Guppedantha Manasu August 30th Episode: శైలేంద్ర దేవయాని చాప్టర్ క్లోజ్- మహేంద్ర కిడ్నాప్- సాక్ష్యాలతో పట్టుకున్న రిషి-guppedantha manasu serial august 30th episode devayani shailendra in trouble by proofs guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 30th Episode: శైలేంద్ర దేవయాని చాప్టర్ క్లోజ్- మహేంద్ర కిడ్నాప్- సాక్ష్యాలతో పట్టుకున్న రిషి

Guppedantha Manasu August 30th Episode: శైలేంద్ర దేవయాని చాప్టర్ క్లోజ్- మహేంద్ర కిడ్నాప్- సాక్ష్యాలతో పట్టుకున్న రిషి

Sanjiv Kumar HT Telugu
Aug 30, 2024 08:56 AM IST

Guppedantha Manasu Serial August 30th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్‌లో మహేంద్రను కిడ్నాప్ చేస్తాడు శైలేంద్ర. మహేంద్రతో రిషిపై అటాక్ నుంచి జగతిని చంపడం వరకు అన్ని చెబుతాడు. మరోవైపు ఫణీంద్రకు అన్ని నిజాలు చెబుతుంది వసుధార. రిషి, మహేంద్ర వచ్చి సాక్ష్యాలు చూపిస్తారు.

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రిషి, వసుధారలను గదిలో లాక్ చేసి మహేంద్ర ఫణీంద్ర ఇంటికి కారులో వెళ్తుంటాడు. అటు నుంచి ఎదురుగా శైలేంద్ర వస్తాడు. ఇద్దరు కారు దిగుతారు. ఏంటీ బాబాయ్ కోపంగా ఎక్కడికో వెళ్తున్నారు అని శైలేంద్ర అంటాడు. రేయ్.. అని శైలేంద్ర కాలర్ పట్టుకున్న మహేంద్ర.. నీకోసమే ఇంటికి వస్తున్నాను. నీకు ఇవాళ నూకలు చెల్లిపోయాయి. నువ్ చస్తేనే మేము మనశ్శాంతిగా బతుకుతాంరా రాక్షసుడా అని అంటాడు.

చేయి విదిలించుకున్న శైలేంద్ర.. నేను రాక్షసుడినే. నువ్ నన్ను అంతమొందిస్తావా.. నీ వల్ల కాదు కదా. ఆ దేవుడు వల్ల కూడా కాదు. నిన్ను, వసుధార, రిషి అందరిని అంతమొందిద్దామని వస్తుంటే నువ్ తగిలావ్ అని శైలేంద్ర అంటాడు. దాంతో కోపంగా శైలేంద్ర చెంప చెల్లుమనిస్తాడు మహేంద్ర. కానీ, ఇంతలో మహేంద్ర తలపై రౌడీ కర్రతో కొడతాడు. మహేంద్ర చూసేసరికి చుట్టూ రౌడీలు ఉంటారు. వాళ్లందరితో మహేంద్ర బాగా ఫైట్ చేస్తాడు.

కారులో ఎక్కించండి

కానీ, తర్వాత కిందపడిన రౌడీలు మళ్లీ లేచి మహేంద్రను పట్టుకుంటారు. వాళ్లతో మహేంద్ర ఫైట్ చేస్తుంటే వెనుక నుంచి మహేంద్ర తలపై కర్రతో కొడతాడు శైలేంద్ర. బాబాయ్ నీ గురించి నాకు తెలుసు. అందుకే నా ప్లాన్‌లో నేను ఉన్నాను. వయసైపోయినా కానీ, నీ హీరోయిజం ఇంకా అలాగే ఉంది. కానీ ఇప్పుడు ప్రయోజనం లేదు. ఇంకా చూస్తున్నారేంట్రా కారులో ఎక్కించండి అని శైలేంద్ర అంటాడు. కట్ చేస్తే మేహంద్రను తాళ్లతో కుర్చీలో కట్టిపడేస్తాడు శైలేంద్ర.

నిన్ను వదలనురా. నీ అంతు చూస్తానురా అని మహేంద్ర అంటాడు. మీ చేతి వాచ్‌లో టైమే చూసుకోలేరు. నా అంతు ఏం చూస్తారు. ఇది నా అడ్డా. నా ప్లేస్. పైగా నువ్ కట్టేసి ఉన్నావ్. ఇప్పుడు కూడా డైలాగ్స్ చెబితే ఏంటీ బాబాయ్. ఎందుకివన్నీ. అవసరమా. పరిస్థితులు మనవి కానప్పుడు నోటిపై చేతులు పెట్టుకుని సైలెంట్‌గా ఉండాలి. నువ్ నా మాటే వినాలి అని శైలేంద్ర అంటాడు. నువ్ వెధవని తెలుసు. కానీ, నువ్వింతా నీచుడివి, ఇన్ని దుర్మార్గాలు చేస్తావని అనుకోలేదని మహేంద్ర అంటాడు.

