Gundeninda Gudigantalu Today Episode: షాపింగ్‌లో రోహిణితో మీనా పోటీ - త‌ల్లితో బాలు ఛాలెంజ్ - ర‌వికి ముద్దుపెట్టిన శృతి-gundeninda gudigantalu september 30th episode balu selected expensive saree for meena ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: షాపింగ్‌లో రోహిణితో మీనా పోటీ - త‌ల్లితో బాలు ఛాలెంజ్ - ర‌వికి ముద్దుపెట్టిన శృతి

Gundeninda Gudigantalu Today Episode: షాపింగ్‌లో రోహిణితో మీనా పోటీ - త‌ల్లితో బాలు ఛాలెంజ్ - ర‌వికి ముద్దుపెట్టిన శృతి

Nelki Naresh Kumar HT Telugu
Sep 30, 2024 10:22 AM IST

Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 30 ఎపిసోడ్‌లో రోహిణి కోసం ఖ‌రీదైన ప‌ట్టుచీర‌లు సెలెక్ట్ చేసి మీనాకు మాత్రం ఐదు వంద‌ల చీర కొనాల‌ని ప్ర‌భావ‌తి ప్లాన్ చేస్తుంది. మీనా కోసం తానే కాస్ట్‌లీ ప‌ట్టుచీర కొంటాన‌ని ప్ర‌భావ‌తితో బాలు ఛాలెంజ్ చేస్తాడు.

గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 30 ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 30 ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Today Episode: త‌న‌కు పార్కులో దొరికిన కూప‌న్స్‌తో ప్ర‌భావ‌తి ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ షాపింగ్‌కు వ‌స్తారు. అదే షాపింగ్ మాల్‌కు సంజు, శృతి వ‌స్తారు.శృతిని క‌ల‌వ‌డానికి షాపింగ్‌మాల్‌కు వ‌చ్చిన ర‌వి త‌న కుటుంబ‌స‌భ్యుల‌ను చూసి కంగారు ప‌డ‌తాడు. మీనాను వ‌దిలేసి ప్ర‌భావ‌తి, రోహిణి షాపింగ్ చేస్తుంటారు. మీనాకు డ్రెస్‌ల గురించి ఏం తెలియ‌ద‌ని, త‌న‌ది డ్రెస్‌లు వేసుకునే మొహం కాద‌ని ప్ర‌భావ‌తి అంటుంది.

ప్ర‌భావ‌తి ప్లాన్‌...

మీనా ఒక్క‌తే షాపింగ్ చేస్తూ బాలు కంట‌ప‌డుతుంది. అమ్మ‌తో పాటు మిగిలిన‌వాళ్లు ఎక్క‌డున్నార‌ని అడుగుతాడు. పై ఫ్లోర్‌లో షాపింగ్ చేస్తున్నార‌ని మీనా అంటుంది. రోహిణికి కాస్ట్‌లీ చీర‌లు కొనిచ్చి...మీనాకు మాత్రం త‌క్కువ ధ‌ర‌వి కొనివ్వాల‌నే ప్ర‌భావ‌తి ఈ ప్లాన్ చేసింద‌ని బాలు అర్థం చేసుకుంటాడు.

రోహిణి ముందు మీనాను త‌క్కువ చేయాల‌ని ప్ర‌భావ‌తి వేసిన ప్లాన్ ఇద‌ని తెలిసి స‌హించ‌లేక‌పోతాడు. బాలు కోపం చూసి షాపింగ్ మాల్‌లో గొడ‌వ‌లు వ‌ద్ద‌ని మీనా అంటుంది. షాపింగ్ మాల్‌లో త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ మొత్తం ఉండ‌టం చూసి ర‌వికి ఏం చేయాలో అర్థం కాదు.షాపింగ్‌కు ర‌మ్మంటే రాన‌ని అన్న ర‌వి...మాల్‌లో క‌నిపించ‌డంతో మౌనిక షాక‌వుతాడు.

మీ రేంజ్ చీర‌లు కొన‌డం అయ్యిందా...

