Gunde Ninda Gudi Gantalu: యాక్టింగ్‌లో భర్తను మించిన మీనా - కొట్టుకున్న బాలు, మనోజ్ - తగ్గేదేలే అన్న రోహిణి
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 28 ఎపిసోడ్‌లో తాగేసి ఇంటికొచ్చిన బాలు...మనోజ్‌తో గొడవపడతాడు. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు. ఈ గొడవలో అనుకోకుండా రోహిణిని కొడతాడు బాలు. కొడుకుల చేసిన పని చూసి సత్యం తట్టుకోలేకపోతాడు. గుండెపోటుతో కుప్పకూలపోతాడు.
Gunde Ninda Gudi Gantalu: మళ్లీ తన ముఖం చూడొద్దని, జీవితంలో నిన్ను క్షమించేది లేదని అన్న మాటలకు మీనా ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుందోనని బాలు భయపడిపోతాడు. మీనాకు తన ఫ్రెండ్ చేత ఫోన్‌చేయిస్తాడు. కానీ మీనా మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా కట్‌చేస్తుంది. దాంతో నేరుగా మీనా ఇంటికి వెళతాడు. తాను మీనా ఇంట్లోకి వెళ్లకుండా ఫ్రెండ్ రాజేష్‌ను పంపిస్తాడు బాలు. మీనా ఇంట్లో ఉందో లేదో తెలుసుకొని రమ్మని అంటాడు. రాజేష్‌తో మాట్లాడటానికి మీనా బయటకు వస్తుంది. మీనాను చూసి బాలు రిలీఫ్‌గా ఫీలవుతాడు.
ఆటపట్టించిన మీనా...
బాలు కనిపించడం లేదని, ఎక్కడున్నాడో అడుగుదామని ఇక్కడికి వచ్చానని మీనాతో అంటాడు రాజేష్. బాలు కారులోనే ఉన్నాడని మీనా కనిపెడుతుంది. నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది అని రాజేష్‌ను అడుగుతుంది మీనా. బాలు చెప్పాడని తాగిన మత్తులో రాజేష్ తానే బయటపడతాడు.
బాలు ఏమయ్యాడని రాజేష్ అడగ్గా...మా ఇంట్లోనే ఉన్నాడని, భోజనం చేసి పడుకున్నాడని మీనా అతడికి ఆటపట్టిస్తుంది. రాజేష్ వచ్చి లేపితే సన్నాసికి పనీపాట లేదని, తాగడానికి పిలిస్తే నేను ఇంట్లో లేనని చెప్పమని అన్నాడని రాజేష్‌కు పంచ్ ఇస్తుంది మీనా. రాజేష్ వెళ్లిపోగానే నేను బతికానోలేదో తెలుసుకోవడానికే బాలు ఇదంతా చేస్తున్నాడని తల్లితో అంటుంది మీనా.
భర్తతో మాట్లాడని మీనా...
బాలుతో మాట్లాడమని కూతురికి సలహా ఇస్తుంది మీనా తల్లి. కానీ మీనా మాత్రం భర్తతో మాట్లాడటానికి ఒప్పుకోదు. తాను కనపడటం లేదని అనగానే మీనా వణికిపోయిందా, భయంతో కంగారుపడిందా అని రాజేష్‌ను అడుగుతాడు. కానీ మీనా నీకంటే ముదురుగా ఉందని, నువ్వు ఇంట్లోనే ఉన్నావని నన్నే ఆటపట్టించిందని అంటాడు. నేను కనిపించడం లేదంటే కాస్త కూడా భయపడలేదా రాక్షసి అని భార్యపై బాలు ఫైర్ అవుతాడు.
కష్టపడి జాబ్ చేసి వచ్చానని, తన కోసం దోశలు వేయమని తల్లికి ఆర్డర్‌వేస్తాడు మనోజ్. కారు షోరూమ్‌లోనిలబడి ఆలిసిపోయి ఉంటాడని మనోజ్‌పై సింపథీ చూపిస్తుంది రోహిణి. రోజు పార్క్‌కు వెళ్లి పడుకుంటూ ఎంతకాలం భార్యను మోసం చేస్తావని కొడుకుకు క్లాస్ ఇస్తుంది ప్రభావతి. ఎన్నాళ్లు ఈ నాటకాలు ఆడుతావని అంటుంది.
తాగేసి వచ్చిన బాలు...
బాలు కోసం సత్యం ఎదురుచూస్తుంటాడు. అప్పుడే ఫుల్‌గా తాగేసి బాలు ఇంట్లో అడుగుపెడతాడు. తాగోవచ్చావా అని కొడుకును నిలదీస్తాడు సత్యం. ఫుల్‌గా తొగొచ్చాడు కనిపించడం లేదా అని తండ్రితో మనోజ్ అంటాడు. నీలా పెళ్లాం డబ్బులు ఖర్చుపెట్టుకొని తాగనని, నా సొంత డబ్బులతో తాగానని బాలు అంటాడు.
తప్పు చేసింది మీనా...
దేవుడి లాంటి నిన్ను మోసం చేసిన రవిని పిచ్చి పిచ్చిగా కొట్టేసివచ్చానని తాగిన మత్తులో తండ్రితో అంటాడు బాలు నాలుగు రోజులు మంచం మీద నుంచి లేవకుండా కుమ్మేశానని చెబుతాడు. బాలు మాటలు విని ఇంట్లోవాళ్లు షాకవుతారు. తప్పు చేసింది మీనా అయితే దానిని కొట్టకుండా రవిని ఎందుకు కొట్టవాని బాలుపై ప్రభావతి ఫైర్ అవుతుంది. పెళ్లాన్ని కొట్టడం తప్పు అని బాలు అంటాడు. స్టేషన్‌లో వదిన చెంపపై ఎందుకు కొట్టవాని మౌనిక అడుగుతుంది. మంచి పనిచేశావని బాలును వెనకేసుకువస్తుంది ప్రభావతి. మీనా వల్లే భర్తకు పోలీస్ స్టేషన్‌లో అవమానం జరిగిందని అంటుంది.