అవును, నీచుడినే. నా జాగ్రత్తలో నేనున్నా. అందుకే నిన్ను తీసుకొచ్చా. రిషికి నా నిజ స్వరూపం తెలిసిపోయింది. నన్ను రిషి చంపాలని అనుకుంటాడు. కానీ, దానికంటే ముందు నిన్ను చంపేస్తాను. నీకు నిజమెలా తెలిసింది. రిషి చెప్పాడా అని శైలేంద్ర అడుగుతాడు. జగతి పోతు పోతూ నీ పాపాల చిట్టా మొత్తం ఒక లెటర్‌లో రాసింది అని మహేంద్ర అంటాడు. చూశావా బాబాయ్ నేను ఎంత అదృష్టవంతున్నో. ఈరోజు వరకు నీకు ఆ లెటర్ దొరకలేదు. అందులో కొన్నే ఉన్నాయి. ఇప్పుడు నేను నీకు చెబుతాను చూడు అని శైలేంద్ర అంటాడు.

మను, రిషి కవలపిల్లలు

మా అమ్మ దగ్గరుండి మరి పిన్నిని బయటకు పంపించింది. రిషిపై అటాక్ చేయించి కనిపించకుండా పోయేలా చేసింది నేనే. నీపై అటాక్ చేసింది నేనే అని శైలేంద్ర అంటే.. నాకు తెలుసు అని మహేంద్ర అంటాడు. నీకు తెలియంది నేను ఒకటి చెప్పనా. మను తండ్రి ఎవరో తెలుసా అని శైలేంద్ర అంటాడు. తెలుసు. మను కన్నతండ్రిని నేనే. నీకే తెలియని ఓ విషయం నేను చెబుతాను చూడు. మను కన్నతల్లి అనుపమ కాదు. జగతి. రిషి, మను కవలపిల్లలు అని మహేంద్ర అంటాడు.

ఏంటీ బాబాయ్.. నేను నీకు షాక్ ఇద్దామనుకుంటే నువ్వే నాకు షాక్ ఇస్తున్నావ్ అని ఆశ్చర్యపోతాడు శైలేంద్ర. సరే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదు. జగతి పిన్నిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాకా తనకు ఏ సమస్య లేదన్నారు. కానీ, హఠాత్తుగా చనిపోయింది. అదెలానో తెలుసా అని శైలేంద్ర అంటాడు. అంటే.. మీరే జగతిని అని మహేంద్ర అంటుంటే.. హాహా.. మేమే జగతి పిన్ని చంపేశాం అని శైలేంద్ర నవ్వుతూ చెబుతాడు.

విషం కలిపి పిన్నికి ఇచ్చాం

జ్యూస్‌లో విషం కలిపి పిన్నికి ఇచ్చాం అని చేసింది చెబుతాడు శైలేంద్ర. పాపం పిన్నికి తెలియకా జ్యూస్ తాగి అనంతలోకాలకు వెళ్లిపోయిందని శైలేంద్ర అంటే.. కుర్చీలోనుంచి మహేంద్ర లేస్తాడు. రౌడీలు ఆపుతారు. నేను నీచుడుని అనుకుంటే.. నీ కొడుకు కూడా రంగాలా మోసం చేశాడు కదా. లోకంలో అందరూ వంద శాతం పర్ఫెక్ట్‌గా లేరని శైలేంద్ర అంటాడు. ఇక నీకు ఇన్ని నీతులు చెప్పడం వేస్ట్ అని మహేంద్రకు గన్ గురిపెడతాడు శైలేంద్ర.

మళ్లీ ఆగి.. అసలే పిన్నిని చంపి పాపం మూటగట్టుకున్నా. మళ్లీ నిన్ను చంపి డబుల్ పాపం ఎందుకు. ఈసారి ఛాన్స్ రౌడీలకు ఇస్తున్నాను. మా బాబాయ్‌ను జాగ్రత్తగా చంపండి. నా కళ్ల ముందే చంపితే చూడలేను. నేను బయటకు వెళ్లాక చేయండి అని సైకోలా బిహేవ్ చేసి వెళ్లిపోతాడు శైలేంద్ర. మహేంద్రను ఎలా చంపాలో అని రౌడీలు ప్లాన్ చేసుకుంటారు. మరోవైపు ఫణీంద్ర దగ్గరికి వసుధార వచ్చి శైలేంద్ర గురించి అడుగుతుంది.

బుకాయించిన శైలేంద్ర

ఏం జరిగింది. ఎందుకింత ఆవేశంగా ఉన్నారు అని ఫణీంద్ర అడుగుతాడు. దేవయాని వస్తే.. మీ కొడుకు ఎక్కడ. మా మావయ్య గారు ఎక్కడ అని వసుధార అంటుంది. ఇంతలో వచ్చిన శైలేంద్ర.. ఏంటీ బాబాయ్ ఇంట్లో లేడా అని అడుగుతాడు. మహేంద్ర ఇంట్లో లేడా అని ఫణీంద్ర అంటే.. కనిపించట్లేదు. అది శైలేంద్రకే తెలుసు అని వసుధార అంటుంది. నాకేం తెలియదు అని శైలేంద్ర బుకాయిస్తాడు. ఏం జరిగింది. మహేంద్ర కనిపించకపోడానికి, శైలేంద్రకు ఏంటీ సంబంధం అని ఫణీంద్ర అంటాడు.