మౌనిక‌కు డ్రెస్‌లు కొంటామ‌ని చెప్పి ప్ర‌భావ‌తి, రోహిణి ప‌ట్టుచీర‌లు సెలెక్ట్ చేస్తుంటారు. వారి ద‌గ్గ‌ర‌కు బాలు, మీనా రాగానే..మీ రేంజ్‌కు త‌గ్గ చీర‌లు సెలెక్ట్ చేసుకోవ‌డం అయ్యిందా అంటూ చీప్‌గా మాట్లాడుతుంది ప్ర‌భావ‌తి. త‌క్కువ రేటు చీర‌లు క‌ట్టుకోవాల్సిన ఖ‌ర్మ ఈ బాలుగాడి పెళ్లానికి ప‌ట్ట‌లేద‌ని త‌ల్లికి త‌గ్గ స‌మాధానం ఇస్తాడు బాలు. మీనాకు ఇంట్లో క‌ట్టుకునే మామూలు చీర‌లు చాల‌ని, ప‌ట్టుచీర‌లు అక్క‌ర‌లేద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. ఆ త‌క్కువ రేటు చీర‌లేవో పెళ్లాం సంపాద‌న మీద ఆధార‌ప‌డి బ‌తికే మ‌నోజ్‌కు కొన‌మ‌ని బాలు సెటైర్ వేస్తాడు.

మీనా కోసం బాలు షాపింగ్‌...

ఈ కూప‌న్స్ క‌ష్ట‌ప‌డి తెచ్చింది మ‌నోజ్ అని, ఇవేం నీ తాత‌లు సంపాదించిన ఆస్తులు కాదు వాటాలు పంచుకోవ‌డానికి అని ప్ర‌భావ‌తి ఎగ‌తాళి చేస్తుంది. దాంతో త‌న డ‌బ్బుల‌తోనే భార్య‌కు చీర‌లు కొనివ్వాల‌ని బాలు ఫిక్స‌వుతాడు. ప్ర‌భావ‌తి, రోహిణి కంటే రేట్ ఎక్కువ‌గా ఉండాల‌ని సేల్స్ గ‌ర్ల్‌తో చెబుతాడు బాలు. నీ భార్య ఖ‌రీదైన ప‌ట్టుచీర‌లు క‌ట్టుకొని పూలు అల్లుతుందా అని ప్ర‌భావ‌తి దెప్పిపొడుస్తుంది. ల‌క్ష‌లు నొక్కేసి పార్ల‌ర్ పెట్ట‌దు. ల‌క్ష‌లు మింగేసి టోపీ పెట్ట‌ద‌ని మ‌నోజ్‌తో పాటు ప్ర‌భావ‌తి, రోహిణి బండారం బ‌య‌ట‌పెడ‌తాడు.

అడివి మ‌నుషులు...

బాలు మాట‌ల‌ను రోహిణి స‌హించ‌లేక‌పోతుంది. ఎక్క‌డ ఎలా ప్ర‌వ‌ర్తించాలో తెలియ‌ని అడివి మ‌నుషులు అంటూ అవ‌మానిస్తుంది. మీ ఆయ‌న తెచ్చిన ఫ్రీగా కూప‌న్స్ కావాల‌ని మేమేం ఆశ‌ప‌డ‌టం లేద‌ని, మా ఆయ‌న సంపాద‌న షాపింగ్ చేస్తున్నామ‌ని రోహిణికి మీనా స‌మాధాన‌మిస్తుంది. ఫ్రీగా వ‌స్తే ఫినాయిల్ తాగే ర‌కాల‌తో మ‌న‌కు ఎందుకు అని రోహిణి, మ‌నోజ్ గాలి తీసేస్తాడు బాలు.

