Garudan OTT: ఓటీటీలోకి వెట్రిమారన్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?
Garudan OTT: వెట్రిమారన్ కథను అందిస్తూ ప్రొడ్యూస్ చేసిన తమిళ సూపర్ హిట్ మూవీ గరుడన్ ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
Garudan OTT: రీసెంట్ తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ గరుడన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సూరి, శశికుమార్‌తో పాటు భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోలుగా నటించారు. గరుడన్ మూవీకి కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ కథను అందించాడు. ఆర్ ఎస్ దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహించాడు.
20 కోట్ల బడ్జెట్....యాభై కోట్ల కలెక్షన్స్...
మే 31న థియేటర్లలో రిలీజైన గరుడన్ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. వెట్రిమారన్ కథతో పాటు సూరి, శశికుమార్ క్యారెక్టర్స్, వారి నటన అభిమానులను మెప్పించాయి.
అమెజాన్ ప్రైమ్‌లో...
గరుడన్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. థియేటర్లలో కేవలం తమిళంలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం, కన్నడంతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతోన్నారు.
గరుడన్ మూవీకి కథను అందిస్తూనే ప్రొడ్యూసర్లలో ఒకరిగా వెట్రిమారన్ వ్యవహరించాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన విడుదలై సినిమాతోనే కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విడుదలై తో పాటు గరుడన్‌తో హీరోగా వరుసగా సెకండ్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
గరుడన్ మూవీ కథ ఇదే.
చెన్నై సిటీలో మధ్యలో ఉన్న కోట్ల విలువైన భూమిని తన సొంతం చేసుకోవడానికి మినిస్టర్ ప్రయత్నిస్తాడు. సొక్క (సూరి), కరుణ (ఉన్ని ముకుందన్), ఆది (శశికుమార్) అనే ముగ్గురు స్నేహితులు ఆ మినిస్టర్‌ను ఎలా ఎదురించారు?
ఈ పోరాటంలో ముగ్గురు స్నేహితులు ఎందుకు శత్రువులుగా మారారు? ఊరి గుడిలో ఎన్నో ఏళ్లుగా భద్రంగా దాచిన ఓ పెట్టెలో ఏముంది? ఆ బాక్స్‌ను దక్కించుకునేందుకు మినిస్టర్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? మినిస్టర్‌పై చేసిన పోరాటంలో ముగ్గురు ఎలాంటి కష్టాలు పడ్డారు అన్నదే ఈ మూవీ కథ.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్...
గరుడన్ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్ర పోషించాడు. రోషిని హరిప్రియన్, శివద హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం విడుదలై మూవీకి సీక్వెల్‌గా విడుదలై ను తెరకెక్కిస్తోన్నాడు వెట్రిమారన్. ఈ సీక్వెల్‌లో విజయ్ సేతుపతితో పాటు సూరి హీరోలుగా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌తో వెట్రిమారన్ ఓ బైలింగ్వల్ మూవీ చేయబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
టాపిక్