Garudan OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-garudan ott streaming super hit tamil action thriller now streaming in amazon prime video and two other otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Garudan Ott Streaming: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Garudan OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jul 03, 2024 09:58 AM IST

Garudan OTT Streaming: తమిళ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గరుడన్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (జులై 3) నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Garudan OTT Streaming: ఓటీటీలోకి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఈ సినిమా పేరు గరుడన్. తమిళంలో మే 31న రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. తమిళ నటుడు సూరి లీడ్ రోల్లో నటించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాను ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

గరుడన్ ఓటీటీ స్ట్రీమింగ్

తమిళ మూవీ గరుడన్ మే 31న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా బుధవారం (జులై 3) నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే కేవలం తమిళంలోనే మూవీని చూడాలి. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీ ఓటీటీలోకి వచ్చింది. నిజానికి జూన్ 28నే సినిమా వస్తుందని భావించినా.. ఐదు రోజులు ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది.

గరుడన్ మూవీలో సూరితోపాటు శశికుమార్, ఉన్నిముకుందన్ కీలకపాత్రలు పోషించారు. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కథ సాగుతున్నకొద్దీ వీళ్ల మధ్య విభేదాలు వస్తాయి. ఆ తర్వాత గొడవలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలోనే చూడాలి. రిలీజ్ రోజు నుంచే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. సూరి నటన చాలా బాగుందని ప్రశంసించారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోతోపాటు సింప్లీ సౌత్, టెంట్ కొత్తా ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

20 కోట్ల బ‌డ్జెట్‌.. 50 కోట్ల క‌లెక్ష‌న్స్‌

మే 31న థియేట‌ర్ల‌లో రిలీజైన గ‌రుడ‌న్ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.20 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంది రూ.50 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వెట్రిమార‌న్ క‌థ‌తో పాటు సూరి, శ‌శికుమార్ క్యారెక్ట‌ర్స్‌, వారి న‌ట‌న అభిమానుల‌ను మెప్పించాయి.

గ‌రుడ‌న్ మూవీకి క‌థ‌ను అందిస్తూనే ప్రొడ్యూస‌ర్ల‌లో ఒక‌రిగా వెట్రిమార‌న్ వ్య‌వ‌హ‌రించాడు. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ విడుద‌ల సినిమాతోనే క‌మెడియ‌న్‌ సూరి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

గ‌రుడ‌న్ మూవీ క‌థ ఇదే

చెన్నై సిటీ మ‌ధ్య‌లో ఉన్న కోట్ల విలువైన భూమిని త‌న సొంతం చేసుకోవ‌డానికి మినిస్ట‌ర్‌ ప్ర‌య‌త్నిస్తాడు. సొక్క (సూరి), క‌రుణ (ఉన్ని ముకుంద‌న్‌), ఆది (శ‌శికుమార్‌) అనే ముగ్గురు స్నేహితులు ఆ మినిస్ట‌ర్‌ను ఎలా ఎదురించారు? ఈ పోరాటంలో ముగ్గురు స్నేహితులు ఎందుకు శ‌త్రువులుగా మారారు?

ఊరి గుడిలో ఎన్నో ఏళ్లుగా భ‌ద్రంగా దాచిన ఓ పెట్టెలో ఏముంది? ఆ బాక్స్‌ను ద‌క్కించుకునేందుకు మినిస్ట‌ర్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? మినిస్ట‌ర్‌పై చేసిన పోరాటంలో ముగ్గురు ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Whats_app_banner