మీనా మాట వినని బాలు…

మ‌నోజ్‌, రోహిణిల‌తో పోటీప‌డి త‌న‌కు ఖ‌రీదైన చీర‌లు కొన్ని బాలు అప్పుల పాలు కావ‌డం మీనాకు ఇష్టం ఉండ‌దు. త‌న‌కు చీర‌లు వ‌ద్ద‌ని అంటుంది. కానీ మీనా మాటలు బాలు విన‌డు. వెంట‌నే స‌త్యానికి ఫోన్ చేస్తుంది. బాలు త‌న‌కు ప‌దివేలు పెట్టి చీర కొంటున్నాడ‌ని, ఇప్పుడు అంత ఖ‌ర్చు అవ‌స‌ర‌మా అని స‌త్యానికితో చెబుతుంది మీనా.

బాలుకు తండ్రి స‌పోర్ట్‌...

కూప‌న్స్‌తో మీనా షాపింగ్ చేయ‌డానికి వీలులేద‌ని మ‌నోజ్‌, రోహిణి అన్నార‌ని,రోహిణికి ప‌ట్టుచీర‌లు కొని మీనాకు మాత్రంఐదు వంద‌ల చీర‌లు కొనాల‌ని ప్ర‌భావ‌తి చూస్తున్నాద‌ని తండ్రితో చెబ‌తాడు బాలు. నువ్వు వాళ్ల‌తో ఎందులో త‌గ్గ‌ద్ద‌ని, అవ‌స‌ర‌మైతే ప‌ది వేల కంటే ఎక్కువ ఖ‌రీదైన చీర కొన‌మ‌ని తాను డ‌బ్బులు పంపిస్తాన‌ని కొడుకుతో అంటాడు స‌త్యం. భ‌ర్త మాట‌లు విని ప్ర‌భావ‌తి జెల‌సీగా ఫీల‌వుతుంది. ప్ర‌భావ‌తి, రోహిణి ఎంత ఖ‌రీదైన చీర చూపిస్తే అంత‌కంటే ఎక్కువ ధ‌ర‌ది కావాల‌ని బాలు ప‌ట్టుప‌డ‌తాడు.

ర‌వి అబ‌ద్ధం...

మ‌రోవైపు ర‌వితో మాట్లాడే అవ‌కాశం కోసం శృతి ఎదురుచూస్తుంటుంది. కానీ సంజు ఆమెను వ‌దిలిపెట్ట‌డు. మ‌రోవైపు శృతితో మాట్లాడ‌టానికి ర‌వి వెళ్ల‌బోతుంటాడు. అత‌డిని బాలు ఆపుతాడు. ఎక్క‌డికి వెళుతున్నావ‌ని అంటాడు. డ్రెస్ సెలెక్ష‌న్ కోసం అని అబ‌ద్ధం ఆడుతాడు ర‌వి.

మీనాక్షికి దొరికిపోయిన శృతి...

ర‌వి, శృతి మాట్లాడుకోవ‌డం మీనాక్షి చూస్తుంది. గ‌తంలో వారిద్ద‌రిని బైక్‌పై తిర‌గ‌డం చూసిన సంగ‌తి జ్ఞాప‌కం వ‌స్తుంది. ఈ విష‌యం ప్ర‌భావ‌తికి చెబుతుంది. బాగా డ‌బ్బున్న పిల్ల‌లా ఉందా అని ప్ర‌భావ‌తి ఆరాలు తీస్తుంది. శృతి గురించి కామాక్షి, ప్ర‌భావ‌తి వెత‌క‌డం మొద‌లుపెడ‌తారు.

ప్ర‌భావ‌తి త‌న‌కోసం వెత‌క‌డం చూసి కంగారు ప‌డి ట్ర‌య‌ల్ రూమ్‌లో దాక్కోవ‌డానికి వెళుతుంది శృతి. అప్ప‌డికే ట్ర‌య‌ల్ రూమ్‌లో ర‌వి ఉంటాడు. ర‌వికి ముద్దిస్తుంది శృతి. ఇద్ద‌రు బ‌య‌ట‌కు వెళ్ల‌బోతుండ‌గా ట్ర‌య‌ల్ రూమ్ బ‌య‌ట బాలు, శృతి ఉంటారు. అక్క‌డితో నేటి గుండెనిండా గుడిగంట‌లు సీరియ‌ల్ ముగిసింది.