OG Movie: సరిపోదా శనివారం ఈవెంట్‍లో ‘ఓజీ’ హోరు.. నిర్మాత ఏమన్నారంటే..-fans chants pawan kalyan movie og name at saripodhaa sanivaaram trailer launch event video goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Og Movie: సరిపోదా శనివారం ఈవెంట్‍లో ‘ఓజీ’ హోరు.. నిర్మాత ఏమన్నారంటే..

OG Movie: సరిపోదా శనివారం ఈవెంట్‍లో ‘ఓజీ’ హోరు.. నిర్మాత ఏమన్నారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 13, 2024 10:28 PM IST

OG Movie: నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. అయితే, ఈవెంట్‍లో పవన్ కల్యాణ్ చేస్తున్న ఓజీ సినిమా పేరు హోరెత్తింది. ఒక్కసారి ప్రేక్షకులు భారీగా ఓజీ.. ఓజీ అంటూ అరిచారు. దీంతో నిర్మాత స్పందించారు.

OG Movie: సరిపోదా శనివారం ఈవెంట్‍లో ‘ఓజీ’ హోరు.. నిర్మాత ఏమన్నారంటే..
OG Movie: సరిపోదా శనివారం ఈవెంట్‍లో ‘ఓజీ’ హోరు.. నిర్మాత ఏమన్నారంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రానున్న ఓజీ సినిమాపై ఓ రేంజ్‍లో హైప్ ఉంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టడంతో ఓజీ షూటింగ్‍కు మళ్లీ ఎప్పుడు వెళతారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్‍స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఓజీని దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ చాలా పాపులర్ అయింది. అయితే, ఓజీ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు. నేడు (ఆగస్టు 13) జరిగిన సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేదికగా ఇది మరోసారి నిరూపితమైంది.

ఓజీ.. ఓజీ అంటూ హోరు

సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‍లోని సుదర్శన్ థియేటర్లో జరిగింది. ఈ ఈవెంట్‍కు ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. థియేటర్ ఫుల్‍గా నిండిపోయింది. అయితే, నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడేందుకు సిద్ధమైన సమయంలో ప్రేక్షకులు ఒక్కసారిగా ‘ఓజీ.. ఓజీ’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో థియేటర్ మొత్తం ఓజీ మోతతో హోరెత్తింది. ఓజీ మూవీని కూడా డీవీవీ దానయ్యే నిర్మిస్తున్నారు. దీంతో ఆ చిత్రం గురించి చెప్పాలంటూ ప్రేక్షకులు అలా అరిచారు.

ప్రేక్షకులు ఓజీ అంటూ అరవడంతో నాని, ఎస్‍జే సూర్య కూడా ఒక్కసారిగా నవ్వారు. ఓజీ అంటూ జనాలు హోరెత్తించటంతో దానయ్య దీనిపై స్పందించారు. “ఓకే.. వస్తుంది.. వస్తుంది” అని చెప్పారు. మొత్తంగా సినీ అభిమానుల్లో ఓజీ సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మరోసారి నిరూపితమైంది.

ఓజీ సినిమా షూటింగ్‍ను పవన్ కల్యాణ్ మళ్లీ త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవలే మళ్లీ ఆయన ఆ లుక్‍కు మారుతున్నట్టు కనిపిస్తోంది. తాను మంత్రిత్వ శాఖల బాధ్యతలే ప్రధానంగా చేస్తానని, వీలైనంత మేర వారానికి ఒకటి రెండు రోజులు షూటింగ్‍ల్లో పాల్గొని అంగీకరించిన సినిమాలు పూర్తి చేస్తానని ఇటీవలే ఆయన చెప్పారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను పవన్ చేయాల్సి ఉంది. వీటిలో ఓజీనే ముందుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓజీ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు డీవీవీ దానయ్య. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రావటంతో షూటింగ్ నిలిచిపోయింది. వచ్చే ఏడాది జూన్‍లోగా ఈ మూవీని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సరిపోదా శనివారం ట్రైలర్ అదుర్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా వస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 29న పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నుంచి నేడు (ఆగస్టు 13) వచ్చింది. మాస్ యాక్షన్‍తో నాని అదరగొట్టారు. యాక్షన్, ఎలివేషన్లు, అదిరిపోయే బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో ట్రైలర్ దుమ్మురేపింది. ఈ మూవీలో నానితో పాటు ప్రియాంక మోహన్, ఎస్‍జే సూర్య, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.