సమస్యలకు కారణం నువ్వే...
రవి వల్ల వీధిలో నడవాలంటే అవమానంగా ఉందని మనోజ్ అంటాడు. నువ్వు కూడా ఓ అమ్మాయితో లేచిపోవాలనే ఇంట్లో నుంచి నలభై లక్షలు ఎత్తుకొని పారిపోయావు కదా మనోజ్‌పై సెటైర్లువేస్తారు బాలు. నీ భార్యే రవికి దొంగపెళ్లి చేసిందని మనోజ్ కోపంగా తమ్ముడితో అంటాడు. ఆ రోజు నువ్వు పెళ్లి మండపం నుంచి పారిపోవడం వల్లే మీనా నా భార్య అయ్యిందని, ఈ సమస్యలు అన్నింటికి కారణం నువ్వేనని మనోజ్‌ను తప్పుపడతాడు బాలు.
బాలుతో రోహిణి వాదన...
రవి, మనోజ్ ఇద్దరికి ఇద్దరు దద్దమ్మలేనని బాలు అంటాడు. నువ్వు ఇంటిని ఉద్దరించడానికి పుట్టావా...బార్‌ల వైన్ షాప్‌లను పోషించడం తప్ప నువ్వు చేసిందేమి లేదని బాలుపై రోహిణి ఫైర్ అవుతుంది. మీ నాన్న పంపించిన డబ్బులతో నేను తాగడం లేదని బాలు బదులిస్తాడు. బాలు, రోహిణి ఒకరినొకరు వాదించుకోవడంతో గొడవ పెద్దదవుతుంది. మనోజ్ ఏమైనా నీలా తాగి రోడ్లపై తిరుగుతున్నాడా...నీలా అందరిని కొట్టి రౌడీ అని పేరుతెచ్చుకున్నాడా అంటూ బాలుతో గొడవపడుతుంది.
మనోజ్‌కు బాలు వార్నింగ్...
నీ పెళ్లాన్ని ఎక్కువ మాట్లాడొద్దని చెప్పమని మనోజ్‌కు వార్నింగ్ ఇస్తాడు బాలు. నీ భార్యను కంట్రోల్‌లో పెట్టడం చేతకాక నా భార్యను అంటే ఊరుకోనని బాలుపై రెచ్చిపెతాడు మనోజ్. నాకుగానీ మండితే రవిగాడిని కొట్టినట్లే ఈ లక్షలు మింగినోడిని కొడతానని బాలు అంటాడు. మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. మనోజ్ అతడిని నెట్టివేస్తాడు. ఆ కోపంతో మనోజ్ చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడు బాలు. ఇద్దరు గొడవపతారు. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు. మనోజ్‌ను బాటు కొట్టబోతుండగా అతడు తప్పుకోవడంతోఆ దెబ్బ రోహిణికి తగులుతుంది.
గుండెపోటుతో కుప్పకూలిన బాలు...
బాలు, మనోజ్‌లపై సత్యం దులిపేస్తాడు సత్యం. మీ ముగ్గురిని ఒకేలా పెంచితే ఒకరి తర్వాత మరొకరు నా నమ్మకాన్ని ముక్కలు చేస్తున్నారని కోప్పడుతాడు. రవి కష్టపడి చదివిస్తే నా పరువు తీసి ఓ అమ్మాయిని లేపుకుపోయి పెళ్లిచేసుకున్నాడని అంటాడు. నా ముగ్గురు కొడుకులు ఒక్కటిగా కలిసిబతకాలని అనుకున్నానని, ఇంటి పరువు నిలబెట్టాలని అనుకున్నానని సత్యం ఎమోషనల్ అవుతాడు. కానీ నా ఇంటిని ముక్కలు చేస్తూ బతికుండగానే కొట్టుకొని చస్తున్నారని సత్యం అంటాడు.
ఆవేశంలో గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోతాడు. అతడిని అందరూ కలిసి హాస్పిటల్‌కు తీసుకొస్తారు.
మీనాకు పీడకల...
మీనాకు పీడ కల రావడంతో ఒక్కసారిగా కేకవేస్తూనిద్ర నుంచి మేల్కొంటుంది. కొద్దిరోజులుగా మనసుకు ఏదో కీడు శంకిస్తుందని, జరగరానిది ఏదో జరిగినట్లుగా అనిపిస్తుందని భయపడుతుంది. కూతురు కాపురం గురించి తల్చుకొని మీనా తల్లి కూడా ఎమోషనల్ అవుతుంది. ఈ సమస్యకు కారణమైన సుమతిపై కోప్పడుతుంది.
కండీషన్ క్రిటికల్...
సత్యానికి మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆయన కండీషన్ క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెబుతారు. సత్యానికి ఇలా కావడానికి బాలునే కారణమని ప్రభావతి ఆరోపిస్తుంది. తాగొచ్చి నువ్వు చేసిన గొడవ వల్లే సత్యానికి ఇలా అయ్యిందని, ఆయన్ని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదని కొడుకుపై కోప్పడుతుంది. సత్యం గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరాడని తెలిసి కంగారుగా మీనా వస్తుంది. కానీ సత్యాన్ని మీనా కలవడానికి ప్రభావతి ఒప్పుకోదు. మా ఇంట్లో అడుగుపెట్టి తెచ్చిపెట్టిన అరిష్టాలు చాలని అంటుంది. ఆమెను హాస్పిటల్ నుంచి మనోజ్ వెళ్లగొడతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్