ఉంది. ఈ లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది. కుటుంబం చెల్లాచెదురుకావడానికి కారణం ఎవరో తెలుస్తుంది అని వసుధార ఇస్తుంది. జగతి రాసిన లెటర్ ఫణీంద్ర చదువుతాడు. లెటర్ చదివిన ఫణీంద్ర గుండె పట్టుకుని కుర్చీలో కూలబడిపోతాడు. అసలు ఏముంది ఆ లెటర్‌లో, ఎవరు రాశారు అని దేవయాని అడిగితే.. జగతి మేడమ్ అని వసుధార చెబుతుంది. అందులో మీది మీ కొడుకుది నేర చరిత్ర మొత్తం ఉందని వసుధార అంటుంది.

దేవయాని ఏంటిది అని ఫణీంద్ర అడిగితే.. లేదండి అదంతా అబద్ధం, అంతా బూటకం అని దేవయాని అంటుంది. దాంతో దేవయానిపై కోపంగా లేస్తాడు ఫణీంద్ర. అదంతా వసుధారనే క్రియేట్ చేసింది. జగతి రాయలేదు. ముందునుంచి ఆమెకు మేమంటే గిట్టదు అని దేవయాని అంటుంది. ఆ లెటర్‌లో ఉన్నది అబద్ధం అని శైలేంద్ర అంటాడు. లేదు మావయ్య. వసుధార చెప్పేది నిజం. మనింటికి శని పట్టింది. కళ తప్పిందని మీరంటారు. కదా. అది మా ఆయనతోనే వచ్చిందని, ఇంట్లో జరిగిన ప్రతిదానికి మా ఆయనే కారణం అని ధరణి అంటుంది.

నిజం చెప్పిన ధరణి

ఈ విషయం నీకు ముందే తెలిస్తే.. నాకు ముందే ఎందుకు చెప్పలేదని ఫణీంద్ర అంటాడు. చిన్నత్తయ్య నా దగ్గర మాట తీసుకున్నారు. ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని అన్నారు. వాళ్లు ఎంత టార్చర్ పెట్టినా మీకోసం నిజం బయటపెట్టలేదు. ఎండీ సీటు కోసం రిషిని చంపించాలని చూశారు మావయ్య వీళ్లు, వీళ్లు చేసిన దుర్మార్గాలు, అక్రమాలు చాలా ఉన్నాయి మావయ్య అని ధరణి చెబుతుంది. దాంతో ఫణీంద్ర షాక్ అవుతాడు.

ఏ ధరణి నువ్వాగు. ధరణి కూడా వసుధారతో కలిసిపోయిందని శైలేంద్ర అంటాడు. ఇక మీరు చెప్పడం నేను వినడం ఏం లేదు. మీరు చేసిన కుట్రలు నాకు అన్నీ అర్థమైపోయాయి. మహేంద్రను ఏం చేశావ్. ఎక్కడున్నాడు తను అని శైలేంద్రను కొట్టబోతాడు ఫణీంద్ర. అన్నయ్య అంటూ మహేంద్ర వస్తాడు. మహేంద్రతో రిషి వస్తాడు. బాబాయ్ బతికే ఉన్నాడా అని శైలేంద్ర అనుకుంటాడు. ఏంటీ అన్నయ్య. అలా చూస్తున్నావ్. మా డాడ్ ఇంకా బతికే ఉన్నాడని ఆలోచిస్తున్నావా అని రిషి అంటాడు.

రేయ్ ఆపుతావా అని మహేంద్రను హగ్ చేసుకుంటాడు ఫణీంద్ర. నా ప్రాణాల కోసం ఇన్ని కష్టాలు, బాధలు పడ్డారా. వీళ్లిద్దరు చేసిన తప్పులకు పరోక్షంగా నేను బాధ్యుడుని అయ్యాను అని ఫణీంద్ర అంటాడు. వాళ్లు చేసిన తప్పులకు మీరేం చేస్తారు అని మహేంద్ర అంటాడు. నేనేం తప్పు చేయలేదని శైలేంద్ర అంటాడు. సరే అని రిషి వీడియో చూపిస్తాడు. ఇంతకముందు మహేంద్ర దగ్గర శైలేంద్ర మాట్లాడింది వీడియో చూపిస్తాడు రిషి.

నేనే చెబుతాను

అది చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. ఇది కూడా అబద్ధమే అంటావా అని రిషి అడుగుతాడు. అసలు ఈ వీడియో ఎవరు తీశారు. మా డాడ్‌ను ఎవరు కాపాడారని ఆలోచిస్తున్నావా. నీకు ఎప్పటికీ తెలియదు. అది కూడా నేనే చెబుతాను అని రిషి అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner