Guppedantha Manasu February 7th Episode: గుప్పెడంత మనసు: రిషి ఫొటోకు దండ -రచ్చ చేసిన వసు.. శైలేంద్రకు వార్నింగ్
Guppedantha Manasu February 7th Episode: రిషి చనిపోయాడనే బాధలో ఒంటరిగా కూర్చున్న వసుధారను రాజీవ్ ఇబ్బందిపెడతాడు. తనతో పాటు రావాలని బలవంతంగా లాక్కెళుతుంటాడు. ఓ కొత్త వ్యక్తి వచ్చి రాజీవ్ బారి నుంచి వసుధారను సేవ్ చేస్తాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
guppedantha manasu today episode in telugu: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్‌లో రిషి చనిపోయాడని మహేంద్ర, ముకుల్ అంటారు. రిషి చనిపోయినట్లుగా ఆధారాలు కూడా చూపిస్తాడు ముకుల్. కానీ వసుధార మాత్రం వారి మాటలు నిజం కాదని వాదిరస్తుంది. రిషి బతికే ఉన్నాడని తాను నిరూపిస్తానని ఆవేశంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఓ చోట కన్నీళ్లతో కూర్చున్న ఆమె దగ్గరకు వచ్చిన రాజీవ్ ఇప్పుడే పెళ్లి చేసుకుందామని ఇబ్బందిపెడతాడు. వసుధార వద్దని అంటోన్న వినకుండా ఆమె చేయిపట్టుకొని లాక్కెళుతుంటాడు.
రాజీవ్ భయం...
అప్పుడే కొత్త క్యారెక్టర్ తెరపైకి వస్తుంది. కారులో నుంచి సూటుబూటుతో స్టైలిష్‌గా దిగిన అతడు రాజీవ్‌ను అడ్డుకుంటాడు. వసుధార చేయి వదిలిపెట్టమని కొత్త హీరో... రాజీవ్‌కు వార్నింగ్ ఇస్తాడు. పట్టుకుంది వదిలిపెట్టడానికి కాదని రాజీవ్ బదులిస్తాడు. వదలక పోతే ఏం చేస్తావని అంటాడు.
గన్‌తో వార్నింగ్...
దాంతో వసుధారను కాపాడటానికి ఆ యువకుడు గన్ తీసి రాజీవ్‌కు గురిపెడతాడు. గన్ చూడటంతోనే భయపడిన రాజీవ్...వసుధార చేయివదిలేస్తాడు. ఫ్లేట్ ఫిరాయిస్తాడు రాజీవ్. వసుధార తన మరదలు అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అబద్ధం ఆడుతాడు. రాజీవ్ మాటలు విని వసుధార షాకవుతుంది.
అసలు నువ్వు ఎవరు...పోలీసువా, రౌడీవా, డాన్‌వా అని ఓ కొత్త వ్యక్తిని అడుగుతాడు రాజీవ్. నేను ఎవరో తెలియడం కావాలా...నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటం కావాలా అని రాజీవ్‌కు ఆ కొత్త వ్యక్తి హెచ్చరిస్తాడు. చంపేస్తానని బెదిరించడంతో రాజీవ్ భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కడ దింపాలి అని వసుధారను అడుగుతాడు కొత్త వ్యక్తి. ఎక్కడికి వెళ్లాలో తనకు తెలియదని వసుధార బదులిస్తుంది.
రిషి ఫొటోకు దండ...
వసుధార ఇంటికి వచ్చేసరికి రిషి ఫొటోకు దండ వేసి ఉండటం కనిపిస్తుంది. ఫొటో ముందు కూర్చొని మహేంద్ర, ధరణి కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. ఆ సీన్ చూసి వసుధార కోప్పడుతుంది. రిషి ఫొటోకు దండ వేసింది ఎవరూ అంటూ అందరిపై ఫైర్ అవుతుంది. ఫొటోకు ఉన్న దండ తీసి విసిరిపడేస్తుంది. మీరు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నారని, వీళ్లకు తెలియక మీ ఫొటోకు దండ వేశారని రిషి ఫొటోతో చెబుతుంది వసుధార.
రిషికి ఏం కాలేదని చెబుతున్నా మీరు ఎందుకు నా మాట నమ్మకం లేదని వసుధార అందరిని అడుగుతుంది. రిషి ఫొటోకు దండ వేసింది ఎవరో తనకు తెలియాలని కోప్పడుతుంది. రిషి త్వరలోనే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తారని వసుధార అంటుంది. మాది రిషిధారల బంధమని, అది ఎప్పటికీ విడిపోదని వసుధార చెబుతుంది. రిషి తనను విడిచిపెట్టి ఎప్పటికీ వెళ్లిపోడని అంటుంది.
తనువులు వేరైనా ప్రాణాలు ఒక్కటే...
రిషి అంటే వసుధార...వసుధార అంటే రిషి. తనువులు వేరైనా మా ప్రాణం ఒక్కటే. నేను బతికి ఉన్నది నిజమైతే రిషి బతికిఉన్నది కూడా నిజమని వసుధార చెబుతుంది.రిషి కూడా జగతి దగ్గరకు వెళ్లిపోతాడని తాను ఊహించలేదని దేవయాని అంటుంది. నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయావ్ అంటూ రిషిపై ప్రేమ ఉన్నట్లుగా దేవయాని నటిస్తుంది.
ఆమె మాటలతో వసుధార కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇంకోసారి మీ నోటి నుంచి రిషి సార్ లేడనే మాట వస్తే ఏం చేస్తానో నాకే తెలియదని వార్నింగ్ ఇస్తుంది. శైలేంద్ర కూడా ఏదో చెప్పడానికి నోరు తెరుస్తాడు. అతడి మాటలను వసుధార ఆపేస్తుంది.
నీకు మాట్లాడే అర్హతే లేదని అంటుంది. ఇప్పుడు వాడు ఏమన్నాడని శైలేంద్రపై అరుస్తున్నావని కొడుకుకు సపోర్ట్ చేస్తుంది దేవయాని. నా భర్త ఉన్నాడు. లేడని చెప్పడానికి మీరు ఎవరు అంటూ దేవయానిని ప్రశ్నిస్తుంది వసుధార. భ్రమలో ఉండకు వసుధార. వాస్తవాల్ని గుర్తించు అని వసుధారకు దేవయాని సలహా ఇస్తుంది. భ్రమలో ఉన్నది మీరు రిషి ఉన్నది నిజమని వసుధార బదులిస్తుంది. రిషి తేల్చుకోవాల్సిన లెక్కలు ఇక్కడ కొన్ని మిగిలే ఉన్నాయి. వాటిని తేలుస్తారు కూడా మీరేం బాధపడకండి అని దేవయానిని హెచ్చరిస్తుంది వసుధార.
మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు...
రిషి ఫొటోను ఎక్కడి నుంచి తీశావో అక్కడే పెట్టమని దేవయాని అంటుంది. కానీ వసుధార అందుకు ఒప్పుకోదు. అసలు మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని దేవయానిని అడుగుతుంది. రిషిని పెంచింది తానే, అతడికి తల్లి ప్రేమను పంచింది నేను, అలాంటి నన్ను ఎందుకొచ్చావని అంటావా అంటూ వసుధారపై ఫైర్ అవుతుంది దేవయాని. రిషి చనిపోయాడని నువ్వు తప్ప అందరూ నమ్ముతున్నారు. నువ్వు కూడా నమ్మితే మంచిదని వసుధారతో అంటుంది దేవయాని.
నేను నమ్మనని వసుధార ఆన్సర్ ఇస్తుంది. రిషి బతికే ఉన్నాడని చెబుతుంది. రిషిని మీలాంటివాళ్లు ఎక్కడో దాచిపెట్టి అతడు చనిపోయినట్లు నాటకం ఆడుతున్నారని దేవయానితో అంటుంది వసుధార. మీ నాటకాన్ని ఎప్పటికైనా తాను ప్రూవ్ చేస్తానని వసుధార ఛాలెంజ్ చేస్తుంది. తనను విసిగించకుండా అక్కడి వెళ్లిపొండి, మిమ్మల్ని చూడాలన్న, మీతో మాట్లాడాలన్న అసహ్యంగా ఉందని శైలేంద్ర, దేవయానిలను అవమానిస్తుంది వసుధార. వసుధార మాటలను భరించలేక దేవయాని, శైలేంద్ర కోపంగా వెళ్లిపోతారు.
అనుపమ అనుమానం...
ఆ తర్వాత రిషి ఫొటో చూస్తూ మీకేం కాలేదని, మీరు ఎక్కడున్నా నేను తీసుకొస్తానని వసుధార అంటుంది.రిషి మర్డర్ విషయంలో ముకుల్‌ను కలుస్తుంది అనుపమ. నిజంగానే రిషి చనిపోయాడా లేదా అన్నది క్లారిటీ కావాలని అంటుంది. ఎంక్వైరీ కరెక్ట్‌గానే చేశారా, ఏమైనా తప్పు చేశారా అని ముకుల్‌ను అడుగుతుంది అనుపమ. నేను దగ్గరుండి మరి అన్ని కోణాల్లో ఇన్వేస్టిగేషన్ చేసి అది రిషి డెడ్‌బాడీ అని తేల్చానని ముకుల్ బదులిస్తాడు.
రిషి చనిపోయాడని ఎంత చెప్పిన వసుధార నమ్మడం లేదని అనుపమ అంటుంది. రిషి చనిపోయాడనే నిజాన్ని మనమే తీసుకోలేకపోతున్నాం...అలాంటి వసుధార ఎలా జీర్ణించుకోగలదు...ఆమె ఆ వాస్తవాన్ని తట్టుకోవాలంటే చాలా టైమ్ పడుతుందని ముకుల్ అంటాడు. రిషి బతికి ఉన్నాడనే భ్రమ నుంచి వసుధారను వాస్తవంలోకి మనమే తీసుకురావాలని ముకుల్ చెబుతాడు.
చంపింది భద్రనేనా...
రిషిపై ఎటాక్ చేసింది ఎవరో తెలిసిందా అని ముకుల్‌ను అడుగుతుంది అనుపమ. రిషి మర్డర్‌కు సంబంధించి ఒక్క ఆధారం కూడా దొరకలేదని, ప్రస్తుతం ఇన్వేస్టిగేషన్ చేస్తున్నామని అనుపమ ప్రశ్నకు ముకుల్ సమాధానమిస్తాడు. యూత్ ఫెస్టివల్‌కు రిషి వస్తే ప్రమాదమని భావించి శైలేంద్రనే అతడిని చంపి ఉంటాడని అనుపమ డౌట్ పడుతుంది. కానీ రిషిని శైలేంద్ర హత్య చేసి ఉండకపోవచ్చునని ముకుల్ అంటాడు. భద్ర అతడిని చంపి ఉంటాడని తాను అనుకుంటున్నట్లు అనుపమతో చెబుతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.