సర్ ప్రైజ్ అదేనని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.

ఆ సర్‌ప్రైజ్ టీజరేనా లేక మూవీ రిలీజ్ డేట్ తో కూడిన సరికొత్త పోస్టరా అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలోనూ మేకర్స్ ఆ సర్‌ప్రైజ్ ఏంటో అన్న ఆసక్తిని అభిమానుల్లో కల్పించారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ ఫిమేల్ లీడ్ గా నటించనుండగా.. బాబీ డియోల్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏఎం రత్నం ఈ మూవీని నిర్మించాడు.

ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంటి వచ్చాయి. అందులో పవన్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఒకవేళ అందరూ ఊహిస్తున్నట్లు మే 2న రాబోయేది టీజరే అయితే మాత్రం అంతకంటే పెద్ద సర్ ప్రైజ్ మరొకటి ఉండదు.

హరి హర వీర మల్లు అప్డేట్

హరిహర వీరమల్లు సినిమా మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో రూపొందుతోంది. ఈ చిత్రంలో భారత యోధుడిగా పవన్ నటిస్తున్నారు. మూవీ రెండు భాగాలుగా రానుందని కూడా నిర్మాత ఏఎం రత్నం చెప్పాడు. ఒక దశలో ఈ మూవీ అటకెక్కినట్లే అన్న వార్తలూ వచ్చాయి. అయితే రెండు నెలల కిందట మూవీ టీమ్ నుంచి వచ్చిన అప్డేట్ తో సినిమా పట్టాలపైనే ఉన్నట్లు తేలింది.

ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు నడుస్తున్నట్లు ఫిబ్రవరిలో నిర్మాణ సంస్థ వెల్లడించింది. మూవీని ఓ రేంజ్ లో తీసుకురానున్నామని, అందుకే వీఎఫ్ఎక్స్ కోసం టైమ్ ఎక్కువ పడుతోందని చెప్పింది.